ఎవరేమన్నా గాడ్ ఫాదర్ చిరంజీవే.. మురళీ మోహన్ అసక్తికర వ్యాఖ్యలు!

గత కొద్దికాలంగా మెగాస్టార్ చిరంజీవి తన పెద్ద మనసు చాటుకుంటూనే ఉన్నారు. ఆయన ఒక పక్క సినిమాల్లో బిజీగా ఉంటూనే మరోపక్క సినిమా ఇండస్ట్రీ మొత్తానికి పెద్దగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు మొదలు వ్యాక్సిన్ వేయించే వరకు ఆయన కరోనా చారిటీ సంస్థ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అలాంటి ఆయన మీద మురళీ మోహన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే..

పెద్ద దిక్కుగా

పెద్ద దిక్కుగా

తెలుగు సినీ జగత్తులో మెగాస్టార్ చిరంజీవి తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్ సాధించుకున్నారు. సామాన్యుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి అసామాన్యుడిగా ఎదిగిన చిరు, ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్దన్నగా మారారు. వివాదాలు, విషాదాలు, సమస్యలు, సంబరాలు ఏవి వచ్చినా అన్నింటిలో తానే ముందుండి ఇండస్ట్రీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తున్నాడు.

నేనున్నానంటూ

నేనున్నానంటూ

ఇండస్ట్రీలో ఎవరికి ఏ కష్టం వచ్చినా.. ఎవరికి ఏ అవసరం వచ్చినా కూడా కాదనకుండా వస్తున్నాడు.. తనవంతు సాయం చేస్తున్నాడు. తాజాగా కొద్ది మంది ఇండస్ట్రీ వారు మరణించగా వారి కుటుంబాలకి ఆర్థిక సహాయం చేసిన చిరు ఆ తర్వాత రెండు తెలుగు రాష్ట్రాల వ్యాప్తంగా ఆక్సిజన్ ట్యాంకులు ఏర్పాటు చేసి మరీ సాయం అందిస్తున్నారు.

పరిశ్రమకు గాడ్‌ఫాదర్

పరిశ్రమకు గాడ్‌ఫాదర్

తాజాగా ప్రముఖ సీనియర్ నటుడు, మాజీ ఎంపీ మురళి మోహన్ మెగాస్టార్ చిరంజీవిపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమకు గాడ్ ఫాదర్ అని ఒక టీవీ ఛానెల్కు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, దాసరి నారాయణరావు జీవించి ఉన్నంత కాలం తెలుగు చిత్ర పరిశ్రమకు అండగా ఉన్నారని, అయితే, ఇప్పుడు ఆయన స్థానాన్ని చిరంజీవి కొంతవరకు భర్తీ చేస్తున్నట్లు అనిపిస్తోందని అన్నారు.

చిరంజీవి చొరవ

చిరంజీవి చొరవ

అలాగే, చిత్ర పరిశ్రమలో వ్యక్తుల మధ్య తలెత్తే ఏ సమస్యకైనా స్పందించడానికి మెగాస్టార్ చిరంజీవి చొరవ తీసుకుంటున్నారని నటుడు మురళీ మోహన్ అన్నారు. కరోనా సంక్షోభ సమయంలో పేద సినీ వర్కర్స్, జూనియర్ ఆర్టిస్ట్ లకు సహాయం చేయడమే కాక కరోనా బాధితులకు ఆక్సిజన్ సరఫరా చేశాడని అన్నారు. ఎవరేమన్నా ప్రస్తుతం చిరంజీవి తెలుగు చిత్ర పరిశ్రమకు గాడ్‌ఫాదర్ అని మురళి మోహన్ అన్నారు.

 సినిమాల విషయానికి వస్తే

సినిమాల విషయానికి వస్తే

ఇక ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటించిన సినిమాల విషయానికొస్తే ఆయన కొరటాల శివ దర్శకత్వంలో ఆచార్య అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ 12 రోజులు మాత్రమే మిగిలి ఉంది. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే ఆయన ఏకంగా మూడు సినిమాలు లైన్ లో పెట్టారు. అందులో ముందుగా లూసిఫర్ రీమేక్ సినిమా షూటింగ్ ప్రారంభించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X