ఒకే ఫ్రేమ్‌లో నాలుగు తరాలు.. ఇంట్రెస్టింగ్ ఫోటో షేర్ చేసిన నాని
నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం కుటుంబంతో సరదాగా గడిపేస్తున్నాడు. లాక్ డౌన్ సమయాన్ని తన ప్రియ పుత్రుడు జున్నుతో కలిసి ఫుల్ ఎంజాయ్ చేశాడు. వీరిద్దరు కలిసి చేసిన అల్లరికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఎంతగా వైరల్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ మధ్య ఓ సారి నాలుగు తరాలకు సంబంధించిన వ్యక్తులు ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫోటోను షేర్ చేశాడు. జున్ను పుట్టిన కొత్తలో నాని, నాని తండ్రి, నాని తాత అందరూ ఒకే ఫ్రేములో ఉన్న ఫోటోను షేర్ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.
నేడు అలాంటి ఫోటోను మళ్లీ షేర్ చేశాడు. నేడు ఫాదర్స్ డే సందర్భంగా నాని ఆ ఫోటోను షేర్ చేశాడు. ఇప్పటికే టాలీవుడ్ సెలెబ్రిటీలందరూ తమ తమ ఫాదర్స్‌తో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ పాత ఫోటోలను షేర్ చేశారు. ఈ క్రమంలో చిరంజీవి, రామ్ చరణ్, మంచు లక్ష్మీ, ఉపాసన, నిహారిక, సుష్మిత షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి. తాజాగా నాని సైతం ఆకట్టుకునే ఫోటోనుషేర్ చేశాడు.

అయ్యప్ప స్వామి పూజకు సంబంధించిన ఈ ఫోటోలో నాని తాత, నాని తండ్రి, జున్ను కూడా ఉన్నారు. ఇలా నాలుగు తరాలు ఒకే ఫ్రేమ్‌లో ఉండటంతో నాని ఫ్యాన్స్‌ను ఈ పిక్ తెగ ఆకట్టుకుంటోంది. నాని ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. మామూలుగా అయితే నాని నటించిన V చిత్రం రిలీజ్ కావాల్సింది. నాని నెగెటివ్ రోల్ పోషిస్తున్న ఈ చిత్రం లాక్ డౌన్ కారణంగా వాయిదా పడింది. నాని శ్యామ్ సింఘరాయ్ సినిమా కోసం సిద్దమవుతున్నాడు. ఇటీవలె HIT సినిమాతో నిర్మాతగానూ మంచి విజయాన్ని అందుకున్నాడు.


Click it and Unblock the Notifications











