Arjun Das టాలెంట్‌తో అర్జున్ దాస్ మెస్మరైజ్.. ఖైదీ, మాస్టర్, విక్రమ్ తర్వాత ఆ రేంజ్‌లో!

ఇతర భాషల నటులు తెలుగు తెరకు పరిచయమై ప్రేక్షకులను ఆకట్టుకొన్న వారిలో చాలా మంది యాక్టర్లు ఉన్నారు. ప్రకాశ్ రాజ్, నాజర్ లాంటి నటులు తెలుగు ప్రేక్షకుల్లో చెరగని ముద్ర వేశారు. ప్రతిభావంతులు ఎక్కడైనా, ఏ భాషలోనైనా రాణిస్తారనే విషయం గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు. తాజాగా అలాంటి ప్రతిభావంతుడైన నటుడు అర్జున్ దాస్ బుట్టబొమ్మ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. మలయాళంలో విశేషంగా ఆకట్టుకొన్న కపేలా సినిమా ఆధారంగా తెరకెక్కిన బుట్టబొమ్మ చిత్రంలో అర్జున్ దాస్ నటన పరంగా తన మార్కును పరిచయం చేశారు. ఎవరీ అర్జున్ దాస్.. అతడి టాలెంట్ వివరాల్లోకి వెళితే..

తమిళ సినీ పరిశ్రమతోపాటు దక్షిణాది ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటున్న యువ నటుడు అర్జున్ దాస్. 2012లో పెరుమాన్ అనే సినిమాతో నటుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత రాండమ్ నంబర్స్, ఆక్సిజన్, అంధకారం సినిమాలో మెప్పించారు. ఇక ఖైదీ సినిమాలో అంబుగా ఫెర్ఫార్మెన్స్‌తో అదరగొట్టాడు. విలక్షణమైన వాయిస్, డైలాగ్ డెలివరీతో ఆకట్టకొన్నాడు. దాంతో అర్జున్ దాస్‌కు మంచి పాపులారిటీ లభించింది.

Actor Arjun Das get huge applause for RK role in Butta Bomma movie

ఇక ఇళయ దళపతి విజయ్ నటించిన మాస్టర్ చిత్రంలో నెగిటివ్ షేడ్ క్యారెక్టర్‌తో పోటాపోటీగా నటించాడు. మాస్టర్ చిత్రంలో దాస్‌ పాత్రలో అద్బుతంగా రాణించాడు. ఆ తర్వాత విక్రమ్ సినిమాలో అంబుగా మరోసారి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొన్నాడు. ఇలా నటనతోను, విభిన్నమైన బాడీ లాంగ్వేజ్‌తో అర్జున్ దాస్ దక్షిణాదిలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకొన్నాడు.

ఇక బుట్టబొమ్మ సినిమాలో రామకృష్ణ పాత్రతో తెలుగు ప్రేక్షకులకు మరింత చేరవయ్యాడు. గ్రే షేడ్ ఉండే క్యారెక్టర్‌లో విలక్షణమైన నటనతో ఆకట్టుకొన్నాడు. బుట్టబొమ్మ సినిమాలోని ఆర్కే పాత్రకు మంచి ప్రశంసలు లభిస్తున్నాయి.

Actor Arjun Das get huge applause for RK role in Butta Bomma movie

దక్షిణాదిలో బిజీగా మారిన నటుల్లో అర్జున్ దాస్ అంటే అతిశయోక్తి ఏమీ లేదు. ప్రస్తుతం తమిళంలో అనితి, అంగమలై డైరీస్, డాంగే, కింగ్ ఆఫ్ కోతా, అలాగే అన్వర్ రషీద్, సంతకుమార్, విశాల్ వెంకట్ చిత్రాల్లో నటిస్తున్నాడు. ఖైదీ చిత్రంలో విలన్ పాత్రలో నటించిన అర్జున్ దాస్‌కు సైమా అవార్డు కూడా లభించింది. ఇంకా జీ సిని తమిళ్ ఫిల్మ అవార్డు, వికటన్ అవార్డులను సొంతం చేసుకొన్నాడు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X