పెళ్లాం ఏది చెబితే అది చేస్తున్నా.. అలీకి కరోనా చుక్కలు
ఎప్పుడూ బిజీగా ఉండే సినీ తారలు కరోనావైరస్ దెబ్బకు గృహ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఇళ్లు తప్ప మరో ప్రపంచం కనిపించడం లేదు. సినీ పరిశ్రమలో స్టార్ హీరోల నుంచి చిన్నపాటి క్యారెక్టర్ ఆర్టిస్టులకు వరకు ఇదే పరిస్థితి నెలకొన్న ఉంది. తాజాగా కరోనా కష్టాలను స్టార్ కమెడియన్ అలీ వివరిస్తూ..

అలీ గృహనిర్బంధం
కరోనావైరస్ కారణంగా ప్రభుత్వాలు మూడు వారాల లాక్‌డౌన్ ప్రకటించడంతో హీరో, కమెడియన్ అలీ ఇంటికే పరిమితమయ్యారు. ప్రస్తుతం సంపూర్ణమైన గృహ జీవితాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. కుటుంబంతో కలిసి లైఫ్‌ను ముందుకు తీసుకెళ్తూనే సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తున్నారు.

తెలుగు రాష్ట్రాలకు ఆర్థిక సహాయం
సోషల్ డిస్టెన్స్ పాటిస్తున్న అలీ ఇటీవలే ప్రభుత్వాలకు అండగా నిలిచారు. కరోనాపై పోరాటంలో తన వంతు బాధ్యతగా ఆర్థిక సహాయాన్ని అందించేందుకు ముందుకు వచ్చారు. తెలంగాణ ప్రభుత్వానికి లక్ష రూపాయలు, ఏపీ ప్రభుత్వానికి లక్ష రూపాయలు సాయంతో మొత్తం రెండు లక్షల రూపాయలను ఇవ్వడానికి సిద్దమయ్యారు. అలాగే సినీ ప్రముఖులంతా స్పందించాలని కోరారు.

కరోనా అంతానికి నమాజ్
ఇక కరోనాపై పోరాటానికి ఆర్థిక సహాయం అందిస్తూనే తన వంతుగా ఆధ్మాత్మికంగా కూడా భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. కరోనా వైరస్ పైకి పోవాలని ఇంట్లోనే నమాజ్ చేస్తున్నాను. ఈ ప్రాణాంతక వ్యాధిపై నెగిటివ్‌గా ప్రచారం చేయవద్దు అని అలీ సూచించారు.

మా ఆవిడ ఏ పని చెబితే అది చేస్తున్నా: అలీ
గృహ నిర్భంధంలో భాగంగా రోజూ కార్లు కడుగుతున్నాను. ఇంటిలో పనుల్లో భార్యకు సహకారం అందిస్తున్నా. కాయగూరలు కట్ చేస్తున్నా. ఇళ్లంతా శుభ్రపరుస్తున్నా. అప్పుడప్పుడు ఓ గంటో, గంటన్నరో టీవీ చూస్తున్నా. ఇంకా మా ఆవిడ ఏ పని చెబితే అది చేస్తున్నా.. నాకు కొన్ని వంటలు వచ్చు కాబట్టి వంట కూడా చేస్తున్నాను అని ఇంట్లో పనిచేస్తున్నట్టు ఓ ఫోటోను ఫన్నీగా షేర్ చేశారు.


Click it and Unblock the Notifications











