twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    మానవత్వాన్ని చాటిన ప్రకాశ్ రాజ్.. కరోనా సమయంలో ఏం చేశాడో తెలిస్తే షాక్

    |

    ప్రపంచవ్యాప్తంగా కరోనావైరస్ భయంకరంగా వ్యాప్తి చెందుతుండటంతో వ్యవస్థలన్నీ కుదేలవుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ వ్యాధిని అరికట్టేందుకు రంగంలోకి దిగాయి. స్వీయ గృహనిర్బంధం, జనతా కర్ఫ్యూ లాంటి కార్యక్రమాలతో వైరస్‌ను కట్టడి చేసేందుకు ప్రయత్నిస్తున్నాయి. అయితే ఇలాంటి చర్యలతో దినసరి, రోజువారీ వేతన కూలీలు, ఉద్యోగులు, తక్కువ జీతం కార్మికుల పరిస్థితి అగమ్యగోచరంలో పడింది. ఇలాంటి పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని నటుడు ప్రకాశ్ రాజ్ మానవత్వాన్ని చాటుకొన్నారు. ఆయన ఏం చేశారంటే..

    కరోనావైరస్‌తో కష్టాల్లో

    కరోనావైరస్‌తో కష్టాల్లో

    కరోనావైరస్‌తో దిగుత తరగతి జీవితాలు కష్టాల్లోపడుతున్నాయి. రోజువారీ ఆదాయం ఉంటేగానీ పూటగడవని కుటుంబాలు ఎన్నో దేశంలో ఉన్నాయి. అలాంటి వారిపై ఇలాంటి సంఘటనలు తీవ్ర ప్రభావం చూపుతాయి. కాబట్టి ఎవరో ఒకరు వారిని ఆదుకోవడానికి ముందుకు వస్తున్నారు. వారిని చూసి స్ఫూర్తి పొందిన ప్రకాశ్ రాజ్ తన ఉద్యోగులను, సిబ్బందిని అక్కున చేర్చుకొన్నారు. తాను తీసుకొన్నచర్యలను ట్విట్టర్‌లో వెల్లడించారు. మీరూ చేతనైనంత సహాయం చేయాలని సూచించారు.

    నా సిబ్బంది కోసం

    నా సిబ్బంది కోసం

    ప్రకాశ్ రాజ్ తన ట్వీట్‌లో .. జనతా కర్ఫ్యూ'తో... నా నగదు నిల్వను ఒకసారి చూసుకున్నాను. నా ఇంట్లో, నా ఫార్మ్ హౌస్ లో, నా ఫిల్మ్ ప్రొడక్షన్, ఫౌండేషన్ లో ఉద్యోగం చేసేవారికీ... నా వ్యక్తిగత సిబ్బందికి మే నెల వరకూ జీతాలు ముందుగానే చెల్లించేశాను. నేను నిర్మిస్తున్న మూడు చిత్రాలకు సంబందించి షూటింగ్ ఆగిపోయింది. ఆ ప్రొడక్షన్‌లో దినసరి వేతనం తీసుకొనే కార్మికుల గురించి ఆలోచించాను అని ప్రకాశ్ రాజ్ ట్వీట్‌లో తెలిపారు.

    షూటింగ్స్ నిలిచిపోయాయి

    కరోనా మహమ్మారితో పాటిస్తున్న సోషల్ డిస్టెన్సింగ్ మూలంగా షూటింగ్స్ నిలిచిపోయాయి. ఆ దినసరి వేతన కార్మికులకు సగం మొత్తం ఇవ్వాలని నిర్ణయించాను. ఇక్కడితో పూర్తి కాదు... నా శక్తి మేరకు చేస్తాను. మీ అందరికీ నేను చేసే విన్నపం ఒక్కటే... మీ చుట్టూ ఒకసారి చూడండి. మీ సహాయం అవసరమైనవారు ఉంటారు. వారిని ఆదుకోండి. ఒకరి జీవనాన్ని... జీవితాన్ని మీరు నిలిపే సమయం ఇది. ఒకరికి అండగా నిలవాల్సిన తరుణం ఇది అని ప్రకాశ్ రాజ్ ట్వీట్టర్‌లో స్పందించారు.

    Recommended Video

    Eureka Movie Pre Release Event Part 3
    మనమంత కలిసి జీవిద్దాం

    మనమంత కలిసి జీవిద్దాం

    జనతా కర్ఫ్యూ తర్వాత నాలో అనేక ఆలోచనలు మొదలయ్యాయి. చిన్న జీవితాలను ఆదుకోవాల్సిన అవసరం ఏర్పడిందని భావించాను. అందుకే నా వంతుగా, సామాజిక బాధ్యతగా నేను ముందుకు వచ్చాను. మనమంతా కలిసి బతుకుదాం అని ప్రకాశ్ రాజ్ ఓ సందేశాన్ని అందించారు.

    English summary
    Actor Prakash Raj shows humanity on deadly coronavirus situation. He paid advance salaries and wages to his staff in this critical situation.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X