సలార్ అతి ముఖ్యమైన విషయాన్ని లీక్ చేసిన విలన్.. డైరెక్టర్ చెప్పకముందే ఇలా..
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సలార్ మూవీ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో తెరకెక్కుతోన్న ఈ మూవీని హోంబలే ఫిలిమ్స్ 300 కోట్లతో నిర్మిస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ దశలో ఉంది. త్వరలో ఫైనల్ షెడ్యూల్ ని ప్రశాంత్ నీల్ స్టార్ట్ చేయబోతున్నారంట.
ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. జగపతిబాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ పవర్ ఫుల్ విలన్స్ గా కనిపిస్తున్నారు. అలాగే సినిమాలో ప్రభాస్ మొదటి సారి డ్యూయల్ రోల్ లో కనిపించనున్నాడు అనే మాట వినిపిస్తోంది. తండ్రి, కొడుకులుగా ప్రభాస్ క్యారెక్టర్స్ ఉంటాయని టాక్. ఈ సినిమాలో కన్నడ స్టార్ యాక్టర్ దేవరాజ్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.

తాజాగా సలార్ మూవీపై ఆయన ఇంటరెస్టింగ్ అప్డేట్ బయట పెట్టారు. ఈ సినిమాని రెండు భాగాలుగానే తెరకెక్కిస్తున్నారు అని క్లారిటీ ఇచ్చారు. రెండింటిలో తన పాత్ర చాలా కీలకంగా ఉంటుందని చెప్పుకొచ్చారు.గత కొంతకాలంగా సలార్ రెండు భాగాలుగా రానుందని టాక్ వస్తోన్న విషయం తెలిసిందే. ఆ టాక్ వైరల్ అవుతున్నా కూడా చిత్ర యూనిట్ నుంచి మాత్రం ఎలాంటి క్లారిటీ లేదు. అలాగే మూవీకి సంబందించిన అప్డేట్స్ కూడా ఇవ్వడం లేదు.
అయితే ఇప్పుడు సలార్ సినిమాలో నటించిన దేవరాజ్ మూవీ రెండు భాగాలుగానే ఉంటుందనే విషయాన్ని రివీల్ చేసేశారు. అసలైతే ఒక పవర్ఫుల్ పోస్టర్ ద్వారా దర్శకుడు ఒక ప్రెస్ మీట్ పెట్టి మరి సలార్ 2 కూడా ఉంటుందని చెప్పాలని అనుకున్నాడు. కానీ అంతకంటే ముందే దేవరాజ్ చెప్పడంలో ఈ విషయం వైరల్ గా మారింది.

మొదటి పార్ట్ సెప్టెంబర్ 28న రిలీజ్ కాబోతూ ఉండగా, 2026లో రెండు భాగం వస్తుందని అంచనా వేస్తున్నారు. ఇక జూన్ లో ఆదిపురుష్ మూవీ రిలీజ్ తర్వాత సలార్ సినిమాకి సంబంధించి అప్డేట్స్ ని ప్రశాంత్ నీల్ రివీల్ చేసే ఛాన్స్ ఉందని టాక్. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ మూవీపై ఆరు వందల కోట్ల వరకు బిజినెస్ జరిగిందనే మాట వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్, ప్రభాస్ క్రేజ్ నేపధ్యంలోనే ఈ స్థాయిలో థీయాట్రికల్ రైట్స్ బిజినెస్ జరిగిందని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications











