Brixton Cromwell 1200 Price: తొలి భారతీయుడిగా రికార్డు.. మాధవన్ బైక్ ధర ఎన్ని లక్షలో తెలుసా?

Madhavan: సినిమా ఇండస్ట్రీలో చాలామంది నటులకు లగ్జరీ కార్లు, ఖరీదైన బైక్ లు అంటే చాలా ఇష్టం. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు చాలా మంది సెలబ్రిటీలు వివిధ రకాల లగ్జరీ కార్లు, బైక్‌లను కొనుగోలు చేశారు. కానీ తాజాగా ఆ జాబితాలోకి బాలీవుడ్ నటుడు ఆర్ మాధవన్ చేరారు. ఆయనకు కూడా లగ్జరీ కార్లు, ఖరీదైన బైక్ లు అంటే మోజు.. ఇటీవల మాధవన్ ఒక ప్రత్యేకమైన బైక్ కొనుగోలు చేశాడు. ఈ బైక్‌ను సొంతం చేసుకున్న తొలి ఇండియన్ సెలబ్రిటీ నిలిచారు. ఇంతకీ ఆ బైక్ ఏంటి?

సినిమా ఇండస్ట్రీలో అత్యంత ప్రతిభావంతులైన నటుల్లో ఆర్ మాధవన్ ఒకరు. కోలీవుడ్ స్టార్ హీరో, తమిళ చాక్లెట్ బాయ్ మాధవన్ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాదాపు ఏడు భాషలలో సూపర్ హిట్ సినిమాలలో నటించిన మల్లీ టాలెంటెండ్ నటుడు మాధవన్. మాధవన్ తొలుత తన కెరీర్ ను టెలివిజన్ సీరియల్స్ తో ప్రారంభించాడు. యూల్ లవ్ స్టోరీస్, బనేగి అప్నీ బాత్, సుహానా సఫర్,ఆరోహన్ వంటి టీవీ సీరియల్స్‌లో పనిచేశారు. దాదాపు డజను టీవీ సీరియల్స్‌లో మ్యాడీ నటించి మెప్పించారు. ఈ ఫేమ్ తో మాధవన్ దక్షిణాది చిత్రాల్లో అడుగుపెట్టారు.

Actor Madhavan Becomes the First Brixton Cromwell 1200 Owner in India

పలు చిత్రాల్లో చిరస్మరణీయ పాత్రలు పోషించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన నటించిన ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెలుగులో డబ్ చేసి విడుదల విడుదల అయ్యాయి. అలా తెలుగు ప్రేక్షకులకు కూడా బాగా సుపరిచితమయ్యారు. కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ లోనూ వరుసగా చిత్రాలు చేస్తూ కోట్లాదిమంది ప్రేక్షకులను సంపాదించుకున్నారు. మాధవన్ హీరోగా మాత్రమే కాకుండా విలన్ గా కూడా రాణించాడు. నాగచైతన్య హీరోగా నటించిన సవ్యసాచి సినిమాలో విలన్ పాత్రలో నటించి మెప్పించాడు.

హీరో మాధవన్ సౌత్ లోనే కాదు నార్త్ లో కూడా తన సత్తా చాటారు. 2001లో రెహ్నా హై తేరే దిల్ మే' సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టారు. అనంతరం 'రంగ్ దే బసంతి', '3 ఇడియట్స్' వంటి సినిమాలతో ఎంతో మంది అభిమానుల్ని సొంతం చేసుకున్నాడు ఈ టాలెంటెడ్ హీరో. దీంతో మాధవన్ వెనక్కి తిరిగి చూడలేదు. వరుస సినిమాలు చేస్తూ బాలీవుడ్ కూడా స్టార్ హీరోగా మారారు. హీరో మాధవన్ కేవలం నటుడిగానే కాకుండా దర్శకుడిగా, ప్రొడ్యూసర్ గా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఇదెలా ఉంటే.. ఆర్ మాధవన్ కు లగ్జరీ కార్లు, ఖరీదైన బైకులంటే ఎంత ఇష్టమో అభిమానులకు తెలుసు.మాధవన్ దగ్గర పెద్ద సంఖ్యలో లగ్జరీ కార్ల కలెక్షన్ ఉంది. అందులో BMW, ఆడి, రేంజ్ రోవర్ వంటి అనేక పలు లగ్జరీ కార్లు ఉన్నాయి. ఈ కలెక్షన్ మాధవన్ చిత్రాలలో కూడా చాలాసార్లు కనిపించింది. దీనితో పాటు మాధవన్‌కి బైక్‌లంటే కూడా చాలా ఇష్టం. మాధవన్ దగ్గర BMW K1600 GTL, రోడ్‌మాస్టర్ క్రూయిజర్ , డుకాటీ వంటి లగ్జరీ అండ్ హైఎండ్ బైక్‌ల కలెక్షన్ కూడా ఉంది. తాజాగా ఆయన బైక్ కలెక్షన్స్ లో మరో కొత్త ఖరీదైన బైక్ చేరింది.

మాధవన్ కొలుగోలు చేసిన బైక్ పేరు బ్రిక్స్టన్ క్రోమ్‌వెల్ 1200 (Brixton Cromwell 1200). ఈ బైక్‌ ధర ఇండియన్‌ మార్కెట్‌లో రూ.7.84 లక్షలు (ఎక్స్-షోరూమ్)ఉంది. ఈ బైక్‌ను కొనుగోలు చేసిన తొలి భారతీయుడిగా ఆయన రికార్డ్‌ క్రియేట్‌ చేశారు. అలాగే.. ఈ బైక్‌ను కొనుగోలు చేసిన మొదటి సెలబ్రిటీ గా బాలీవుడ్ నటుడు ఆర్ మాధవన్ నిలిచారు. బ్రిక్స్టన్ క్రోమ్‌వెల్ 1200 గురించి మాట్లాడుకుంటే.. ఇది ఒక ఆస్ట్రియన్ బ్రాండ్ మోటార్‌సైకిల్.భారతదేశంలో దీని డిమాండ్ క్రమంగా పెరుగుతోంది. ఆర్ మాధవన్ దీనిని తీసుకున్న తర్వాత దానికి మరింత పాపులారిటీ పెరిగింది. భారత మార్కెట్లో ఈ బైక్ ధర దాదాపు రూ. 7 లక్షల 84 వేలు.

More from Filmibeat

Read more about: r madhavan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X