కోవిడ్ వ్యాక్సిన్ తీసుకొన్న నాగార్జున అక్కినేని.. సైడ్ ఎఫ్టెక్ట్స్‌పై మన్మథుడి వివరణ
కోవిడ్ 19 పరిస్థితులు మళ్లీ విజృంభిస్తున్న సమయంలో సినీ ప్రముఖులంతా కరోనా వ్యాక్సిన్ తీసుకొంటూ సెల్పీలతో సోషల్ మీడియాలో హంగామా చేస్తున్నారు. ఇటీవల కమల్ హాసన్, మోహన్ లాల్ లాంటి నటులు కొవాక్సిన్, కోవి షీల్డ్ వ్యాక్సిన్లు తీసుకోవడం తెలిసిందే. తాజాగా టాలీవుడ్ మన్మథుడు అక్కినేని నాగార్జున వ్యాక్సిన్ తీసుకొన్నానంటూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు.
తాను కోవాక్జిన్ వ్యాక్సిన్ తీసుకొన్నానంటూ సోషల్ మీడియాలో స్పందిస్తూ.. ఇటీవల నేను కొవాగ్జిన్ వ్యాక్సిన్ తీసుకొన్నాను. నా జాబ్ పూర్తయింది. నాకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఈ వ్యాక్సిన్ తీసుకోవడానికి అర్హత ఉన్న ప్రతీ ఒక్కరు తీసుకోవాలి. కొవిడ్19 వ్యాక్సిన్ కోసం http://cowin.gov.in వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకొండి అంటూ నాగార్జున ట్వీట్ చేశారు.

ఇక కెరీర్ విషయానికి వస్తే.. నాగార్జున నటించిన బ్రహ్మస్త్ర, వైల్డ్ డాగ్ చిత్రాలు రిలీజ్‌కు సిద్ధంగా ఉన్నాయి. వైల్డ్ డాగ్ చిత్రం ఏప్రిల్ 2వ తేదీన రిలీజ్ కానున్నది. ఇదిలా ఉండగా, యంగ్ డైరెక్టర్ ప్రవీన్ సత్తారు దర్శకత్వంలో ఇంకా పేరు పెట్టని చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటించనున్నారు.


Click it and Unblock the Notifications











