2000 మంది ఆ పిచ్చితో.. ముక్కలుగా నరికేస్తారని వార్నింగ్.. షాకింగ్‌గా జగపతిబాబు
సీనియర్ హీరో జగపతిబాబు చాలా ఓపెన్ మైండ్ అన్న సంగతి తెలిసిందే. కెరీర్‌లో స్టార్‌డమ్‌ను చూసిన ఆయన డౌన్‌ఫాల్‌ను ఎదుర్కొన్నారు. అంతా అయిపోయింది అనుకున్న దశలో బౌన్స్ బ్యాక్ అయ్యారు. ప్రస్తుతం సౌత్‌లో అత్యంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లలో జగపతి బాబు కూడా ఒకరు. కులం, మతం , పేద, ధనిక అన్న అంశాలను ఆయన పెద్దగా పట్టించుకోరు. మొన్నామధ్య బెజవాడలో ఓ కాలేజ్‌లో జరిగిన ఈవెంట్‌కు గెస్ట్‌గా వెళ్లిన జగపతిబాబు తన సొంతం కులంపైనే ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..
జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ బడా నిర్మాత. జగపతి ఆర్ట్స్ బ్యానర్‌పై అగ్రనటులతో సినిమాలు తీశారు. సినిమా బ్యాక్‌గ్రౌండ్ కావడంతో జగపతి బాబు లాంచింగ్ ఈజీగా జరిగిపోయింది. కానీ నటుడిగా నిలదొక్కుకోవడానికి జగపతిబాబు ఎంతో కష్టపడ్డారు. మొదట్లో సినిమాలు ఫ్లాప్ కావడంతో పాటు నటన, డ్యాన్స్‌లపై ఆయన ఎన్నో విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ వాటన్నింటిని తట్టుకుని నిలబడి శోభన్ బాబు తర్వాత కుటుంబ ప్రేక్షకులకు ఇష్టమైన హీరోగా నిలిచారు. మధ్యలో అవకాశాలు లేక ఆర్ధికంగానూ ఎంతో ఇబ్బందిపడ్డారు జగపతిబాబు. లెజెండ్ సినిమా ద్వారా విలన్‌గా అవతారమెత్తి సెకండ్ ఇన్నింగ్స్‌లో దూసుకెళ్తున్నారు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఓపెన్‌గా, బోల్డ్‌గా మాట్లాడే నటుల్లో జగపతిబాబు ఒకరు. చాలా వరకు మూవీ ఈవెంట్స్‌కు, మీడియాకు దూరంగా నిరాడంబరంగా ఉంటారు . కానీ ఎప్పుడైనా మైక్ అందుకున్నా, ఇంటర్వ్యూలు ఇచ్చినా హాట్ హాట్ కామెంట్స్ చేస్తుంటారు. కూతురు విదేశీయుడిని ప్రేమించిందని తెలుసుకుని పెద్ద మనసుతో పెళ్లి జరిపించారు జగపతి బాబు. కులపిచ్చికి తాను పూర్తి వ్యతిరేకమని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు.
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న జగపతిబాబు సొంత సామాజికవర్గంపైనే హాట్ కామెంట్స్ చేశారు. తాను ఒకసారి విజయవాడ సిద్ధార్ధ కాలేజీలో ఓ ఈవెంట్‌కు వెళ్లానని, వేదిక మీద కులానికి వ్యతిరేకంగా మాట్లాడతానని చెప్పగా, ఆ కాలేజీ ప్రిన్సిపాల్ వారించినట్లు చెప్పారు. ఎందుకని తాను ప్రశ్నించగా.. ఆడిటోరియంలో 2000 మంది ఉన్నారని, వీరంతా కమ్మోళ్లేనని మీరు ఒక్కరు.. తేడా వస్తే మిమ్మల్ని ముక్కలు ముక్కలు చేస్తారని తనను హెచ్చరించినట్లు జగపతిబాబు తెలిపారు.
కానీ తాను ఇవేవీ పట్టించుకోకుండా మైక్ తీసుకుని ఎంట్రా మీ క్యాస్ట్ గొడవ అని మొదలుపెట్టానని.. కమ్మ కమ్మ అనొద్దు, అందరూ మనుషులేనని చెప్పినట్లు గుర్తుచేశారు. మీ ప్రవర్తన, పద్ధతి కరెక్ట్‌గా లేదని దాని కోసం మర్డర్‌లు చేయడం, ఇంటర్‌క్యాస్ట్ మ్యారేజ్‌లు ఒప్పుకోకపోవడం, కూతురిని చంపడం ఇదంతా నెగిటివ్ అని గట్టిగానే చెప్పానని ఆయన తెలిపారు. అలాగే మీరు 2000 మంది ఉన్నారట, నన్ను నరికేస్తారట, తానేమీ సెక్యూరిటీని కానీ, ఆయుధాన్ని కానీ తెచ్చుకోలేదు దేనికైనా రెడీ అని చెప్పగా.. స్టూడెంట్స్ విజిల్స్, క్లాప్స్‌తో హోరెత్తించారని జగపతిబాబు వెల్లడించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజన్లు జగపతి బాబు గట్స్‌ను మెచ్చుకుంటూ కామెంట్స్ పెడుతున్నారు.


Click it and Unblock the Notifications











