సక్సెస్, ఫెయిల్యూర్స్ కామన్.. అంత మాత్రాన స్థాయి లేదంటరా? గోపిచంద్ షాకింగ్ జవాబు
ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీ విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల నిర్మిస్తున్న చిత్రం రామ బాణం. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమాలో గోపిచంద్, జగపతిబాబు, కుష్బూ, డింపుల్ హయతి ప్రధాన పాత్రల్లో నటించారు. శ్రీవాసు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం మే 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో వివేక్ కూచిబొట్ల, శ్రీవాసు, గోపిచంద్, డింపుల్ హయతి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా గోపిచంద్ మాట్లాడుతూ..
అవి పార్ట్ ఆఫ్ ది గేమ్ అంటూ : నా కెరీర్‌లో ప్రారంభమై చాలా సంవత్సరాలైనప్పటికీ నాకు రావాల్సిన స్థాయి రాలేదనుకోవడం తప్పు. ప్రతీ ఒక్కరి జీవితంలో సక్సెస్, ఫెయిల్యూర్స్ ఉంటాయి. అవి పార్ట్ ఆఫ్ ది గేమ్. నాకు సక్సెస్ వచ్చింది. ఆ తర్వాత ఫెయిల్యూర్స్ వచ్చాయి. ఇది ఒక సర్కిల్. ప్రతీ ఒక్కరికి గుడ్ టైమ్ ఉంటుంది. బ్యాడ్ టైమ్ ఉంటుంది. గుడ్ టైమ్ తర్వాత బ్యాడ్ టైమ్ వస్తుంది. బ్యాడ్ టైమ్ తర్వాత గుడ్ టైమ్ వస్తుంది అని గోపిచంద్ అన్నారు.
రామానాయుడికి సాధ్య పడలేదు.. : తెలుగు సినిమా పరిశ్రమలో వరుసగా సినిమాలు తీయడమే కాకుండా.. ఒకేసారి పది ప్రాజెక్టులు చేయడం అలా కుదిరిపోయింది. రామా నాయుడికి సాధ్యం కాలేదు.. మాకు కాలేదంటే.. దాని గురించి మేము ఏమీ చెప్పలేం. ప్రతి సినిమాను ఓ ప్రాజెక్టును ఫ్యాక్టరీ మాదిరిగా చేయాలన్నది మా నిర్ణయం. అందుకే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ అని పేరు పెట్టుకొన్నాం అని వివేక్ కూచిబొట్ల అన్నారు.

ప్రొడ్యూసర్ కాదు మేకర్ అంటూ: అయితే వివేక్ కూచిబోట్ల ఇచ్చిన జవాబుకు కొనసాగింపుగా దర్శకుడు శ్రీవాసు మాట్లాడుతూ.. క్రియేటివ్ డైరెక్టర్స్ అంటారు. క్రియేట్ చేసేవాళ్లనే డైరెక్టర్లు అంటారు. ప్రొడ్యూసర్స్ విషయంలో కూడా అలాంటి పేరు మీరే ఇచ్చారు. పొడ్యూసర్స్‌లో కొందరు మేకర్స్ ఉంటారు.. ప్రొడ్యూసర్స్ ఉంటారు అని శ్రీవాసు తెలిపారు.

మా నిర్మాతలు పద్దులు చూసుకోరు..: శ్రీవాసు ఇంకా మాట్లాడుతూ.. ప్రొడ్యూసర్స్ అంటే పద్దులు చూసుకొని చేసేవారు. బడ్జెట్ ఇంత అయితే.. ఇంత వస్తుందని లెక్కలు వేసుకొంటారు. మేకర్స్ అంటే బడ్జెట్ రేంజ్ పెంచి ఇంకా ఎక్కువ రాబట్టుకోవాలని చూస్తుంటారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీలో విశ్వప్రసాద్, వివేక్ పద్దులు చూసుకోరు. రేంజ్‌ను పెంచి ఎక్కువ లాభాలను రాబట్టాలని అనుకొంటారు అని శ్రీవాసు తెలిపారు.

జగపతిబాబు, గోపిచంద్ కెమిస్ట్రీ గురించి : ఇక రామబాణం సినిమాలోనే కాదు.. నిజ జీవితంలో కూడా జగపతిబాబును బ్రదర్ అని గోపిచంద్ పిలుస్తారు ఈ సినిమాలో కొన్ని సీన్లు ఇప్పుడు రివీల్ చేయలేం. కానీ.. మేము స్క్రిప్టు రాసేటప్పుడు మాత్రం వారిద్దరి మధ్య కెమిస్ట్రిని దృష్టిలో పెట్టుకొని సన్నివేశాలను డిజైన్ చేశాం. సెట్లో జగపతి బాబు సీన్ పండకపోతే.. ఇది ఇలా చేస్తే అన్నయ్య క్యారెక్టర్ ఎలివేట్ అవుతుంది అని శ్రీవాసు వివరించారు.


Click it and Unblock the Notifications











