ఆలస్యం చేసి ఆర్థిక ఇబ్బందుల్లో పడిన నితిన్.. అలా రెండు రకాలుగా బిగ్ లాస్

టాలీవుడ్ యువ హీరో నితిన్ కెరీర్ మొదటి నుంచి కూడా చాలా డిఫరెంట్ గా కొనసాగుతోంది. లేత వయసులోనే జయం సినిమాతో బాక్సాఫీస్ రికార్డులు నమోదు చేసిన నితిన్ కెరీర్ లో సక్సెస్ రేట్ చాలా తక్కువే. అయినప్పటికీ తన మార్కెట్ ని మాత్రం ఎప్పటికప్పుడు బ్యాలెన్స్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇక చాలా కాలం తరువాత పర్సనల్ గానే కాకుండా ప్రొఫెషనల్ గా హ్యాపీగా ఉండాలని ఒక భారీ ప్లాన్ వేసుకున్నాడు. కానీ ఆ ప్లాన్ ఫెయిల్ అయ్యింది. నితిన్ ఆలస్యానికి కరోనా తోడై ఊహించని నష్టాలను కలిగిస్తోంది.

వర్కౌట్ కాలేదు..

వర్కౌట్ కాలేదు..

నితిన్ వయసు ఇప్పుడు 37. అసలైతే ముప్పై ఏళ్లలోపే పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు. ఆ మధ్య సంబంధాలు కూడా చూశారు. కానీ వర్కౌట్ కాలేదు. సినిమాలకు సంబంధించిన రిజల్ట్ కారణంగా ఈ హీరో పెళ్లి పనులను వాయిదా వేస్తూ వచ్చాడు. ఇక మొత్తానికి 40లోకి రాకముందే పెళ్లి చేసుకొని మ్యారేజ్ లైఫ్ ని హ్యాపీగా ఎంజాయ్ చేయాలని అనుకున్నాడు.

 ఖర్చులన్ని వృధా?

ఖర్చులన్ని వృధా?

నితిన్ దుబాయ్ లో పెళ్లి చేసుకోవాలని దాదాపు మూడు నెలల ముందు నుంచే ఒక ప్లాన్ చేసుకున్న విషయం తెలిసిందే. ఎంతగానో ఖర్చు చేసి ఆల్ మోస్ట్ పెళ్లి బట్టలతో రెడీగా ఉన్న సమయంలో లాక్ డౌన్ కరోనా వైరస్ దెబ్బకు షాక్ తగిలింది. అప్పటి వరకు ఖర్చయిన డబ్బు వృధా అయ్యింది. పెళ్లి విషయమనే కాకుండా సినిమాల పరంగా కూడా నితిన్ మునుపెన్నడు చూడని ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

మూడు సినిమాలు ఒకేసారి..

మూడు సినిమాలు ఒకేసారి..

వరుస అపజయాల కారణంగా ఏడాది పాటు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన నితిన్ చివరకు భీష్మ సినిమాతో మళ్ళీ ట్రాక్ లో వచ్చాడు. వెంటనే మరో మూడు సినిమాలను ఒకేసారి సెట్స్ పైకి తెచ్చే ప్రయత్నం చేశాడు. కానీ ఇప్పుడు కరోనా వైరస్ ధాటికి ధైర్యంగా షూటింగ్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఈ ఎడాది నితిన్ రంగ్ దే సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నాడు.

ఆర్థిక నష్టాల్లో..

ఆర్థిక నష్టాల్లో..

వెంకీ అట్లూరి దర్శకత్వంలో రంగ్ దే సినిమాతో పాటు సాహసం దర్శకుడు చంద్రశేఖర్ యేలేటితో ఒక సినిమాను వీలైనంత త్వరగా ఫినిష్ చేయాలని అనుకున్నాడు. అలాగే అందాదున్ రైట్స్ కూడా దక్కించుకొని రెడీగా ఉన్నాడు. కానీ ఇప్పుడు పరిస్థితులు అర్థం కాకుండా ఉన్నాయి. మరోవైపు నిర్మాతలు ఆర్థిక నష్టాలతో సతమతమవుతున్నారు. వడ్డీలకు డబ్బులు తెచ్చి సినిమాలపైనే పెట్టారు.

Recommended Video

Rana Daggubati Engaged To Miheeka Bajaj| Tollywood Funniest Wishes
 రెమ్యునరేషన్ పై ప్రభావం

రెమ్యునరేషన్ పై ప్రభావం

ఒకవేళ సినిమాలు ఫినిష్ చేసినా మరో ఏడాది వరకు థియేటర్స్ ఓపెన్ అయ్యేలా కనిపించడం లేదు. ఓకేవేళ తెరిచినా కూడా జనాలు మునుపటి లాగా వస్తారన్న గ్యారెంటీ లేదు. ఇక ఫైనల్ గా నితిన్ రెమ్యునరేషన్ పై కొంత ప్రభావం చూపే అవకాశం లేకపోలేదు. ఓ వైపు పెళ్లి విషయంలోనే కాకుండా సినిమాల పరంగా కూడా నితిన్ ఆర్థికంగా నష్టపోయాడని రూమర్స్ వస్తున్నాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X