Don't Miss!
- News ఏపీ ఇంటెలిజెన్స్ డీజీగా కుమార్ విశ్వజిత్, విజయవాడ సీపీగా రామకృష్ణ
- Sports DC vs GT: ఆ తప్పిదంతోనే ఓడిపోయాం: శుభ్‌మన్ గిల్
- Lifestyle పెళ్లైన వ్యక్తితో డేటింగా? కాస్త ముందు..వెనకా ఆలోచించండి..లేదంటే కొంప కొల్లేరే..!
- Technology OPPO Find X7 Ultra కెమెరా రివ్యూ! అద్భుతమైన ఫీచర్లతో, బెస్ట్ కెమెరా ఫోన్!
- Automobiles 323 కి.మీ రేంజ్‌తో ప్రీమియం ఎలక్ట్రిక్ బైక్ విడుదల.. ధర తెలిస్తే కొనేందుకు ఆలోచిస్తారు..!!
- Finance Market Closing: లాభాల్లో ముగిసిన సెన్సెక్స్-నిఫ్టీ.. స్పీడు పెంచిన బుల్స్..
- Travel కేవలం రూ. 5వేలతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ఈ ప్రాంతాలను చుట్టేయొచ్చు..!
డాక్టర్స్ డే.. నాని స్పెషల్ విషెస్
ప్రాణం విలువ అందరికీ తెలిసిందే. అలాంటి ప్రాణాలు పోసే దేవుడే డాక్టర్. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్ని ఉన్న పరిస్థితుల దృష్ట్యా వైద్యుల గొప్పదనం అందరికీ తెలిసి వస్తోంది. రోనా లాంటి భయంకరమైన వైరస్ బారి నుంచి ఈ సమాజాన్ని వైద్యులే కాపాడుతున్నారు. ఈ క్రమంలో వారికీ వైరస్ సోకినా సరే వారి బాధ్యతను విస్మరించడం లేదు. అందుకే నేటి ఈ వైద్యుల దినోత్సవాన్ని సమాజం ఎంతో ఘనంగా సెలెబ్రేట్ చేసుకుంటోంది. సామాన్య జనం నుంచి సెలెబ్రిటీల వరకు డాక్టర్స్ డే ప్రాధాన్యతను వివరిస్తున్నారు.
సోషల్ మీడియాలో వైద్యుల దినోత్సవం సందర్భంగా ఎన్నో రకాల కార్టూన్స్ హల్చల్ చేస్తున్నాయి. ఈ సమాజానికి డాక్టర్స్ ఆవశ్యకతను చాటి చెప్పేలా మీమ్స్‌తో సోషల్ మీడియా మొత్తం సందడి సందడిగా మారింది. తాజాగా న్యాచురల్ స్టార్ నాని సైతం స్పందించాడు. దేవ దాస్ సినిమాలో డాక్టర్ క్యారెక్టర్‌ను పోషించిన సంగతి తెలిసిందే. నాటి సంగతులను గుర్తు చేసుకుంటూ డాక్టర్స్‌కు స్పెషల్ విషెస్ తెలిపాడు.
ఈ మేరకు నాని ఓ వీడియోను షేర్ చేశాడు. దేవదాస్ సినిమా ఫస్ట్ డే షూటింగ్ వీడియోను షేర్ చేశాడు. ఈ సీన్లో ఓ పిల్లాడు దేవుడికి మొక్కుతుండగా.. నాని అప్పుడే ఎంట్రీ ఇస్తుంటాడు. ఆ సీన్‌ను షేర్ చేస్తూ రీల్ డాక్టర్ అయిన నేను రియల్ డాక్టర్స్‌కు థ్యాంక్స్ చెబుతున్నాను. డాక్టర్స్ డే, దేవదాస్ ఫస్ట్ డే షూట్ అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది.