బ్రేకింగ్: Akshay Kumar తీవ్ర విషాదంలో బాలీవుడ్ నటుడు.. తల్లి మరణంతో పుట్టెడు దు:ఖంలో..

బాలీవుడ్ సూపర్‌స్టార్ అక్షయ్ కుమార్‌క తీవ్ర విషాదంలో కూరుకుపోయారు. తన ప్రాణంకంటే ఎక్కువైన తన తల్లి అరుణ భాటియా అనారోగ్యంతో కన్నుమూశారు. అరుణ భాటియా మరణంతో అక్షయ్ కుమార్ కుటుంబం కన్నీటిసాగరంలో మునిగిపోయింది. మాత‌‌ృ వియోగంతో బాధపడుతున్న అక్షయ్ కుమార్‌కు సినీ ప్రముఖులు, సన్నిహితులు, స్నేహితులు, అభిమానులు, నెటిజన్లు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. అక్షయ్ కుమార్ తల్లి మరణానికి సంబంధించిన పూర్త వివరాల్లోకి వెళితే..

 ముంబైలోని ప్రముఖ హాస్పిటల్‌లో

ముంబైలోని ప్రముఖ హాస్పిటల్‌లో

అక్షయ్ తల్లి అరుణ భాటియా తీవ్ర అనారోగ్యంతో ముంబైలోని హరినందానీ హస్పిటల్‌లోని ఐసీయూలో చికిత్స పొందుతున్నారు. తన తల్లి ఆరోగ్యం బాగాలేదని తెలుసుకొన్న అక్షయ్ కుమార్ ఇటీవల యూకే నుంచి ముంబైకి తిరిగి వచ్చి తన తల్లి ట్రీట్‌మెంట్‌పై దృష్టిపెట్టారు.

హుటాహుటిన యూకే నుంచి ముంబైకి అక్షయ్

హుటాహుటిన యూకే నుంచి ముంబైకి అక్షయ్

తన తల్లి ఆరోగ్యం విషమంగా ఉందనే విషయం గురించి తెలుసుకొన్న అక్షయ్ కుమార్ హుటాహుటినా యూకే నుంచి భారత్‌కు చేరుకొన్నారు. అక్షయ్ తల్లి ఆరోగ్యం క్షీణించిందనే విషయం తెలుసుకొన్న నెటిజన్లు ఆమె ఆరోగ్యం మెరుగుపడాలని మంగళవారం సోషల్ మీడియాలో ప్రార్థించారు. అరుణా భాటియా సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఆకాంక్షించారు.

అరుణా భాటియా ఆరోగ్యం గురించి

అరుణా భాటియా ఆరోగ్యం గురించి

నెటిజన్ల ప్రార్థనల నేపథ్యంలో నా తల్లి ఆరోగ్యం గురించి మీరు చేస్తున్న ప్రార్థనలతో నా హృదయం భావోద్వేగంతో భారంగా మారింది అని అక్షయ్ కుమార్ మంగళవారం ట్వీట్ చేశారు. కానీ తల్లిని బతికించుకోవడానికి చేసిన ప్రయత్నాల విఫలం కావడంతో దు:ఖసాగరంలో అక్షయ్ కుమార్ మునిగిపోయింది.

తల్లి మరణంపై అక్షయ్ కుమార్ ఎమోషనల్‌గా

తల్లి మరణంపై అక్షయ్ కుమార్ ఎమోషనల్‌గా

తన తల్లి మరణం గురించి అక్షయ్ కుమార్, ఆయన సోదరి సోషల్ మీడియా ద్వారా ధృవీకరించారు. ట్విట్టర్‌లో పోస్టు చేసిన అక్షయ్ కుమార్ భావోద్వేగానికి గురయ్యారు. నాకు నా తల్లి అత్యంత బలం. ఆమె ఇక లేరనే విషయం గుండెను పిండేస్తున్నది. నా తల్లి శ్రీమతి అరుణ భాటియా ప్రశాంతంగా ఈ లోకం నుంచి నిష్రమించారు. పరలోకంలో ఉన్న నా తండ్రిని చేరుకొనేందుకు వెళ్లారు. నా కుటుంబం అత్యంత విషాదంలో ఉన్న సమయంలో ఆమె కోసం మీ సంతాప సందేశాలను గౌరవిస్తాను. ఓం శాంతి అంటూ అక్షయ్ కుమార్ ట్వీట్ చేశారు.

Recommended Video

Prabhas Special Interview With Sridevi Soda Center Team
ట్విట్టర్‌లో సంతాపాల వెల్లువ

ట్విట్టర్‌లో సంతాపాల వెల్లువ

తన తల్లి మరణం నేపథ్యంలో అక్షయ్ కుమార్ చేసిన ట్వీట్‌తో అభిమానులు, స్నేహితులు, సన్నిహితులు తీవ్ర దిగ్బ్రాంతికి గురయ్యారు. అరుణా భాటియా ఆత్మకు శాంతి చేకూరాలని, అలాగే ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని నెటిజన్లు ప్రార్తిస్తున్నారు. అక్షయ్ కుమార్ కుటుంబానికి మనోధైర్యం కలిగించాలని భగవంతుడిని వేడుకొంటున్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X