Actor Nandu: "డ్రగ్స్ కేసు వల్ల ఫ్యామిలీతో సహా దేశం వదిలి వెళ్లిపోవాలనుకున్నా.. కానీ"

టాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ యాక్టర్ నందు గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన అందం, అంతకు మించిన టాలెంట్ తో కెరియర్ కొనసాగిస్తున్న ఈయన సింగర్ గీతా మాధురి భర్త అని కూడా అందరికీ తెలిసిందే. అయితే ఇటీవలే రెండోసారి తండ్రి అయిన తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. ఈ సందర్భంగానే మాట్లాడుతూ.. డ్రగ్స్ కేసు వల్ల తాను ఫ్యామిలీతో సహా దేశం వదిలి వెళ్లిపోవాలనుకున్నట్లు తెలిపాడు. అలాగే తన భార్య అలా చూసేదంటూ చెప్పి తొలిసారి ఎమోషనల్ అయ్యాడు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

నటుడు నందు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తెలుగు సినిమాలు చేస్తూ తన లాటెంట్ ప్రూవ్ చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సింగర్ గీతా మాధురిని ప్రేమించాడు. ఆమె కూడా ఇతడి ప్రేమను అంగీకరించగా... వీరిద్దరూ పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకున్నారు. ముఖ్యంగా 2014లో వీరి వివాహం జరిగింది. అప్పటి నుంచి చాలా హాయిగా సాగుతున్న వీరి కాపురంలోకి ముందుగా ఓ పాప వచ్చింది. ఇటీవలే ఓ బాబు కూడా పుట్టాడీ క్యూట్ కపుల్ కు. అయితే ప్రస్తుతం చాలా హాయిగా ఉన్న ఈ జంట గతంలో చాలా సమస్యలు ఎదుర్కుంది.

Actor Nandu Shocking Comments About His Drugs Case Check Details

ముఖ్యంగా నటుడు నందు పేరు డ్రగ్స్ కేసులో రాగా.. అంతా తెగ టెన్షన్ పడిపోయారు. ముఖ్యంగా టీవీల్లో పదే పదే ఈయన పేరు వేస్తూ డ్రగ్స్ తీసుకున్నాడంటూ చెప్పగా.. ఆయన తల్లిదండ్రులతో పాటు గీతామాధురి అమ్మా, నాన్నలు కూడా చాలా బాధ పడ్డారట. కొన్నాళ్ల పాటు మనశ్శాంతి లేకుండా అనుక్షణం భయపడుతూనే గడిపారట. అయితే లోకం అంతా తాను డ్రగ్స్ తీసుకున్నట్లు భావించగా.. గీతా మాధురి ఒక్కతే తనను నమ్మిందని చెబుతూ నందు ఎమోషనల్ అయ్యాడు.

జోర్దార్ సుజాత చేసిన ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈయన.. కన్నీరు పెట్టుకున్నాడు. ముఖ్యంగా డ్రగ్స్ కేసులో తన పేరు వచ్చినప్పుడు చాలా సమస్యలు ఎదుర్కున్నానని... అయితే తాను డ్రగ్స్ తీసుకోనట్లు పేరు తెలియగానే చాలా సంతోష పడినట్లు వివరించాడు. కానీ అప్పటి వరకు బ్రేకింగ్స్ వేసి మరీ తన పేరు ప్రస్తావించిన టీవీ ఛానెళ్లు కేసు కొట్టేశాకా.. ఎక్కడో కింద స్క్రోలింగ్ లో తన పేరు వేశారంటూ ఎమోషనల్ అయ్యాడు. ముఖ్యంగా డ్రగ్స్ కేసు నడుస్తున్నప్పుడు... మనకు ఇదంతా అవసరమా ఇక్కడి నుంచి వేరే ఏదైనా దేశం వెళ్లిపోదా అనుకున్నాడట.

Actor Nandu Shocking Comments About His Drugs Case Check Details

కానీ తన భార్య గీతా మాధురి సపోర్ట్ తో ఆ సమస్య నుంచి బయట పడ్డానని.. ప్రస్తుతం చాలా హ్యాపీగా ఉన్నానని చెప్పుకొచ్చాడు. అలాగే తన పిల్లలు, భార్య, కుటుంబంతో ఎంతో హాయిగా గడుపుతున్నానని వివరించాడు. తన కూతురు అందరి ముందు... మా నాన్న అంటూ గర్వంగా చెప్పుకునే ప్రతీ క్షణం చాలా గర్వంగా అనిపిస్తుందని.. అలాగే ఇప్పుడు యాంకర్ గా మారి షోస్ హోస్ట్ చేయడం కూడా తనకు కిక్ ఇస్తుందని వెల్లడించాడు. మరి ముందు ముందు ఎలాంటి సినిమాల్లో కనిపిస్తాడో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X