Jagapathi Babu : జగపతికి బాబుకు అంత బలిసిందా .. వీడియో పెట్టి మరి!
సీనియర్ హీరో జగపతిబాబు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు స్టార్‌డమ్‌ను చూసిన ఆయన డౌన్‌ఫాల్‌ను ఎదుర్కొన్నారు. జగ్గూబాయ్ పని అయిపోయిందని అంతా అనుకున్న దశలో గోడకి కొట్టిన బంతిలా తిరిగొచ్చారు. ప్రస్తుతం దక్షిణాదిలో అత్యంత డిమాండ్ ఉన్న క్యారెక్టర్ ఆర్టిస్ట్‌లలో జగపతి బాబు కూడా ఒకరు. ఏ విషయంపై అయినా ఓపెన్‌గా మాట్లాడే ఆయన ఎవ్వరినీ లెక్కచేయరు. తాజాగా సోషల్ మీడియాలో ఆయన పెట్టిన పోస్ట్ వైరల్ అవుతోంది. ఆ వివరాల్లోకి వెళితే..
జగపతిబాబు తండ్రి వీబీ రాజేంద్రప్రసాద్ బడా నిర్మాత, దర్శకుడు. జగపతి ఆర్ట్స్ బ్యానర్‌పై అలనాటి అగ్రనటులతో సినిమాలు తీశారు. బలమైన సినీ నేపథ్యం ఉండటంతో జగపతి బాబు ఇండస్ట్రీలోకి చాలా ఈజీగా ఎంటరయ్యారు. కానీ నటుడిగా నిలదొక్కుకోవడానికి ఆయన ఎంతో కష్టపడ్డారు. మొదట్లో సినిమాలు ఫ్లాప్ కావడంతో పాటు నటన, డ్యాన్స్‌లపై ఆయన ట్రోలింగ్ బారినపడ్డారు. కానీ వాటన్నింటిని తట్టుకుని నిలబడిన జగపతి.. నటభూషణ శోభన్ బాబు తర్వాత ఫ్యామిలీ ఆడియన్స్‌కు ఇష్టమైన హీరోగా నిలిచారు.

కొత్త హీరోల ఎంట్రీతో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా మారారు జగపతి . మధ్యలో అవకాశాలు రాకపోవడం, ఆస్తి మొత్తం హారతి కర్పూరంలా కరిగిపోవడంతో ఆర్ధికంగానూ ఎంతో ఇబ్బందిపడ్డారు . ఇలాంటి దశలో బోయపాటి శ్రీను దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటించిన లెజెండ్‌లో విలన్‌గా అవతారమెత్తి కొత్త ట్రెండ్ సెట్ చేశారు. ఈ సినిమా తర్వాత జగపతి బాబు వెనుదిరిగే అవసరం లేకుండా పోయింది. వరుసపెట్టి విలన్ రోల్స్ ఆయనను వెతుక్కుంటూ రావడంతో జగపతి బిజీ అయిపోయారు.

ప్రతినాయక పాత్రలతో పాటు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా బిజీ అయ్యారు. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషలకు చెందిన మేకర్స్ జగపతి బాబు డేట్స్ కోసం క్యూ కడుతున్నారు. జీవితంలో తగిలిన ఎదురుదెబ్బలతో సింపుల్‌గా ఉండటానికే ఆయన ఇష్టపడతారు. పబ్లిసిటీకి దూరంగా తన పని తాను చేసుకుంటూ ప్రశాంతంగా గడుపుతారు. ఇక తెలుగు చిత్ర పరిశ్రమలో ఓపెన్‌గా, బోల్డ్‌గా మాట్లాడే నటుల్లో జగపతిబాబు కూడా ఒకరు.
చాలా వరకు మూవీ ఈవెంట్స్‌కు, మీడియాకు దూరంగా ఉంటారు . కానీ ఎప్పుడైనా మైక్ అందుకున్నా, ఇంటర్వ్యూలు ఇచ్చినా హాట్ హాట్ కామెంట్స్ చేస్తుంటారు. కూతురు విదేశీయుడిని ప్రేమించిందని తెలుసుకుని పెద్ద మనసుతో పెళ్లి జరిపించారు జగపతి బాబు. కులపిచ్చికి తాను పూర్తి వ్యతిరేకమని ఎన్నోసార్లు క్లారిటీ ఇచ్చారు. తన సొంత కులాన్నే ఆయన ఎన్నోసార్లు తప్పుబట్టిన సందర్భాలు ఉన్నాయి.
సోషల్ మీడియాలో యాక్టీవ్‌గా ఉండే జగ్గూ బాయ్ ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లతో ఘాటు పోస్టులు పెడుతుంటారు. తాజాగా ట్విట్టర్‌లో జగపతి బాబు ఓ వీడియో పోస్ట్ చేశారు. భారీ భవంతి ముందు ఫోటో దిగిన ఆయన స్విమ్మింగ్‌పూల్‌లో జలకాలు ఆడి, గార్డెన్‌లో కాసేపు ఊయల ఊగారు. బాగున్న అని చెప్పారు కాబట్టి హ్యాపీగా ఫీలై, ఒల్లు బలిసి ఈ వీడియో పెట్టానంటూ జగపతి బాబు దానికి ఓ క్యాప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











