twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    తెలంగాణ ఎన్నికల ఫలితాలపై హీరో నాని ఏమన్నారంటే...

    |

    తెలంగాణ ఎన్నికల్లో ఉద్యమ పార్టీ టీఆర్ఎస్ రెండోసారి అఖండ విజయం సొంతం చేసుకున్న నేపథ్యంలో టాలీవుడ్ ప్రముఖులంతా స్పందిస్తున్నారు. ఇప్పటికే సూపర్ స్టార్ కృష్ణతో పాటు మంచు మనోజ్, సుధీర్ బాబు, కోన వెంకట్, బివిఎస్ రవి, హరీష్ శంకర్ తమ అభిప్రాయాలు చెప్పగా.... తాజాగా హీరో నాని రియాక్ట్ అయ్యారు.

    తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను బ్రదర్ అని సంభోదిస్తూ నాని ట్వీట్ చేశారు. కేటీఆర్‌తో పాటు టీఆర్ఎస్ పార్టీకి కంగ్రాట్స్ తెలియజేశారు. నాని ట్వీట్ చూస్తుంటే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడంపై నాని సూపర్ హ్యాపీగా ఉన్నట్లు స్పష్టమవుతోంది.

    తెలంగాణ ప్రజలు తమ బాధ్యత నిర్వర్తించారు

    తెలంగాణ ప్రజలు తమ బాధ్యత నిర్వర్తించారు

    రాష్ట అభివృద్ధి కోసం తెలంగాణ ప్రజలు తమ వంతు బాధ్యత నిర్వర్తించారు... వారి నమ్మకం నిలబెట్టే బాధ్యత ఇపుడు మరోసారి అధికారంలోకి వచ్చిన టీఆర్ఎస్ పార్టీపై ఉందని నాని వ్యాఖ్యానించారు.

    మీపై నమ్మకం ఉంది

    మీపై నమ్మకం ఉంది

    తెలంగాణ ప్రజలు మీపై పూర్తి నమ్మకంతో మళ్లీ గెలిపించారు. మీరు వారికి అద్భుతమైన భవిష్యత్తును అందిస్తారనే నమ్మకం ఉంది... అంటూ నాని తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

    అనూహ్య మద్దతుకు కారణం ఏమిటి?

    అనూహ్య మద్దతుకు కారణం ఏమిటి?

    సినీ రంగానికి చెందిన వారి నుంచి టీఆర్ఎస్ పార్టీకి ఇలా అనూహ్య మద్దతు రావడానికి కారణం.... కేసీఆర్ ప్రభుత్వం సినిమా వారికి ముందు నుంచి అన్ని విధాలుగా సపోర్టుగా ఉండటమే అనే వాదన వినిపిస్తోంది.

    సెటిలర్లు హ్యాపీ...

    సెటిలర్లు హ్యాపీ...

    ముఖ్యంగా హైదరాబాద్‌లోని సెటిలర్లు కేసీఆర్ ప్రభుత్వం అవలంభిస్తున్న విధానాలు, శాంతి భద్రతల పరిరక్షణ లాంటి విషయాలతో పాటు పవర్ కట్స్ సమస్య లేకుండా చేయడంపై పూర్తి సంతృప్తిగా ఉన్నారు.

    English summary
    "Congratulations brother KTRTRS and trspartyonline for the glorious win. The people of Telangana have done their part and I'm sure you will deliver your best for a prosperous future!" Nani tweet.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X