Kantara హీరో రిషబ్ శెట్టి కష్టాలు.. డబ్బుల్లేక ఒకప్పుడు అలాంటి పనులు..

ఏదైనా సాధించాలి అనే సంకల్పం బలంగా ఉంటే.. చేసే పనిలో నిజాయితీ ఉంటే తప్పకుండా గమ్యాలకు చేరుకుంటారు అని చాలామంది నిరూపించారు. ఇక సినిమా ప్రపంచంలో అలాంటి దర్శకులు నటులు చాలామంది ఉంటారు. రీసెంట్ గా కాంతార సినిమాతో భారీ స్థాయిలో విజయాన్ని అందుకున్న రిషబ్ శెట్టి కూడా చాలా కష్టపడి సినిమా ప్రపంచంలో సక్సెస్ అయ్యాడు. ఇటీవల ఇంటర్వ్యూలో అతను సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు పడిన కష్టాల గురించి కూడా తెలియజేశాడు. ఆ వివరాలలోకి వెళితే..

కాంతార కథ

కాంతార కథ

డైరెక్టర్ హీరోగా రిషబ్ శెట్టి మంచి గుర్తింపును అందుకున్నాడు. కాంతార సినిమాలో మొదట అతను హీరోగా నటించాలని అనుకోలేదు. చాలామంది హీరోలకు ఆ కథ గురించి చెప్పాడు. ముఖ్యంగా దివంగత నటుడు పునీత్ రాజ్ కుమార్ తో కూడా ఈ సినిమా కథ గురించి చర్చలు జరిపారు. కానీ ఇలాంటి దైవత్వం ఉన్న కథను నువ్వు చేస్తేనే బాగుంటుంది అని పునీత్ సలహా ఇవ్వడంతో తానే చేసినట్లుగా ఒక ఇంటర్వ్యూలో తెలియజేశాడు.

మొదట సహాయక దర్శకుడిగా

మొదట సహాయక దర్శకుడిగా

రిషబ్ శెట్టి నటుడు కావాలని అనుకుని ఇండస్ట్రీలో వచ్చాడు. కానీ మొదట్లో అతనికి ఎవరు పరిచయం లేదట. ఇక ఇలాగైన నటుడిని అవ్వాలి అని కోరికతోనే మొదట సహాయక దర్శకుడిగా కొన్నాళ్లపాటు వర్క్ చేయాల్సి వచ్చింది. ఇక తర్వాత మంచి అవకాశాలు రావడంతో దర్శకుడిగా కూడా మారాడు. అటువైపు నుంచి తను అనుకున్న నటనలో కూడా అతను రానించాడు.

దర్శకుడిగానే కాకుండా

దర్శకుడిగానే కాకుండా

ఇప్పటివరకు రీషబ్ శెట్టి తెరపైకి తీసుకువచ్చిన సినిమాలన్నీ కూడా వేటికవే భిన్నంగా తెరకెక్కాయి. కేవలం దర్శకుడిగానే కాకుండా ఇతర హీరోల సినిమాలలో కూడా అతను ప్రత్యేకమైన పాత్రలో కూడా కనిపించాడు. సహాయక దర్శకుడిగా ఉన్నప్పుడు కూడా అతను తన దర్శకులు ముందు టాలెంట్ చూపించి కొన్ని చిన్న చిన్న పాత్రల్లో కూడా నటించాడు.

హోటల్స్ లో పని చేస్తూ

హోటల్స్ లో పని చేస్తూ

ఇక రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ శెట్టి సినిమా ఇండస్ట్రీలోకి రాకముందు ఇంట్లో వాళ్ళని డబ్బులు అడగలేక కొన్ని పనులు కూడా చేసుకున్నట్లు చెప్పాడు. చాలా వరకు కూలీ పనులకు వెళ్ళాను అంటూ డిగ్రీ చదివేటప్పుడు సినిమాలు చూసేందుకు డబ్బులు అడగాలంటే నచ్చేది కాదు. అందుకే 2004 నుంచి 2014 వరకు కూడా మొదటి డైరెక్షన్ వచ్చేవరకు పదేళ్లపాటు ఎన్నో పనులు చేశాను. కొన్ని హోటల్స్ లో కూడా పని చేశాను అని రిషబ్ శెట్టి తెలిపాడు. అలాగే వాటర్ క్యాన్లు కూడా పదేళ్లపాటు అమ్మినట్లు చెప్పాడు.

అలా గుర్తింపు

అలా గుర్తింపు

ఇక 2010లో ఒక స్నేహితుడి ద్వారా దొరికిన అవకాశంతో సహాయక దర్శకుడిగా మారిన రిషబ్ మొదట క్లాప్ కొట్టే దశ నుంచి తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఆ తర్వాత తన టాలెంట్ తో స్క్రీన్ రైటర్ గా కూడా పలు సినిమాలతో మంచి గుర్తింపును అందుకున్నాడు. తుగ్లక్ అనే సినిమాలో అతను మొదటిసారి వెండితెరపై కనిపించాడు. ఇక మొదట అతను కిరిక్ పార్టీ అనే సినిమాతోనే బాక్స్ ఆఫీస్ వద్ద మంచి సక్సెస్ అందుకొని కన్నడ చిత్ర పరిశ్రమలో ఒక గుర్తింపును అందుకున్నాడు.

More from Filmibeat

Read more about: kantara rishab shetty
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X