వాడిని వదిలేసి అమెరికా వాడితో వెళుతున్నావ్, ఏమిటీ అన్యాయం: హీరోయిన్‌పై నాని చమత్కారం

అల్లు శిరీష్ హీరోగా నటిస్తున్న 'ఏబీసీడీ' మూవీ మార్చి 17న విడుదలకు సిద్ధమైంది. సంజీవ్ రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్న ఈ చిత్రంలో రుక్సార్ థిల్లాన్ హీరోయిన్. సురేష్ బాబు సమర్పణలో బిగ్ బెన్ సినిమాస్ యశ్ రంగినేని‌తో సంయుక్తంగా మధుర ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లో మధుర శ్రీధర్ నిర్మిస్తున్నారు. మలయాళంలో సూపర్ సక్సెస్ అందుకున్న ఏబీసీడీ చిత్రాన్ని తెలుగులో అదే పేరుతో రీమేక్ చేశారు.

సోమవారం హైదరాబాద్‌లో జరిగిన 'ఎబిసిడి' ప్రీ రిలీజ్ ఈవెంటుకు నేచురల్ స్టార్ నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..ట్రైలర్ చూస్తుంటే పిల్ల జమిందార్ చిత్రం గుర్తుకొచ్చింది. నేను ఈ కార్యక్రమానికి రావడానికి కారణం మధుర శ్రీధర్ గారు. ఒక మంచి సినిమా ఎవరిదైనా సరే తన మద్దతు ఇవ్వడానికి అందరికంటే ముందు ఉంటారు. ఆయన నాకు మెసేజ్ చేసి ఈవెంటుకు రావాలని అడిగినపుడు నాకే తెలియకుండా ఒక బాధ్యతగా ఫీలయినట్లు తెలిపారు.

Actor Nani Speech at ABCD Movie Pre Release Event

శిరీష్‌లో ఒక చిన్న పిల్లాడు ఉన్నాడు... ఆ పిల్లాడిలో ఒక రేర్ క్వాలిటీ ఉంది. అది పోకుండా చూసుకోవాలి. నేను యాక్టింగ్ మొదలు పెట్టినపుడు శిరీష్ సినిమాల గురించి ఆర్టికల్స్ రాసేవాడు. సినిమా బిజినెస్, ప్రొడక్షన్ మాడ్యూల్ మీద అతడికి ఉన్న నాలెడ్జ్ చూసి నిర్మాత అవుతాడనుకున్నాను. కానీ ట్విస్ట్ ఇచ్చి యాక్టింగులో చేరిపోయాడని నాని వ్యాఖ్యానించారు.

శిరీష్ తన కెరీర్‌కు సంబంధించిన ఏబిసిడిలు ఎప్పుడో మొదలు పెట్టాడు. స్టార్ డమ్ ఏబిసిడిలు ఈ సినిమాతో మొదలవ్వాలని కోరుకుంటున్నాను. హీరోయిన్ రుక్సర్ కృష్ణ గాడిని ఆ ఊరిలో వదిలేసి ఈ అమెరికా వాడితో వెళ్లిపోతుంది. ఏమీటీ అన్యయం అమ్మీ... అంటూ నాని నవ్వులు పూయించాడు. రుక్సర్ మంచి పెర్ఫార్మర్. కృష్ణార్జున యుద్ధం ఫలితంగా రావాల్సిన బ్రేక్ రాలేదు. కానీ ఈ 'ఎబిసిడి' సినిమాతో ఆమె కెరీర్ మలుపు తిరుగుతుందని భావిస్తున్నాను అంటూ టీమ్ మొత్తానికి కంగ్రాట్స్ తెలిపారు నాని

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X