అక్షయ్ కుమార్ ఏడాది సంపాదన తెలిస్తే షాకే.. ఎన్ని వందల కోట్లంటే.. వరల్డ్‌లోనే 4 స్థానంలో!
బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ తన కెరీర్‌లో మరో అరుదైన ఘనతను సొంతం చేసుకొన్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వర్గాల గురించి తెలిపే జాబితా ఫోర్బ్స్ జాబితాలో చేరిన భారతీయ సినీ హీరోగా క్రెడిట్ కొట్టేశారు. ప్రపంచ సినిమా పరిశ్రమలో అత్యధిక సంపాదన కలిగిన వ్యక్తి అంటూ ఫోర్బ్స్ తన జాబితాలో పేర్కొన్నారు. ఇంతకు అక్షయ్ కుమార్ ఏడాది సంపాదన ఎంత? ఫోర్బ్స్ జాబితాలో ఎన్నో స్థానంలో ఉన్నారంటే..

అత్యధిక సినిమాలు చేసే హీరోగా
హిందీ చిత్ర పరిశ్రమలో ప్రతీ ఏడాది ఎక్కువగా సినిమాల్లో నటించే హీరో ఎవరైనా ఉన్నారంటే అది అక్షయ్ కుమార్ అని చెప్పవచ్చు. ఏడాదికి నాలుగు సినిమాలకు తక్కువ కాకుండా చకచకా సినిమాలు పూర్తి చేసేస్తాడు. మూడు నెలలకోసారి తన సినిమాను ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా కెరీర్‌ను ప్లాన్ చేసుకొంటారు. అలాగే సంపాదన విషయంలో గట్టిగానే రెమ్యునరేషన్‌ను జేబులో వేసుకొంటాడు.

సినీ హీరోగా 4 స్థానంలో, ఓవరాల్‌గా 52 స్థానంలో
ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. అక్షయ్ కుమార్ ప్రపంచంలోనే అత్యధిక సంపాదన కలిగిన సినీ హీరోగా నాలుగో స్థానంలో, ఓవరాల్‌గా 52వ స్థానంలో నిలిచారు. జూన్ 1, 2018 నుంచి జూన్ 1, 2019 వరకు సుమారు 466 కోట్ల రూపాయలు అంటే 65 మిలియన్ డాలర్లను సంపాదించారు. ఇది ప్రపంచంలోనే అతి కొద్ది మాత్రమే సాధించిన ఘనతగా ఫోర్బ్స్ పేర్కొన్నది.

దాన ధర్మాలు చేయడంలో టాప్
అక్షయ్ కుమార్ సంపాదనలో కాకుండా విరాళాలు, దానధర్మాలు చేయడంలో కూడా ముందు వరుసలో నిలుస్తారు. కోవిడ్ సంక్షోభం నేపథ్యంలో ప్రధాని మోదీ నిధికి రూ.25 కోట్ల విరాళం ప్రకటించారు. అలాగే 3 కోట్ల రూపాయలను ముంబై మున్సిపల్ కార్పోరేషన్‌కు, ముంబై పోలీసుల ఫౌండేషన్‌కు రూ.2 కోట్లు విరాళం ప్రకటించారు.
Recommended Video

తాజా ఫోర్బ్స్ జాబితా ప్రకారం..
తాజా ఫోర్బ్స్ జాబితా ప్రకారం.. కైలీ జెన్నెర్ అనే పారిశ్రామిక వేత్త 590 మిలియన్ల డాలర్తతో మొదటి స్థానంలో నిలిచారు. ఈయన జూన్ 2019 నుంచి మే 2020 వరకు 170 మిలియన్ డాలర్ల మేర సంపాదించారు. ఈ జాబితాలో 10 స్థానాల్లో రోజర్ ఫెదరర్, క్రిస్టియానో రొనాల్డో, లీనెల్ మెస్సీ, టైలర్ పెర్రీ, ఫుట్ బాల్ క్రీడాకారుడు నేమార్, టెలివిజన్ హోస్ట్ హోవార్డ్ స్టెర్న్, అమెరికన్ బాస్కెట్ బాల్ ప్లేయర్ లీబ్రాన్ జేమ్స్ టాప్ 10 స్థానాల్లో నిలిచారు.


Click it and Unblock the Notifications











