Jani Master Arrest: ‘న్యాయం కోసం పోరాడండి లేదా తప్పు చేస్తే ఒప్పుకోండి’: మంచు మనోజ్ ట్వీట్ వైరల్

Jani Master Arrest: సౌత్ ఇండియా టాప్ కొరియో గ్రాఫర్ జానీ మాస్టర్ లైంగిక ఆరోపణల కేసులో అరెస్టు కావడం హాట్ టాపిక్ గా మారింది. ఎంతో మంది టాప్ హీరోస్, హీరోయిన్స్ దగ్గర పని చేసిన జానీ మాస్టర్ నేడు ఓ మహిళ డ్యాన్సర్ పై లైంగిక వేధింపులు, అత్యాచారం ఆరోపణలపై అరెస్ట్ అయ్యారు. ఈ వ్యవహారంలో ఆయనకు వ్యతిరేకంగా కొంతమంది సినీ,రాజకీయ ప్రముఖులు, మహిళా సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. ఈ తరుణంలో తాజాగా మంచు మనోజ్ కూడా తనదైన శైలిలో స్పందించాడు. ఇంతకీ ఏమన్నారంటే..?

జానీ మాస్టర్ దగ్గర పనిచేసిన ఓ లేడీ కంటెస్టెంట్ సంచలన ఆరోపణలు చేసింది. తన జానీ మాస్టర్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని, మతం మార్చుకుని తననీ పెళ్లి చేసుకొమ్మని బలవంతం చేశాడని ఆరోపించింది. ఈ క్రమంలో బాధితురాలు ఫిర్యాదు మేరకు నార్సింగి పోలీసులు జానీ మాస్టర్‌పై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ కేసు నమోదు కావడంతో పరార్ ఉన్న జానీ మాస్టర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Actor Manchu Manoj reacts to the Johnny Master Molestion controversy Case

గోవాలో జానీ మాస్టర్ ను అరెస్ట్ చేశారు తెలంగాణ ఎస్ఓటీ పోలీసులు. అనంతరం అతనిని హైదరాబాద్ తరలించారు. ఆయనను విచారించిన అనంతరం రేపు (శుక్రవారం) కోర్టులో హాజరుపరుస్తారు. జానీ మాస్టర్ భార్య సైతం తన పై దాడికి ల్పడిందని ఇప్పటికే బాధితురాలు ఫిర్యాదు చేసింది. దీంతో ఆమెకు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు, అరెస్ట్ కావడంపై హీరో మంచు మనోజ్ స్పందించారు. ఈ విషయానికి సంబంధించి ట్విట్టర్ లో ఓ పోస్ట్ పెట్టాడు మంచు మనోజ్.

'జానీ మాస్టర్ మీరు ఎంతో కష్ఠపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. మీరు ఎలాంటి అడ్డంకులను అధిగమించిన ఈ స్థాయికి చేరుకున్నారో అందరికీ తెలుసు. కానీ ఈ రోజు మీపై తీవ్రమైన ఆరోపణలు చూస్తుంటే.. గుండె తరుక్కుపోతోంది. నిజం ఎప్పటికైనా బయటపడుతుంది. ఎవరిది ఒప్పో.. ఎవరిది తప్పుదో చట్టం నిర్ణయిస్తుంది. కానీ, ఒక మహిళకి సంబంధించిన కేసు విషయంలో మీరు పారిపోవడం సమాజానికి తప్పుడు సందేశాన్ని పంపుతుంది. చట్టానికి ఎవరూ అతీతులు కాదని దీన్నిబట్టి తెలుస్తోంది. జానీ మాస్టర్ తప్పు చేయకపోతే న్యాయం కోసం పోరాడండి. మీరు తప్పు చేస్తే నిజం ఒప్పుకోండి.'అని పేర్కొన్నారు.

Actor Manchu Manoj reacts to the Johnny Master Molestion controversy Case

మనోజ్ కంటిన్యూ చేస్తూ.. ఈ కేసులో వేగంగా స్పందించి చర్యలు తీసుకున్న హైదరాబాద్ సిటీ పోలీసులకు అభినందలు తెలిపారు. వాగ్దానం చేసిన ప్రకారం.. ఉమెన్స్ ప్రొటెక్షన్ సెల్‌ని యాక్టివేట్ చేయాలని MAA అసోసియేషన్‌ని కోరుతున్నాను. అలాగే.. ఇండస్ట్రీలో మహిళలకు వాయిస్‌ ఉండాలి. ప్రతి అమ్మాయి, ప్రతి మహిళ ఒంటరి కాదనీ, వారి తరపున MAA పెద్దలు, సహోద్యోగులు పోరాడాలి, వారికి అండగా నిలబడాలి' అని మంచు మనోజ్ ట్వీట్ చేశాడు.

More from Filmibeat

Read more about: manchu manoj jani master
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X