Ante Sundaraniki : ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసిన నాని.. మాములు వెటకారం కాదుగా !
కరోనా కేసులు తగ్గుతున్న క్రమంలో ఆగిన సినిమాలన్నీ విడుదల కావడానికి సిద్ధం అవుతున్నాయి. ఇప్పటికే ముందు 'RRR' కోసం రెండు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేసి తర్వాత ఆ రెండూ కాకుండా మార్చి 25 ఫైనలైజ్ చేశారు. అలాగే 'భీమ్లా నాయక్', 'గని', 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమాల నుంచి రెండేసి రిలీజ్ డేట్స్ వచ్చాయి. ఈ క్రమంలో నేచురల్ స్టార్ నాని ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. ఆ వివరాల్లోకి వెళితే

శ్యామ్ సింగరాయ్ హిట్
గతేడాది చివర్లో నాని.. 'శ్యామ్ సింగరాయ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. డిసెంబర్ 24న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా క్లీన్ హిట్‌గా నిలిచింది. డిఫరెంట్ కథతో వచ్చిన నాని అందరినీ ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. దర్శకుడు రాహుల్ సాంకృత్యాన్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి, కృతిశెట్టి హీరోయిన్లుగా నటించారు.

అంటే సుందరానికి
శ్యామ్ సింగరాయ్ సినిమా విడుదల అవ్వకముందే 'అంటే సుందరానికి' షూటింగ్ సెట్‌లో అడుగుపెట్టాడు నాని. యూత్‌ఫుల్ సినిమాలు తెరకెక్కిస్తూ.. కమర్షియల్ సక్సెస్ వెంట పడకుండా ముందుకు వెళ్తున్న యంగ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయతో ఈ సినిమా చేశాడు నాని.

రెండు విడుదల తేదీలు
ఈ 'అంటే సుందరానికి' సినిమాలో నానికి జోడీగా మలయాళ స్టార్ హీరోయిన్ నజ్రియా నజీమ్ కనిపించింది. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా వాయిదా పడింది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, రవిశంకర్ .వై నిర్మిస్తున్నారు. ఇప్పుడు కరోనా వల్ల పోస్ట్‌పోన్ అయిన సినిమాలన్నీ ఒకటి కాకుండా ఏకంగా రెండు విడుదల తేదీలు ప్రకటిస్తుండడంతో 'అంటే సుందరానికి' టీమ్ కూడా అదే ఫార్ములాను ఫాలో అయ్యింది.

మెల్లగా డిసైడ్ చేస్తాం
ఈ సినిమాను వేసవిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. వేసవిలో ఇప్పటికే చాలా సినిమాలు క్యూ కట్టిన క్రమంలో నాని ఏకంగా ఏడు రిలీజ్ డేట్స్ అనౌన్స్ చేశారు. వీలును బట్టి ఏదో ఒక తేదీలో వస్తామని చెప్పినట్లయింది. అంతే కాదు అది సమ్మర్ కావడంతో.. ఫుల్ ఆవకాయ సీజన్ బ్లాక్డ్.... మెల్లగా డిసైడ్ చేస్తాం అంటూ ఫన్నీ ట్యాగ్ లైన్ కూడా ఇచ్చాడు నానీ .

ఏదో ఒక తేదీలో
ఏప్రిల్ 22, 29 లేదంటే మే 6, 20, 27 లేదంటే జూన్ 3, 10... ఏదో ఒక తేదీలో 'అంటే సుందరానికి' వస్తుందన్నట్టు నాని ప్రకటించారు. ఇక మరోపక్క కోలీవుడ్ నటుడు విష్ణు విశాల్ హీరోగా రూపొందుతున్న డార్క్ యాక్షన్ థ్రిల్లర్ 'ఎఫ్ఐఆర్' ట్రైలర్‌ని నాని తన ట్విట్టర్ ఖాతా ద్వారా విడుదల చేసి.. చిత్రయూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
Recommended Video

ఫిబ్రవరి 11న
మను ఆనంద్ దర్శకత్వంలో విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్‌పై విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదల కానుంది. మాస్ మహారాజా రవితేజ సమర్పణలో అభిషేక్ పిక్చర్స్ అధినేత అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు.ఈ సినిమా ఫిబ్రవరి 11న ఈ చిత్రం విడుదల కానుంది.


Click it and Unblock the Notifications











