సినిమా అట్టర్ ఫ్లాప్.. నిర్మాతలు డబ్బు లాగేసుకొన్నారు..ఆ సమయంలోనే ఇద్దరు బిడ్డలు పొగొట్టుకొన్నా..ఫర్దీన్ ఖాన్
బాలీవుడ్‌లో అగ్ర హీరో ఫిరోజ్ ఖాన్ వారసుడిగా సినిమా రంగంలోకి అడుగుపెట్టిన ఫర్దీన్ ఖాన్ ఆరంభంలో స్టార్ హీరోగా నిలదొక్కొనే ప్రయత్నాలు చేశాడు. కానీ వ్యక్తిగత, ప్రొఫెషనల్ సమస్యలు అతడిని దారుణంగా దెబ్బ తీశాయి. దాంతో తీవ్రస్థాయిలో మద్యానికి అలవాటుపడి ఆరోగ్యపరంగా, కెరీర్ పరంగా దారుణమైన ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. అయితే అధోపాతాళానికి పడిపోయిన ఫర్దీన్ ఖాన్ మళ్లీ నిలదొక్కుకొనే ప్రయత్నం చేస్తున్నాడు.
100 కిలోలకుపైగా బరువు ఉన్న ఆయన తన శరీరాన్ని మళ్లీ సాధారణ స్థితికి తెచ్చుకొన్నాడు. అయితే ఇటీవల తన సినిమా ప్రమోషన్‌లో తన జీవితంలో చోటు చేసుకొన్న విషయాలను వెల్లడించాడు. ఆ వివరాల్లోకి వెళితే..

2010 తర్వాత మళ్లీ కనిపించకుండా
బాలీవుడ్‌లో ఫర్దీన్ ఖాన్ గత కొద్ది సంవత్సరాలుగా తెరమరుగైనాడు. 2010లో దుల్హా మిల్ గయా చిత్రంలో కనిపించిన ఆయన మళ్లీ వెండి తెరకు దగ్గర కాబోతున్నాడు. ప్రస్తుతం రితేష్ దేశ్‌ముఖ్, పర్ియా బాపట్, క్రిస్టైల్ డి సౌజాతో కలిసి విస్ఫోట్ అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమయ్యాడు. ఈ సినిమా ప్రమోషన్‌లో బిజీ బీజీగా గడుపుతూ తన లైఫ్ గురించి ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు.

నా మొదటి సినిమాకు అవార్డు
నా మొదటి సినిమా ప్రేమ్ అగన్. ఈ సినిమా నాకు సరైన సంతృప్తిని ఇవ్వలేదు. అయితే ఆ సినిమాకు నాకు ఉత్తమ తొలి చిత్ర నటుడిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది. అయితే ఆ అవార్డు వచ్చిన తర్వాత నేను అర్హుడినేనా అనే సందేహం కలిగింది. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకొన్నది. ప్రేమ్ అగన్ సినిమా వల్ల నాకు ఎలాంటి గుర్తింపు లేదు. కేవలం అవార్డు తప్ప. అందుకే నేను ఆ అవార్డు అర్హుడిని కాను అని ఫర్దీన్ చెప్పారు.

ఇద్దరు కవలలు గర్భంలోనే
ప్రేమ్ అగన్ సినిమా రిలీజ్ సమయంలో నాకు అన్ని చేదు అనుభవాలే ఎదురయ్యాయి. ప్రెగ్నెన్సీ సమయంలో నా భార్యకు ఆరోగ్య సమస్యలు తలెత్తాయి. గర్భంలో బిడ్డలు పెరుగుతున్న సమయంలో కవలలు ఆరు నెలల వయసులో మరణించారు. ఆ విషయంతో నేను తీవ్ర మనస్తాపానికి గురయ్యాను. అలాంటి సమయంలో నాకు అవార్డు లభించడంతో నేను అంగీకరించలేకపోయాను అని ఫర్దీన్ ఖాన్ అన్నారు.

ప్రేమ్ అగన్ సినిమా ఫ్లాప్ తర్వాత
ప్రేమ్ అగన్ సినిమా ఫ్లాప్ కావడంతో ఏడాదిపాటు ఇంటిపట్టునే ఉన్నాను. నిర్మాతల వద్ద నేను తీసుకొన్న డబ్బును తిరిగి ఇచ్చాను. చేతిలో సినిమాలు, పని లేకుండా జీవితం చాలా దుర్బరంగా గడిచింది. ప్రేమ్ అగన్ సినిమాకు ముందు నాకు ఆఫర్లు ఇచ్చిన నిర్మాతలు ముఖం చాటేశారు. వారి వద్ద తీసుకొన్న అడ్వాన్సులు వెనక్కి తిరిగి ఇచ్చేయమని చెప్పారు. నాతో సినిమాలు చేయడానికి చాలా మంది నిరాకరించారు. సినిమా అవకాశాల కోసం చాలా మందిని కలిసి అభ్యర్థించాను అని ఫర్దీన్ ఖాన్ తెలిపారు.

మా నాన్న చాలా చాలా స్ట్రిక్ట్
ఇక మా నాన్న చాలా ఖచ్చితమైన మనిషి. హిందీ సినీ పరిశ్రమలో ఎలాంటి బ్యాకప్, గాడ్ ఫాదర్ లేకుండా స్టార్ హీరోగా, లెజెండ్‌గా ఎదిగాడు. సినిమాల విషయంలో ఆయన చాలా చాలా స్ట్రిక్ట్. ఆర్థికపరమైన విషయాల్లో స్పష్టమైన అవగాహన, లెక్కలు ఉంటాయి. అయితే ఒకరి సపోర్ట్ మీద ఎదగడమనేది కష్టం. సొంత ప్రతిభతోనే పేరు, డబ్బు సంపాదించుకోవాలని చెబుతూ ఉండేవారు. తొలి సినిమా ఫ్లాప్ తర్వాత జీవితం అగమ్యగోచరంగా ఉండేది అని ఫర్దీన్ ఖాన్ చెప్పారు.

నాన్న మరణం తర్వాత
జీవితం రకరకాల పరీక్షలను పెట్టింది. 2009లో మా నాన్న చనిపోయారు. ఇద్దరు కవల పిల్లలను నా భార్య గర్బంలోనే పోగొట్టుకొన్నది. మళ్లీ సంతానం కోసం చాలా కష్టపడ్డాం. చాలా సమస్యలను అధిగమించాను. సంతాన సాఫల్య కేంద్రాలను సంప్రదించాం. నా భార్య అనేక సమస్యలను ఎదుర్కొన్నది. రకరకాల సమస్యల కారణంగా నేను మానసికంగా దెబ్బ తిన్నాను. నా ఆరోగ్యం కూడా క్షీణించింది అని ఫర్దీన్ ఖాన్ అన్నారు.

సంతానం కోసం ఎన్నో కష్టాలు
ఫర్దీన్ ఖాన్ తన సమస్యలను వెల్లడిస్తూ.. ఎన్నో కష్టాలు, సమస్యలను అధిగమించి నా భార్య నటాషా 2013లో ఓ ఆడబిడ్డకు జన్మనిచ్చింది. దాంతో మా ఇంటిలో మళ్లీ సంతోషం నెలకొన్నది. నా కూతురు రాకతో మళ్లీ నేను మామూలు మనిషిని అయ్యాను. జీవితంపై ఆశలు చిగురించడం మొదలయ్యాయి. ఆ తర్వాత 2017లో మళ్లీ రెండో బిడ్డ జన్మించింది. దాంతో నా లైఫ్‌లో సంతోషాలు రెండింతలయ్యాయి.


Click it and Unblock the Notifications











