మేకప్ లేకుండానే నటించాడట.. 'నాంది' కోసం అల్లరి నరేష్ హార్డ్ వర్క్!
పోటీ ప్రపంచంలో ఎంత కొత్తగా కనిపించినా కూడా ఆడియెన్స్ అంచనాలను అందుకోవడం అంత ఈజీ కాదు. ఒకప్పుడు కమర్షియల్ గా ఎలాంటి సినిమా చేసినా మినిమమ్ సక్సెస్ అందుకున్న తారలు. ఇప్పుడు ఎంత శ్రమిస్తున్నా కూడా వరుసగా హిట్స్ అందుకోలేకపోతున్నారు. అల్లరి నరేష్ అందుకు ఒక ఉదాహరణ. మొదట్లో గ్యాప్ లేకుండా ఎడాది పొడవున షూటింగ్స్ తో బిజీగా గడిపిన రికార్డ్ ఉంది.
అయితే రొటీన్ కామెడీ సినిమాలను జనాలు కోరుకోవడం లేదని అర్థం చేసుకున్న నరేష్ మంచి ఎమోషన్ సబ్జెక్టుతొ కొట్టాలని ట్రై చేస్తున్నాడు. నేరం చేయని ఖైదీలకు సంబంధించిన ఒక కొత్త కథతో రాబోతున్న నరేష్ చూస్తుంటే హిట్ కొట్టేలా ఉన్నాడని అనిపిస్తోంది. నాంది అనే ఆ సినిమా టీజర్ ఈ ఉదయం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా కోసం నరేష్ చాలా హార్డ్ వర్క్ చేసినట్లు తెలుస్తోంది.

ఒక్క సీన్ లో కూడా మేకప్ వేసుకోలేదట. చాలా వరకు న్యాచురల్ గా కనిపించాలని దర్శకుడి చెప్పినట్లుగానే నటించాడట. ఇక కొన్ని సీన్స్ లలో బట్టలు లేకుండా నటించినట్లు తెలుస్తోంది. జైలులో ఉండే ఖైదీల జీవితాలను కళ్ళకు కట్టినట్లు చూపించబోతున్నారట. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే సీన్స్ చాలా అద్భుతంగా ఉంటాయని టాక్. మరి ఈ సినిమాతో నరేష్ ఎంతవరకు సక్సెస్ అందుకుంటాడో చూడాలి.


Click it and Unblock the Notifications











