అల్లు అరవింద్ కుటుంబంతో విబేధాలు.. బాలకృష్ణతో అన్ స్టాపబుల్ చేయడంపై మెగాస్టార్ చిరంజీవి వివరణ

మెగాస్టార్ చిరంజీవికి అలాగే అల్లు అర్జున్ కుటుంబానికి ఇటీవల కాలంలో కొంత విభేదాలు ఉన్నాయని అందుకే ఒకరి గురించి మరొకరు మాట్లాడడం లేదు అని అనేక రకాలు కథనాలు అయితే వెలువడ్డాయి. అంతేకాకుండా అల్లు అర్జున్ కూడా మెగా ట్యాగ్ ఏమాత్రం ఇష్టపడడం లేదు అని అందుకే మెగా హీరోలకు దూరంగా ఉంటున్నాడు అని కూడా వార్తలు వచ్చాయి. అయితే ఆ విషయాలపై మెగాస్టార్ చిరంజీవి ఈటీవీలో ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా బాలకృష్ణతో అల్లు అరవింద్ ఎందుకు క్లోజ్ గా ఉంటున్నారు అనే విషయంలో కూడా ఆయన వివరణ ఇచ్చారు. పూర్తి వివరాలలోకి వెళితే..

అల్లు వారితో విబేధాలు

అల్లు వారితో విబేధాలు

మెగాస్టార్ చిరంజీవి చాలా వరకు అందరితో స్నేహం పూర్వకంగా ఉండేందుకు ఇష్టపడుతుంటారు. వీలైనంతవరకు వివాదాలకు దూరంగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఈ క్రమంలో అల్లు అరవింద్ తో మాత్రం వారికి కొంత గ్యాప్ ఉంది అని కొన్ని విభేదాలు తలెత్తినట్లు కూడా చాలాసార్లు వార్తలు వచ్చాయి.

అలాంటి విబేధాలు

అలాంటి విబేధాలు

ఇక మొత్తానికి మెగాస్టార్ చిరంజీవి ఇటీవల వాల్తేరు వీరయ్య ప్రమోషన్ లో భాగంగా ఆ వార్తలపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. మెగాస్టార్ మాట్లాడుతూ.. ఇలాంటి తరహా వార్తలు మాకు ఎప్పుడూ వినిపిస్తూనే ఉంటాయి. కానీ ఎప్పుడూ కూడా మా మధ్యలో అలాంటి విభేదాలు వచ్చినట్లు లేదు. కుటుంబ పరంగా అయితే ఎప్పుడు మేము కలిసే ఉన్నాము. అల్లు అరవింద్ పుట్టినరోజు సందర్భంగా మేము ఎప్పటికీ వారి ఇంటికి వెళ్లి వస్తూ ఉంటాము.. అని అన్నారు.

సెలబ్రేషన్స్ లో బన్నీ

సెలబ్రేషన్స్ లో బన్నీ

కుటుంబ పరంగా అయితే మేము ఎప్పుడూ కలిసే ఉన్నాము. రీసెంట్ గా క్రిస్మస్ సందర్భంగా నేను పాల్గొనలేకపోయినప్పటికీ మా కుటుంబంలోని అందరూ కూడా ఒక దగ్గర చేరి సెలబ్రేట్ చేసుకున్నారు. ముఖ్యంగా అల్లు అర్జున్ కూడా మా ఇంటికి వచ్చి ఇక్కడే సెలబ్రేట్ చేసుకున్నాడు. మిగతా హీరోలు వరుణ్ తేజ్ అలాగే మా అమ్మాయిలు అందరూ కూడా ఆ వేడుకల్లో పాల్గొన్నారు.. అని చిరంజీవి తెలిపారు.

కెరీర్ లో పోటాపోటీగా

కెరీర్ లో పోటాపోటీగా

కుటుంబ పరంగా పెద్దగా ఎలాంటి అభ్యంతరాలు లేవు. మేము ఏ వేడుక జరిగినా కూడా కలిసి సెలబ్రేట్ చేసుకుంటాము. కానీ వృత్తిపరంగా కెరీర్ పరంగా కూడా మాత్రం ఎవరిదారి వారిదే. వారి సొంత టాలెంట్ తో అవకాశాలు అందుకుంటూ ముందుకు కొనసాగుతున్నారు. ఇక ఆ రూట్లో కూడా పోటాపోటీగా వెళ్లడం అనేది చాలా సాధారణమైన విషయం. కానీ పర్సనల్ గా మాత్రం ఎవరి మీద ఎలాంటి అభ్యంతరాలు లేవు అని అందరం కూడా చాలా హ్యాపీగా ఉంటాము అని మెగాస్టార్ అన్నారు.

బాలయ్యతో ఆహా

బాలయ్యతో ఆహా

అయితే అల్లు అరవింద్ మెగాస్టార్ మీద కోపంతోనే బాలకృష్ణకు క్లోజ్ అవుతున్నారు అని అందుకని అన్ స్టాపబుల్ షో చేశారు అని కామెంట్స్ రాగా వాటిపై కూడా మెగాస్టార్ స్పందించారు. ఇండస్ట్రీలో ఆహా అనేది అందరితోనూ చాలా ఫ్రెండ్లీగా ఉండాలి.. అందరితో కలిసి వర్క్ చేస్తేనే బాగుంటుంది. బిజీగా ఉండడం వలన అలాంటి ఆఫర్ నాకు రాకపోయి ఉండవచ్చు. అయినా అన్ స్టాపబుల్ షో చాలా బాగా ముందుకు వెళుతుంది. ఆ విషయంలో కూడా నాకు ఎలాంటి అభ్యంతరాలు లేవు. మేము చాలా హ్యాపీగా ఉన్నాము.. అని మెగాస్టార్ మరోసారి వివరణ ఇచ్చారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X