సన్నాఫ్ ఇండియా, జిన్నా సినిమాలపై మోహన్ బాబు రియాక్షన్.. అది హిట్టవ్వాల్సిన సినిమా అంటూ..
నట ప్రపూర్ణ డాక్టర్ మంచు మోహన్ బాబు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినీ చరిత్రలో గొప్ప నటుడిగా పేరు తెచ్చుకున్న ఈయన.. 90వ దశకంలో పెదరాయుడు, అసెంబ్లీ రౌడీ, అల్లుడుగారు, అల్లరి మొగుడు లాంటి సూపర్ హిట్ చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేశాడు. కానీ ఆ తర్వాత ట్రెండ్ ను అందిపుచ్చుకోలేక వరుసగా అపజయాల పాలయ్యాడు. కానీ ఆయన వారసులు మంచు విష్ణు, మంచు లక్ష్మీ, మంచు మనోజ్ లు ముగ్గురూ సినీ రంగంలో అడుగు పెట్టారు.
మనోజ్, విష్ణు ఇద్దరూ హీరోలుగా మంచి పేరే తెచ్చుకున్నారు. లక్ష్మీ కూడా పలు సినిమాల్లో నటించి మెప్పించినప్పటికీ.... ఈ మధ్య మాత్రం చిత్రాల్లో నటించడం తగ్గించేసింది. ఈ మధ్య మంచు ఫ్యామిలీ పరిస్థితి చాలా దారుణంగా మారిపోయింది. మనోజ్, లక్ష్మీ ప్రసన్నలు సినిమాలు బాగా తగ్గించేయగా... విష్ణు మాత్రం అప్పుడప్పుడూ ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అవి బాక్సాఫీసు వద్ద భారీ డిజాస్టర్లుగా నిలుస్తున్నాయి. గతేడాది మంచు ఫ్యామిలీ నుంచి వచ్చిన జిన్నా సినిమా అట్టర్ ప్లాప్ గా నిలిచింది.

అంతకు ముందు మోహన్ బాబు హీరోగా నటించిన సన్నాఫ్ ఇండియా కూడా మంచు ఫ్యామిలీని తీవ్రంగా నిరాశపరిచింది. అయితే తాజాగా ఈ రెండు చిత్రాల ఫలితాలపై మోహన్ బాబు పలు ఆసక్తికర కామెంట్లు చేశారు. జిన్నా లాంటి సినిమా ఆడకపోవడం తనను ఎంతగానో బాధించింది చెప్పారు. ఒకప్పుడు లక్ష్మీప్రసన్న బ్యానర్ లో తాను ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసినట్లు వెల్లడించారు. అలాగే అదే బ్యానర్లో ఇప్పుడు వరుస పరాజయాలు ఎదురవుతున్నాయన్నారు.

తాను హీరోగా నటించిన సన్నాఫ్ ఇండియా ఓ ప్రయోగాత్మక చిత్రం అని.. ఆ సినిమాకు ప్రతికూల ఫలితం రావడం గురించి పెద్దగా పట్టించుకోనని చెప్పారు. కానీ జిన్నా సూపర్ హిట్టు కావాల్సిన చిత్రం అని, కానీ ఆ సినిమా ఆడకపోవడం తనకు ఎంతగానో బాధ కల్గించిందని వివరించారు. మోగాస్టార్ చిరంజీవితో విబేధాల గురించి మాట్లాడుతూ.. తామిద్దరం ఎప్పుడూ ఎదురు పడినా బాగానే మాట్లాడుకుంటామని.. తమవి గిల్లికజ్జాల్లాంటివని చెప్పారు. తమ మధ్య వ్యక్తిగతంగా ఎలాంటి గొడవలు లేవని మోహన్ బాబు స్పష్టం చేశారు.


Click it and Unblock the Notifications











