ముగ్గురు హీరోయిన్లతో బబ్లూ పృథ్వీరాజ్ ఎఫైర్స్.? ఇప్పటికీ అలానే ఉన్నాం!

టాలీవుడ్ సీనియర్ నటుడు బబ్లూ పృథ్వీరాజ్ తెలుగు ప్రేక్షకులకు ఎంతో సుపరిచితుడు. తమిళం, తెలుగు చిత్రాలతో ఆడియెన్స్ ను అలరించాడు. 1988 నుంచి చలన చిత్ర పరిశ్రమలో బబ్లూ పృథ్వీరాజ్ యాక్టివ్ గా ఉంటున్నారు. 50 ఏళ్లుగా సినీ ఇండస్ట్రీలో సినిమాలు చేస్తూనే వస్తున్నారు. టాలీవుడ్ లో 'పెళ్లి', 'పెళ్లి పందిరి', 'కంటే కూతుర్నే కనాలి', 'సమరసింహా రెడ్డి', 'చెన్నకేశవ రెడ్డి', 'నువ్వు నాకు నచ్చావ్', 'గౌతమ్ ఎస్ఎస్సీ', 'స్కంద' వంటి చిత్రాల్లో నటించారు. అయితే 90లో ఈయనకు చాలా సినిమాల్లో ఆఫర్లు వచ్చాయి. ఆయన నటించి ప్రతి పాత్రకూ ఓ గుర్తింపు దక్కింది. కానీ గత ఐదేళ్లుగా పెద్దగా ఆఫర్లు దక్కలేదు. వచ్చినా చిన్నచితక రోల్స్ తో అలరించారు.

కానీ, సందీప్ రెడ్డి వంగ డైరెక్ట్ చేసిన 'యానిమల్' చిత్రంతో అస్రర్ పాత్రలో నటించిన బబ్లూ పృథ్వీరాజ్ కు మంచి పేరు వచ్చింది. ఆయన నటనకు ఆడియెన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ ఒక్క చిత్రం వల్ల వరుసగా 30 చిత్రాల నుంచి ఆఫర్లు అందాయని ఆయనే ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే, బబ్లూ పృథ్వీరాజ్ గతంలో లీడ్ రోల్స్, సపోర్టింగ్ రోల్స్, విలన్ పాత్రల ద్వారా చాలా సినిమాలు చేశారు. ఈ క్రమంలో బబ్లూ పృథ్వీరాజ్ చాలా మంది హీరోయిన్లతో కలిసి పనిచేశారు. కాగా రీసెంట్ గా ఆ హీరోయిన్లతో తన రిలేషన్ ఎలా ఉందనేదానిపై ప్రశ్న ఎదురైంది.

Actor Babloo Prithiveeraj Affairs with Three Heroines

బబ్లూ పృథ్వీరాజ్ రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొనడంతో మీరు పనిచేసిన హీరోయిన్లతో ఎలా ఉండేవారు, మీతో వాళ్లు ఎలా ఉండేవారంటూ ప్రశ్న ఎదురైంది. దీనికి బబ్లూ పృథ్వీరాజ్ ఆసక్తికరంగా బదులిచ్చాడు. తను రమ్యకృష్ణ, మీనా, రాశి వంటి ప్రముఖ హీరోయిన్లతో కలిసి పనిచేశానని తెలిపారు. వాళ్ల అంతా ఎంతో బెస్ట్ ప్రెండ్స్ గా ఉన్నారని, ఎంతో మెచ్యూర్డ్ గా ఉండేవారని తెలిపారు. ఇక వారితో ఎఫైర్స్ వంటి దూరమైన ఆలోచనతో కాకుండా చాలా డీసెంట్ గా మెదిలే వాడినని చెప్పారు. వాళ్లు కూడా స్నహపూర్వకంగానే ఉన్నారని తెలిపాడు. ఇప్పటికీ వారితో చాలా ఫ్రెండ్లీగానే రిలేషన్ ఉంటుందని చెప్పుకొచ్చాడు.

ఇక తన పర్సనల్ లైఫ్ లోని రొమాన్స్ ఉంటే మాత్రం ప్రొఫెషనల్ కు బయటే అని తెలిపారు. తను వర్క్ చేసిన హీరోయిన్లతో ఎంతో మర్యాదగా ఉండేవాడినని చెప్పుకొచ్చారు. ఇక బబ్లూ పృథ్వీరాజ్ ఈ వయస్సులోనూ సిక్స్ ప్యాక్ తో హ్యాండసమ్ లుక్ ను మెయింటేయిన్ చేస్తుండటం విశేషం. ఇక ఇఫ్పుడే ఇలా ఉన్నాడంటే, మరీ అప్పట్లో ఇంకెత ఎనర్జిటిక్ గా ఉండేవాడో అర్థం చేసుకోవచ్చు. ఆయన అప్పట్లో నటించిన ప్రతి రోల్ ఆడియెన్స్ ను ఎంతో ఆకట్టుకునేది. ఎనర్జిటిక్ పెర్ఫామెన్స్ తో దుమ్ములేపాడు.

ప్రస్తుతం బబ్లూ పృథ్వీరాజ్ 'యానిమల్' తర్వాత తెలుగు చలన చిత్ర పరిశ్రమలోనూ మంచి ఆఫర్లను దక్కించుకుంటున్నారు. రీసెంట్ గా విక్టరీ వెంకటేశ్ - అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రంలో పంకజ్ పాండేగా అలరించారు. అలాగే అక్కినేని నాగచైతన్య - సాయిపల్లవి జంటగా నటించిన బ్లాక్ బాస్టర్ ఫిల్మ్ 'తండేల్'లో సత్య పాత్రకు తండ్రిగా అలరించాడు. అలాగే తమిళంలో ఏస్, ట్రైన్.. వంటి రెండు చిత్రాల్లో నటించారు. మరిన్ని షూటింగ్ జరుపుకుంటున్నాయి. విడుదలకు రెడీ అవుతున్నాయి.

Take a Poll

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X