twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నువ్వు శాసించాలి, మేము పాటించాలి.. చిరంజీవిపై యంగ్ హీరో కామెంట్స్

    |

    కరోనా క్రైసిస్ ఛారిటీ అనే కార్యక్రమం మెగాస్టార్ చిరంజీవి ముందడుగు వేసి శ్రీకారం చుట్టాడు. 21 రోజుల లాక్ డౌన్‌లో పనులు లేక ఇబ్బంది పడే సినీ కార్మికులకు అండగా నిలబడేందుకు చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతమవుతోంది. సినీ శ్రామికులను ఆదుకోవాలని, అందుకోసం మొదటగా కోటి రూపాయల విరాళాన్ని ప్రకటించాడు.

    మిగతా వారంతా తమకు తోచిన సాయాన్ని చేయాలని చిరంజీవి కోరాడు. చిరు పిలుపివ్వడం ఆలస్యం... కుప్పలు తెప్పలుగా విరాళాలు వచ్చి పడుతున్నాయి. ఈ విరాళాల్లో దగ్గుబాటి ఫ్యామిలీ కోటి, నాగార్జున కోటి, ఎన్టీఆర్, మహేష్ బాబు, నాగ చైతన్య 25 లక్షలు, వరుణ్ తేజ్ 20 లక్షలు, సాయి ధరమ్ తేజ్ పది లక్షలు, రవితేజ 20 లక్షలు, లావణ్య త్రిపాఠి లక్ష రూపాయలు ప్రకటించారు.


    Actor Karthikeya About Chiranjeevi And Carona Crisis Charity

    తాజాగా యంగ్ హీరో కార్తికేయ రెండు లక్షల రూపాయలను ప్రకటించాడు. ఈ మేరకు చిరు ట్వీట్ చేస్తూ.. విరాళాలు వస్తూనే ఉన్నాయంటూ సాయి ధరమ్ తేజ్ పది లక్షలు, కార్తికేయ రెండు లక్షలు ఇచ్చాడని పేర్కొన్నాడు. ఈ ట్వీట్‌కు స్పందించిన కార్తికేయ.. ఇలా ఎంకరేజ్ చేయండి బాస్.. ఏది చేయడానికైనా మేమంతా రెడీగా ఉంటాము.. నువ్వు శాసించాల.. మేము పాటించాల అని కామెంట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ తెగ వైరల్ అవుతోంది.

    English summary
    Actor Karthiekya About Chiranjeevi And Carona Crisis Charity. He Praised Chiranjeevi About Establish Carona Crisis Charity.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X