twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ఆ దాడి కేసులో ఇరుక్కున్న విజయ్ సేతుపతి.. మొన్న పరువునష్టం దావా ఇప్పుడు క్రిమినల్ కేసు!

    |

    తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి ఈ మధ్యకాలంలో అనుకోని సంఘటనలు కారణంగా వార్తల్లోకి వస్తున్న సంగతి తెలిసిందే. ఎయిర్ పోర్టులో దాడి ఘటనకు సంబంధించి విజయ్ సేతుపతి మీద మరో కేసు నమోదైంది. ఆ వివరాల్లోకి వెళితే

    క్రిమినల్ చర్యలు తీసుకోవాలని

    క్రిమినల్ చర్యలు తీసుకోవాలని

    తమిళ్ లో కంపెనీ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఇప్పుడు స్టార్ నటుడిగా మారారు విజయ్ సేతుపతి. దాదాపు ఆయన తమిళ భాష సహా తెలుగులో కూడా సినిమాల్లో నటిస్తున్నారు. తాజాగా విజయ్ సేతుపతి ఆయన మేనేజర్ జాన్సన్ మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలని కోరుతూ కోర్టులో కేసు వేసినట్లు చెబుతున్నారు.

    విజయ్ సేతుపతి మీద దాడి

    విజయ్ సేతుపతి మీద దాడి

    అసలు విషయానికి వస్తే గత కొద్ది రోజుల క్రితం బెంగుళూరు విమానాశ్రయంలో విజయ్ సేతుపతి మీద దాడి జరిగిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. విజయ్ సేతుపతి తన సిబ్బందితో కలిసి నడుస్తూ ముందుకు వెళ్తున్న సమయంలో ఒక వ్యక్తి వెనక నుంచి వచ్చి దాడి చేయడానికి ప్రయత్నించిన వీడియో ఫుటేజ్ విజువల్స్ బాగా వైరల్ అయ్యాయి.

    బెంగుళూరు విమానాశ్రయంలో

    బెంగుళూరు విమానాశ్రయంలో

    ఆ తర్వాత విజయ్ సేతుపతి చాలా చిన్న విషయమని అందుకే పోలీసులకు కూడా ఫిర్యాదు చేయలేదని కొట్టిపారేశారు కానీ. ఇప్పుడు అదే విషయం విజయ్ మెడకు చుట్టుకునే ఎలా కనిపిస్తోంది. నిజానికి బెంగుళూరు విమానాశ్రయంలో మహా గాంధీ అనే వ్యక్తి విజయ్ సేతుపతి మీద దాడి చేశారు. మహా గాంధీ వాదన ఒకలా ఉంటే విజయ్ సేతుపతి వాదన ఒకలాగా ఉంది.

    ఇద్దరూ కలిసి తనను కొట్టారని

    ఇద్దరూ కలిసి తనను కొట్టారని

    గత కొద్ది రోజుల క్రితం విజయ్ సేతుపతి మీద పరువు నష్టం దావా వేసిన మహా గాంధీ ఇప్పుడు క్రిమినల్ కేసు కూడా పెట్టారు. తాను నవంబర్ 2వ తేదీ మెడికల్ చేపకోసం మైసూరు వెళుతున్నానని ఆ సమయంలో బెంగళూరు ఎయిర్ పోర్టులో విజయ్ సేతుపతి కలిశానని వెల్లడించారు.. విజయ్ సేతుపతి కి తనకు మధ్య మాటా మాటా పెరగడంతో విజయ్ సేతుపతి తో పాటు అతని మేనేజర్ జాన్సన్ కూడా కలిసి ఇద్దరూ తనను కొట్టారని మహా గాంధీ ఫిర్యాదు చేశారు.

     తోటి నటుడు అనే ఉద్దేశంతో

    తోటి నటుడు అనే ఉద్దేశంతో

    తాను కూడా నటుడిని అని పేర్కొన్న మహా గాంధీ విజయ్ సేతుపతి తోటి నటుడు అనే ఉద్దేశంతో పలకరించాను అని సూపర్ డీలక్స్ సినిమాకు ఉత్తమ సహాయ నటుడిగా జాతీయ అవార్డు వచ్చిన కారణంగా పలకరించి ప్రశంసలు కురిపించారు అని వెల్లడించారు. ఆ సమయంలో విజయ్ తనను అసభ్యంగా ప్రవర్తించడమే కాక కులాన్ని కూడా కించపరిచారని కేసులో పేర్కొన్నారు మహా గాంధీ. ఆ సమయంలో విజయ్ సేతుపతి, అతని మేనేజర్ జాన్సన్ దాడి చేయగా తన చెవి కుడి చెవి మీద గాయం అయిందని ఆ దెబ్బతో పూర్తిగా వినిపించడం మానేసింది అని చెప్పుకొచ్చాడు

    Recommended Video

    Nayeem Diaries Team Reveals Shocking Facts About Movie | Part 03 || Filmibeat Telugu
    3 కోట్ల రూపాయల పరువు నష్టం దావా

    3 కోట్ల రూపాయల పరువు నష్టం దావా

    ఇక తాను విజయ్ సేతుపతి మీద దాడి చేసినట్లు ప్రచారం చేశారు కానీ తాను ఎలాంటి దాడి చేయలేదని అలాగే తాను మందు తాగి ఉన్నాను అంటూ ప్రచారం చేశారు కాబట్టి ఆ సమయంలో తాను మందు తాగి లేను కాబట్టి తన పరువు నష్టం కలిగించే విధంగా ప్రవర్తించారు కాబట్టి విజయ్ మీద మహాత్మాగాంధీ 3 కోట్ల రూపాయల పరువు నష్టం దావా వేశారు. మరి ఈ విషయం మీద విజయ్ ఎలా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది.

    English summary
    Actor maha gandhi files criminal case against vijay sethupathi on bangalore airport incident.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X