బాలయ్యను ముద్దు పెట్టుకోవాలి అనిపించింది.. యంగ్ హీరో షాకింగ్ కామెంట్స్
నందమూరి బాలకృష్ణ అంటే ప్రస్తుత కాలంలో అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటారు. జై బాలయ్య అనే నినాదం ఎంతగా వైరల్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక బాలయ్య బాబు కూడా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా సినిమాలను చేసేందుకు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అయితే ఆయనతో ఎలాంటి వారు పని చేసినా కూడా చాలా స్నేహంగా మారిపోతూ ఉంటారు. రీసెంట్ గా ఒక యువ నటుడు కూడా బాలయ్య మీద అభిమానంతో ఆయనను డైరెక్ట్ గా ముద్దు పెట్టుకోవాలని అనిపించింది అని కూడా చెప్పడం విశేషం. ఆ నటుడు ఎవరు అని వివరాల్లోకి వెళితే..
Recommended Video


ఆహా టాక్ షో ద్వారా
ప్రేక్షకులకు కూడా బాలయ్య గురించి ఆహా టాక్ షో అన్ స్థాపబుల్ ద్వారా చాలా ఈజీగా అర్థమైపోయింది. అందులో కొంతమంది ప్రముఖ దర్శకులతో హీరోలతో ఎంతో సరదాగా మాట్లాడి అభిమానులకు మరింత దగ్గరయ్యారు. అంతేకాకుండా రవితేజతో కూడా కొన్ని గొడవలు ఉన్నాయని విమర్శలకు కూడా ఆ టాక్ షో ద్వారానే క్లారిటీ ఇచ్చేశారు.

యువ నటుడికి నచ్చిన బాలయ్య
బాలయ్య బాబు చాలా మంచివారు అని మరొక యువ నటుడు కూడా చెబుతున్నాడు. అతను మరెవరో కాదు. ప్రస్తుతం హీరోగానే కాకుండా సపోర్టింగ్ క్యారెక్టర్డ్ తో కూడా ఎంతగానో ఆకట్టుకున్న నవీన్ చంద్ర. అందాల రాక్షసి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఈ యువ నటుడు ఇటీవల నందమూరి బాలకృష్ణతో కూడా ఒక సినిమాలో నటించడం జరిగింది.

బాలయ్య సినిమాలో పవర్ఫుల్ క్యారెక్టర్
నందమూరి బాలకృష్ణ, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చేస్తున్న సినిమాలో నవీన్ చంద్ర కూడా ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నాడు. అయితే నవీన్ ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ సినిమాలో తన పాత్ర చాలా ప్రత్యేకంగా ఉండబోతోందని అయితే అది పాజిటివ్ గానా.. నెగిటివ్ గానా అనే విషయంలో ఇప్పుడే క్లారిటీ ఇవ్వలేను అని అన్నాడు. తప్పకుండా ఆ క్యారెక్టర్ మాత్రం సినిమాలో పవర్ఫుల్గా అనిపిస్తుంది అని కూడా వివరణ ఇచ్చాడు.

షూటింగ్ లో బాలయ్య అలా..
ఇక బాలకృష్ణ తో ఉన్న సాన్నిహిత్యం గురించి మాట్లాడిన నవీన్ చంద్ర ఆయన షూటింగ్లో ఎల్లప్పుడూ కూడా చాలా ఎనర్జిటిక్ గా ఉంటారు అని అందరి తోనూ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడతారు అని కూడా వివరణ ఇచ్చారు. అంతేకాకుండా బాలయ్యబాబు కెమెరా ముందు అలా నటిస్తూ ఉంటే చాలా అద్భుతంగా ఉంటుంది అని ఆయనతో స్క్రీన్ స్పేస్ కూడా ఎంజాయ్ చేశానని అన్నారు.

ముద్దొచ్చారు అంటూ..
ఇంత వరకు అలాంటి హీరోను చూడలేదని ఆయనతో పని చేయడం ఒక మర్చిపోలేని అనుభూతి అని నవీన్ చంద్ర తెలియజేశాడు. ఇక తనతో అలా ట్రావెల్ అవుతున్న తర్వాత కొన్ని సమయాల్లో ఆయన నాకు చాలా ముద్దొచ్చారని ఒకసారి అయితే ఏకంగా ముద్దు పెట్టాలని కూడా అనిపించింది అని నవీన్ చంద్ర తెలియజేయడం విశేషం. మరి బాలయ్య సినిమాలో నవీన్ ఎలాంటి పాత్రలో కనిపిస్తాడో చూడాలి. అలాగే రానా దగ్గుబాటి సాయి పల్లవి జంటగా నటించిన విరాటపర్వం సినిమాలో కూడా నవీన్ ఒక ముఖ్యమైన పాత్రలో కనిపిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











