బాక్సాఫీస్‌కు పట్టిన తుప్పు వదిలించేందుకే : పవన్, అజిత్ ల గురించి కార్తికేయ ఆసక్తికర కామెంట్స్
కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ కుమార్ ప్రధాన పాత్రలో దర్శకుడు హెచ్. వినోద్ తెరకెక్కించిన చిత్రం 'వలిమై'. టాలీవుడ్ యువ హీరో కార్తికేయ ఈ చిత్రంలో విలన్‌గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ రిలీజ్ ఈవెంట్ మంగళవారం ఫిబ్రవరి 22న హైదరాబద్ లో జరిగింది. ఈ సందర్భంగా హీరో కార్తికేయ అనేక విశేషాలను పంచుకున్నారు. ఆ వివరాల్లోకి వెళితే
Recommended Video

గ్రాండ్ గా ప్రీ రిలీజ్
హీరో అజిత్ నటించిన వలిమై సినిమాపై తమిళ నాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. విలన్‌గా మన తెలుగు హీరో కార్తికేయ నటించాడు. దీంతో తెలుగులోనూ ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి. ఇక నిర్మాత బోనీ కపూర్ అవ్వడంతో హిందీలోనూ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున రిలీజ్ చేస్తున్న సంగతి తెలిసిందే. సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ స్టఫ్ అంచనాలు మరింత పెంచేలా చేసింది. బైక్ చేజింగ్, రేస్, యాక్షన్ సీక్వెన్స్‌లు అందరినీ కట్టి పడేసేలా ఉన్నాయి. అలా మొత్తం మీద సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 22వ తేదీన హైదరాబాద్ లో జరిగింది.

అలా చెప్పా
అయితే ఈ ఈవెంట్‌లో కార్తికేయ మాట్లాడుతూ ఖాఖీ సినిమా చూసిన తర్వాత ఈ దర్శకుడు గనక నాతో సినిమా చేస్తాను అంటే నేను స్క్రిప్ట్ కూడా వినకుండా సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నాను అని నా స్నేహితుడితో చెప్పాను, నిజానికి సినిమాలలో నటించడం మొదలు పెట్టక ముందు ఇలాంటి విషయాల మీద చాలా కాన్ఫిడెన్స్ వుంది. అలా నేను చెప్పిన మూడేళ్ల తర్వాత ఆయనతో సినిమా చేయడం అనేది అదృష్టంగా భావిస్తున్నాను అని దర్శకుడు వినోద్ గురించి చెప్పుకొచ్చారు. షూటింగ్ సమయంలో ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నానని కార్తికేయ వెల్లడించారు.

పూజల ఫలితంగానే
అలాగే తన తల్లిదండ్రులు చేసిన పూజల ఫలితంగానే అజిత్ గారితో పరిచయం ఏర్పడిందని కార్తికేయ వెల్లడించారు.. అజిత్ కుమార్ షూటింగ్ సమయంలో తనను ఎంతో బాగా చూసుకున్నారు అని అని ప్రతి చిన్న విషయాన్ని కూడా ఆయన చెబుతూ ఉండేవారు అని చెప్పుకొచ్చారు. ఆయనతో కలిసి సినిమా చేయడం, ఆయన పరిచయం కావడం గొప్ప అదృష్టంగా భావిస్తున్నానని కార్తికేయ వెల్లడించారు. ఈ సినిమా తనకంటే నాకు ఎక్కువ ప్లస్ అవ్వాలని అజిత్ గారు కోరుకున్నారని అలాంటి నిష్కల్మషమైన వ్యక్తిని తన జీవితంలో చూడలేదని చెప్పుకొచ్చారు.

గర్వంగా ఫీల్ అవుతున్నా
అలాగే బోనీ కపూర్ గురించి చెబుతూ ఆయన తెలుగు వాళ్లకు అల్లుడు అని ఆయనతో పని చేసిన తర్వాత నిర్మాతలు ఇలా కూడా ఉంటారా అనిపించింది అని అంత అద్భుతంగా ఆయన తన సినిమా కోసం పనిచేసే వారు చూసుకుంటారని పేర్కొన్నారు. శ్రీదేవి గారికి సంబంధించిన ప్రొడక్షన్ కంపెనీ లో నేను పని చేశా, నా కుటుంబ సభ్యులు స్నేహితులు అందరూ కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు అని కార్తికేయ వెల్లడించారు.

బాక్సాఫీస్‌కు పట్టిన తుప్పు వదిలించేందుకు
ఫిబ్రవరి 24న వలిమై చూడండి.. ఆ తరువాత ఫిబ్రవరి 25న భీమ్లా నాయక్ సినిమా చూడండని పవన్ కళ్యాణ్ అభిమానులను అజిత్ అభిమానులను కోరారు కార్తికేయ. బాక్సాఫీస్‌కు పట్టిన తుప్పు వదిలించేందుకు ఇలా అజిత్, పవన్ కళ్యాణ్ ఒక్క తేదీ గ్యాప్‌తొ వస్తున్నారు అంటూ కార్తికేయ చెప్పుకొచ్చాడు. అయితే విడుదల తేదీ విషయంలో కాస్త కన్ఫ్యూజ్ అయిన కార్తికేయ ఆ తరువాత క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











