గీతా మాధురితో విడాకులు .. రూమర్స్‌పై లైవ్‌లో తేల్చేసిన నందు

సినీ తారల ప్రేమలు, పెళ్లిళ్లు, ఎఫైర్స్‌పై పబ్లిక్‌కి బాగా ఇంట్రెస్ట్. అందుకే లేనిది వున్నట్లు, వున్నది లేనట్లుగా అందమైన కథలు అల్లుతూ కొందరు గాసిప్స్ వదులుతుంటారు. ఎవరి మనోభావాలు దెబ్బతింటే మాకెందుకు .. మా గాసిప్ బాగా పేలిందా లేదా అన్నదే వీరికి ముఖ్యం. ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో ఏది నిజమో, ఏది అబద్ధమో తెలిసేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోతోంది. ఈ గాసిప్స్‌ను కొందరు పట్టించుకుంటారు, కొందరు పక్కనపడేస్తారు, ఇంకొందరు అలవాటు పడిపోతారు. స్పందిస్తే ఒక బాధ, స్పందించకుంటే ఒక బాధ అన్నట్లుగా వుంటుంది పరిస్ధితి.

ఇదిలావుండగా.. యువ నటుడు నందు, స్టార్ సింగ్ గీతా ప్రేమించి పెద్దల అంగీకారంతో ఒక్కటైన సంగతి తెలిసిందే. నందు సినిమాలలో బిజీగా వుండగా.. గీతా మాధురి స్టార్ సింగర్‌గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇటీవలే గీత రెండోసారి పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. పెళ్లయిన నాటి నుంచి నేటి వరకు గీతా మాధురి, నందూ విడిపోతున్నట్లు ఎన్నోసార్లు సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. ఇంకొన్ని సార్లయితే విడాకులు కూడా మంజూరైపోయాయంటూ పుకార్లు రేపారు. అయితే ఈసారి నందూ కెరిర్ డౌన్‌ఫాల్‌లో ఉండటం.. గీతా మాధురి గొంతు కూడా పెద్దగా వినిపించకపోవడంతో మరోసారి గాసిప్ రాయుళ్లు రెచ్చిపోయారు. వీరిద్దరూ విడిపోతున్నారని.. ప్రజంట్ దూరంగా వున్నారంటూ ప్రచారం జరిగింది.

actor nandu reacts on divorce rumours with his wife geetha madhuri

ఈ పుకార్లపై నందు స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయనను యాంకర్ విడాకులపై ప్రశ్నించారు. ఈ రూమర్స్‌కి ఇంతటితో చెక్ పెట్టాలని ఫిక్స్ అయ్యాడో ఏమో కానీ .. లైవ్‌లోనే తన భార్య గీతా మాధురికి ఫోన్ చేశాడు. ఆ సమయంలో ఆమె కారు డ్రైవింగ్‌లో వున్నారు. తొలుత వీడియోను గీత లిఫ్ట్ చేయలేదు.. అయితే నందు చెప్పడంతో ఆన్ చేసింది. అలాగే తాను, గీతా మాధురి కలిసి ఓ ఇంటర్వ్యూ ఇస్తామని లైవ్‌ షోలో ప్రామీస్ చేశాడు.

ఇకపోతే.. ఈ ఇంటర్వ్యూలో నందు మరిన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. గీతా మాధురి క్యాసినోలలో డబ్బులు పొగొట్టుకునేదని చెప్పారు. అది కొంచెం పెద్ద మొత్తమేనని నందు అన్నారు. తమ పెళ్లి అయి పదేళ్లు అవుతోందని, కానీ సెలబ్రేషన్స్ ప్లాన్ చేయడం లేదని చెప్పారు. ప్రజంట్ ఇండస్ట్రీలో , సొసైటీలో ఎంతోమంది కపుల్స్ చాలా ఈజీగా విడిపోతున్నారని.. కానీ అది ఎంతో పెయిన్‌గా వుంటుందని నందు అన్నారు. ఇలాంటి సమయంలో తాము సెలబ్రేషన్స్ ప్లాన్ చేస్తే వాళ్లు బాధపడటమే కాకుండా , తమని విమర్శిస్తారని అందుకే వేడుకలకు దూరంగా వుంటున్నట్లు తెలిపారు.

actor nandu reacts on divorce rumours with his wife geetha madhuri

కాగా.. నందు ప్రస్తుతం యాంకర్‌గా అవతారమెత్తాడు. ప్రముఖ తెలుగు ఛానెల్‌లో ప్రసారమయ్యే ''ఢీ '' షోకి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. గతంలో దీనికి ప్రదీప్ మాచీరాజు యాంకర్‌గా వుండగా.. ఆయన స్థానంలో నందుని తీసుకున్నారు. దీనితో పాటు ఐపీఎల్ మ్యాచ్‌లకు కూడా ఆయన యాంకరింగ్ చేస్తున్నారు. ఇన్నింగ్స్ బ్రేకులు, ఇతర విరామ సమయాల్లో సెలబ్రెటీలతో మాట్లాడిస్తూ సందడి చేస్తున్నారు నందూ.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X