twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    చావు నుంచి మీరే కాపాడారు.. ఇక మా బతుకులను కాపాడండి.. హీరో రాజశేఖర్ ఎమోషనల్

    |

    డైనమిక్ లేడి డైరెక్టర్ జీవిత దర్శకత్వంలో యాంగ్రీ స్టార్ రాజశేఖర్ నటించిన శేఖర్ చిత్రం రిలీజ్‌కు ముస్తాబైంది. మే 20వ తేదీన రిలీజ్ అవుతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ కార్యక్రమాల్లో భాగంగా హైదరాబాద్‌లో ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈ వేడుకలో ప్రముఖ దర్శకులు సుకుమార్, విజయ్ భాస్కర్, ప్రశాంత్ వర్మ, హీరో రాజ్ తరుణ్, చిత్రంలో నటించిన నటీనటులందరూ పాల్గొన్నారు. ఈ సందర్బంగా రాజశేఖర్ మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. రాజశేఖర్ మాట్లాడిన విషయాలు ఆయన మాటల్లోనే..

    మృత్యువు అంచుల వరకు

    మృత్యువు అంచుల వరకు

    కరోనా సమయంలో నేను మృత్యువు అంచుల వరకు వెళ్లివచ్చాను. మీ అందరి దీవెనలు, ప్రార్థనల వల్ల నేను మళ్లీ మీ ముందు ఇలా ఉన్నాను. నన్ను మీరు అలా బతికించారు. మీ అందర్ని కోరుకొనేది ఏమిటంటే.. మీ అందరూ ఈ సినిమాను చూసి మా బతుకులను కూడా బతికించండి. నన్ను ఎవరైనా కలిస్తే.. మా అమ్మ, నాన్న మీకు ఫ్యాన్స్ అని చెప్పి ఫోటోలు దిగుతారు. అలాంటి ఫ్యాన్స్ కూడా మా సినిమాను థియేటర్‌కు వెళ్లి చూడండి అని రాజశేఖర్ అన్నారు.

    సినిమాను బతికించండి

    సినిమాను బతికించండి

    ప్రేక్షకులందరూ శేఖర్ సినిమాను థియేటర్‌లో చూడండి. ఆ తర్వాత ఓటీటీలో చూడండి. ప్రేక్షకులందరూ సినిమాను థియేటర్‌లో చూస్తే ఫిలిం ఇండస్ట్రీ బాగుపడుతుంది. మీరంతా సినిమా పరిశ్రమ అభివృద్ధికి తోడ్పాటు అందించండి. థియేటర్‌లో సినిమా చూడటం ద్వారా సినిమా బతుకుతుంది అని రాజశేఖర్ అన్నారు.

    జీవిత సంకల్పమే శేఖర్ సినిమా

    జీవిత సంకల్పమే శేఖర్ సినిమా

    మలయాళంలో జోసెఫ్ సినిమాను చూసి ఈ సినిమా చేయాలని కోరుకొన్నాను. ఈ సినిమా తీయాలనే జీవిత సంకల్పం గొప్పది. ఇంటి పనులు, కుటుంబ వ్యవహారాలు చూసుకొంటూనే శేఖర్ సినిమాను డైరెక్ట్ చేసింది. శేఖర్ సినిమా మీ ముందుకు వస్తుందంటే ఆ క్రెడిట్ జీవితదే. మేము పడిన కష్టం కంటే జీవిత పడిన కష్టమే ఎక్కువ. ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో నా కూతుల్లిద్దరు తల్లికి సహకరించడం చాలా ఆనందంగా ఉంది అని రాజశేఖర్ అన్నారు.

    అనూప్ రూబెన్ ప్రాణం పోశారు

    అనూప్ రూబెన్ ప్రాణం పోశారు

    శేఖర్ సినిమాకు సంగీత దర్శకుడు అనూప్ రూబెన్ ప్రాణం పోశారు. ఈ సినిమాకు అందించిన పాటలు, బ్యాక్ గ్రౌండ్ స్కోరు కారణంగానే ఓ లైఫ్ వచ్చింది. అందుకు ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ సినిమాలోని పాటలు అందర్నీ ఆకట్టుకొంటున్నాయి. ఇది చక్కటి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని రాజశేఖర్ తెలిపారు.

    సుకుమార్, సముద్రఖనికి

    సుకుమార్, సముద్రఖనికి

    శేఖర్ ప్రీ రిలీజ్ ఫంక్షన్‌ కోసం మేము ఆహ్వానించగానే దర్శకుడు సుకుమార్ వచ్చారు. ఈ వేడుక కోసం వచ్చిన సముద్రఖని పెద్ద డైరెక్టర్. ఆయన దర్శకత్వంలో నటించాలని కోరుకొంటున్నాను. ఎప్పుడైనా అవకాశం వస్తే.. నటించాలని ఉంది అని రాజశేఖర్ అన్నారు.

    ఓల్డ్ హీరో పక్కన యంగ్ హీరోయిన్లు అంటూ

    ఓల్డ్ హీరో పక్కన యంగ్ హీరోయిన్లు అంటూ

    శేఖర్ చిత్రంలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు. సాధారణంగా వయసుపైబడిన హీరోల పక్కన నటించడానికి యువ హీరోయిన్లు ఇష్టపడరు. కానీ ఇద్దరు హీరోయిన్లు నాతో నటించడానికి ముందుకు వచ్చారు. నా పక్కన నటించడం ద్వారా నన్ను కూడా యంగ్‌గా కనిపించేలా చేశారు అని రాజశేఖర్ అనగానే.. వేదిక వద్ద ఉన్నవాళ్లంతా నవ్వుల్లో మునిగిపోయారు.

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు, సాంకేతిక నిపుణులు

    నటీనటులు: రాజశేఖర్, శివాత్మిక, ఆత్మీయ రాజన్, ముస్కాన్ కుబ్‌చందాని, అభినవ్ గోమటం, కన్నడ కిశోర్, సమీర్, భరణి, రవి వర్మ, శ్రవణ్ రాఘవేంద్ర తదితరులు
    స్క్రీన్ ప్లే, డైరెక్టర్: జీవిత రాజశేఖర్
    నిర్మాతలు: బీరం సుధాకర్ రెడ్డి, శివానీ రాజశేఖర్, శివాత్మిక రాజశేఖర్, బొగ్గాం వెంకట శ్రీనివాస్
    మ్యూజిక్: అనూప్ రూబెన్
    డీవోపిఫ మల్లికార్జున్ నారగాని
    రచన: లక్ష్మీ భూపాల
    ఆర్ట్: సంపత్
    పీఆర్‌వో: బీయాండ్ మీడియా
    రిలీజ్ డేట్: 2022-05-20

    English summary
    Hero Doctor Rajashekar' Shekar movie pre release event held in Hyderabad. In this occassion, He made emotional speech in this function. He asked audience to save industry by watching movie in Theatre.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X