పవిత్రా లోకేష్‌తో పెళ్లయ్యాక జీవితం ఎలా ఉందంటే.. విడాకుల గురించి చెప్పి షాకిచ్చిన నరేష్!
విజయ నిర్మల కొడుకు.. సీనియర్ నటుడు నరేష్ గురించి అందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవిత్రా లోకేష్ తో ఆయన ప్రేమాయణం గురంచి మరింత ఎక్కువగా తెలుసు. ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకుని వారితో విడిపోయిన నరేష్.. ఇప్పటికే పెళ్లై భర్తతో విడాకులు తీసుకున్న పవిత్ర లోకేష్ ఇద్దరూ అఫైర్ నడిపిస్తున్నారు. ఇది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అయితే తాజాగా నరేష్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పవిత్రా లోకేష్ తో జీవితం ఎలా ఉందంటే షాకింగ్ కామెంట్లు చేశారు. విడాకుల పర్సంటేజీల గురించి చెప్పుకొచ్చారు. అసలు ఆయన ఎందుకు ఆ లెక్కలు చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం.
ముఖ్యంగా నరేష్, పవిత్రా లోకేష్ లు అన్ అఫీషియల్ గా పెళ్లి చేసుకున్నప్పిటికీ.. దాన్ని అధికారికంగా ప్రకటించలేరు. అందుకు ప్రధాన కారణం నరేష్ మూడో భార్య రమ్యా రఘుపతితో కలిసి ఆయన ఇంకా విడాకులు తీసుకోకపోవడమే. ఇవన్నీ ఎలా ఉన్నా వీరిద్దరూ ఇప్పుడు కలిసే ఉంటున్నారు. ముఖ్యంగా లేటు వయస్సులో వీరిద్దరి ఘాటు ప్రేమ గురించి పేపర్లు, టీవీలు, సోషల్ మీడియాలో ఎన్నో కథనాలు వచ్చాయి. వీరిద్దరూ కలిసే ఉంటున్నారని, ఇద్దరి మధ్య సంబంధం ఉందన్న విషయం దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరీ తెలుసు.

మూడు పెళ్లిళ్లు చేసుకుని నానా ఇబ్బందులు పడి.. ఒంటరిగా జీవితం గడుపుతున్న నరేష్ తోడు కోసమే నాలుగో పెళ్లి చేసుకున్నట్లు చాలా సార్లే చెప్పారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు. ముఖ్యంగా పవిత్రా లోకేష్ తో కొత్త జీవితం ఎలా ఉందని ఇంటర్వ్యూ చేసే అతను అడగ్గా.. షాకింగ్ కామెంట్లు చేశాడు. ముందుగా ఈ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా ఏవోవో లెక్కలు చెప్పారు.
ప్రశ్న అడగ్గానే.. సీ వీళ్లు చెడ్డ వాళ్లు, వాళ్లు మంచి వాళ్లు అని కాదు.. ప్రపంచంలో సగం మంది విడాకులు తీసుకుంటున్నారని చెప్పుకొచ్చారు నరేష్. అలాగే 70 నుంచి 80 శాతం మంది పెళ్లి జీవితంలో అనేక సమస్యలను ఎదరుక్కుంటున్నారని అలాంటి వాళ్లంతా వేరు అయిపోయి ఎవరి జీవితాలను వాళ్లు లీడ్ చేసుకుంటున్నారని స్పష్టం చేశారు. మంచి, చెడు అనేది పక్కన పెడితో ఇద్దరికీ ఒకరికొకరు అంటే ఇష్టం ఉండాలని అదే చాలా ముఖ్యం అని చెప్పుకొచ్చారు. అలాగే తోడు లేకుండా ఉండాలేమా అంటే 40 నుంచి 50 ఏళ్ల వయసులో ఉండడం చాలా కష్టం అని తెలిపారు.

40 ఏళ్ల తర్వాతే మనిషికి తోడు కావాలని ఈ సమయంలోనే కరెక్టుగా ఉన్న ఓ పార్టనర్ కావాలని నరేష్ వెల్లడించారు. నాకు ముందు జరిగిన పెళ్లిళ్ల వల్ల ఎలాంటి సంతోషం దక్కలేదని.. అందుకే తాను విడాకులు తీసుకుంటున్నట్లు వివరించారు. తన వ్యక్తిగత జీవితం బాలేకపోవడం వల్లే తాను ఓ డెసీషన్ తీసుకున్నానని.. దాని వల్ల చాలా కాంట్రవర్సీలు కూడా అయ్యాయని వెల్లడించారు. తాను సినిమాలు చేయడం వల్ల అలా జరిగిందని.. కానీ ప్రస్తుతం పవిత్రతో చాలా సంతోషంగా ఉన్నానని చెప్పుకొచ్చారు.
మేమిద్దరం చాలా ప్రశాంతంగా, మిగిలిన జీవితాన్ని అంతా కలిసే జీవించాలని అనుకున్నాం అందుకే ఈ డిసీషన్ తీసుకున్నామంటూ నరేష్ వివరించారు. ఇప్పుడు తామిద్దరం చాలా సంతోషంగా గడుపుతున్నాం అంటూ తన పర్సనల్ లైఫ్ గురించి మరోసారి క్లారిటీ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











