50 ఏళ్ల వయసులో తండ్రి అయిన నటుడు, బీజేపీ ఎంపీ.. రెండో భార్యతో రెండో బిడ్డ

నటుడు, గాయకుడు, బీజేపీ ఎంపీ మనోజ్ తివారీ మరోసారి తండ్రి అయ్యారు. 50 ఏళ్ల వయసులో ఆయన రెండో బిడ్డకు తండ్రిగా జన్మను ప్రసాదించారు. తన జీవితంలోకి చిన్నారి రాకతో ఆయన ఆనందంలో మునిగిపోయారు. కూతురు ఫోటోతో పాటు ప్రేమతో కూడిన సందేశంతో తన సంతోషాన్ని అభిమానులు, కార్యకర్తలు, ప్రముఖులతో పంచుకొన్నారు. ఆ వివరాల్లోకి వెళితే...

 మనోజ్ తివారీ వ్యక్తిగత జీవితం

మనోజ్ తివారీ వ్యక్తిగత జీవితం

మనోజ్ తివారీ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. 2011లో రాణి అనే యువతిని పెళ్లి చేసుకొన్నారు. దాదాపు 11 ఏళ్ల వైవాహిక జీవితం అనంతరం అభిప్రాయబేధాలు రావడంతో విడాకులు తీసుకొన్నారు. రాణి, మనోజ్ తివారీకి ఓ కూతురు ఉంది. ప్రస్తుతం శ్వేతా తివారీ ద్వారా రెండో బిడ్డకు జన్మనిచ్చారు.

ముద్దుల చిన్నారి రాకతో

ముద్దుల చిన్నారి రాకతో

తన కూతురు పుట్టిన విషయంపై ట్విట్టర్‌లో స్పందిస్తూ.. మా ఇంటిలోకి ముద్దుల పాపాయి అడుగుపెట్టింది. నాకు డిసెంబర్ 30వ తేదీన ఆడబిడ్డ జన్మించింది. జై జగదాంబ అంటూ మనోజ్ తివారీ ట్వీట్ చేశారు. తన కూతురును ఒడిలో పెట్టుకొని ఉన్న ఫోటోను షేర్ చేశారు.

 మనోజ్ తివారీకి ప్రముఖుల ప్రశంసలు

మనోజ్ తివారీకి ప్రముఖుల ప్రశంసలు

రెండో బిడ్డకు తండ్రి అయిన మనోజ్ కుమార్‌ను ప్రముఖులు, కార్యకర్తలు, అభిమానులు శుభాకాంక్షలు అందించారు. ఆయనకు శుభాకాంక్షలు అందించిన వారిలో దర్శకుడు మనీష్ శర్మ, బిగ్‌‌బాస్ కంటెస్టెంట్, నటుడు డోలి బింద్రా, సుప్రీంకోర్టు న్యాయవాది ప్రశాంత్ పటేల్ ఉమ్రావ్, బీజేపీ ఎంపీ హరీష్ ఖురానా తదితరులు ఉన్నారు.

 మనోజ్ తివారీ పొలిటికల్ లైఫ్

మనోజ్ తివారీ పొలిటికల్ లైఫ్

రాజకీయ జీవితం విషయానికి వస్తే.. 2008లో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారు. సమాజ్ వాదీ పార్టీ తరఫున గోరఖ్‌పూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి యోగా ఆదిత్యానాథ్ చేతిలో ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత బీజేపీలో చేరిన మనోజ్ తివారీ తత్తర ఢిల్లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా ఎన్నికయ్యారు.

 మనోజ్ తివారీ సినిమా జీవితం

మనోజ్ తివారీ సినిమా జీవితం

భోజ్‌పురి చిత్ర పరిశ్రమలో మనోజ్ తివారీ స్టార్ హీరోగా రాణించారు. రాజకీయాల్లో క్రీయాశీలకంగా మారకముందు చివరిసారిగా 2014లో దేవ్రా భెయిల్ దీవానా చిత్రంలో నటించారు. 2010లో సల్మాన్ ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న బిగ్‌బాస్ షోలో కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X