twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    డాక్టర్స్ డే.. నాని స్పెషల్ విషెస్

    |

    ప్రాణం విలువ అందరికీ తెలిసిందే. అలాంటి ప్రాణాలు పోసే దేవుడే డాక్టర్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని ఉన్న పరిస్థితుల దృష్ట్యా వైద్యుల గొప్పదనం అందరికీ తెలిసి వస్తోంది. రోనా లాంటి భయంకరమైన వైరస్ బారి నుంచి ఈ సమాజాన్ని వైద్యులే కాపాడుతున్నారు. ఈ క్రమంలో వారికీ వైరస్ సోకినా సరే వారి బాధ్యతను విస్మరించడం లేదు. అందుకే నేటి ఈ వైద్యుల దినోత్సవాన్ని సమాజం ఎంతో ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటోంది. సామాన్య జనం నుంచి సెలెబ్రిటీల వరకు డాక్టర్స్ డే ప్రాధాన్యతను వివరిస్తున్నారు.

    సోషల్ మీడియాలో వైద్యుల దినోత్సవం సందర్భంగా ఎన్నో రకాల కార్టూన్స్ హల్చల్ చేస్తున్నాయి. ఈ సమాజానికి డాక్టర్స్ ఆవశ్యకతను చాటి చెప్పేలా మీమ్స్‌తో సోషల్ మీడియా మొత్తం సందడి సందడిగా మారింది. తాజాగా న్యాచురల్ స్టార్ నాని సైతం స్పందించాడు. దేవ దాస్ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్‌ను పోషించిన సంగతి తెలిసిందే. నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ డాక్టర్స్‌కు స్పెషల్ విషెస్ తెలిపాడు.

    Actor Nani Special Wishes On Doctors Day

    ఈ మేరకు నాని ఓ వీడియోను షేర్ చేశాడు. దేవదాస్ సినిమా ఫస్ట్ డే షూటింగ్ వీడియోను షేర్ చేశాడు. ఈ సీన్‌లో ఓ పిల్లాడు దేవుడికి మొక్కుతుండగా.. నాని అప్పుడే ఎంట్రీ ఇస్తుంటాడు. ఆ సీన్‌ను షేర్ చేస్తూ రీల్ డాక్టర్ అయిన నేను రియల్ డాక్టర్స్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను. డాక్టర్స్ డే, దేవదాస్ ఫస్ట్ డే షూట్ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.

    English summary
    Actor Nani Special Wishes On Doctors Day. he shared a Video that eel doctor thanking the real doctors DoctorsDay First day first shot of Devadas.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X