డార్లింగ్.. అన్యాయం చేసి వెళ్లిపోయావు.. భోరుమని ఏడ్చిన రాజేంద్ర ప్రసాద్

రవి అస్తమించని సంగీత సామ్రాజ్యంలో తెలుగు పాటకు గొప్ప గౌరవం, తరతరాల గాయకులకు స్పూర్తిగా నిలిచిన దిగ్గజం ఎస్పీ బాలసుబ్రమణ్యం ఇకలేరనే వార్త గుండెలు పగిలేలా చేసింది. మన మాటగా, పాటగా ఎన్నో ఏళ్లుగా మనతో జీవిత ప్రయాణం చేసిన బాలు మరణవార్తతో అందరూ విషాదంలో మునిగిపోయారు. ఆయనతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ దు:ఖంలో మునిగిపోయారు. బాలు లేరన్న విషయంతో కలత చెందిన రాజేంద్ర ప్రసాద్ ఆయనతో అనుబంధాన్ని గుర్తు చేసుకొంటూ రోదిస్తూ..

లేడిస్ టైలర్ సినిమా తర్వాత

లేడిస్ టైలర్ సినిమా తర్వాత


నా డార్లింగ్ ఎస్పీ బాలసుబ్రమణ్యం. లేడీస్ టైలర్ సినిమాలో ఇళయరాజా సంగీత దర్శకత్వంలో తొలిసారి నాకు పాటపడిన తర్వాత నాకు ఫోన్ చేసి.. పిలిచి డార్లింగ్.. ఐ లవ్ యూ అన్నావు. ఆ తర్వాత వందల పాటలు పాడారు. అలాంటి మీరు.. ఇలా అన్యాయం చేస్తావా డార్లింగ్.. ఘంటసాల గారే తొందరగా వెళ్లిపోయి గంధర్వుడిగా మారారు. మీరు కూడా గంధర్వుల్లో కలిసిపోయారా? ఇది చాలా అన్యాయం అంటూ నటుడు డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు.

వంద రకాల పాటలు.. వంద రకాలుగా

వంద రకాల పాటలు.. వంద రకాలుగా


మీ కెరీర్‌లో ఎంతో మంది హీరోలకు పాటలు పాడారు. కానీ హీరో రాజేంద్రప్రసాద్‌కు వందల పాటలు పాడారు. వందల రకాల పాటలు పాడారు. ఉదాహరణకు మనిషి జీవితంలో పెళ్లి, చావు ప్రధానం. పెళ్లికి సంబంధించి పెళ్లిపుస్తకం చిత్రంలో శ్రీరస్తు, శుభమస్తు అంటూ పాట పాడారు. ఎవరైనా పెళ్లి చేసుకొంటే ఆ పాటను పెట్టుకోవాల్సిందే. అలాగే ఓ మనిషి వెళ్లిపోతే ఒక్కడే పుట్టడం..ఒక్కడే పోవడం.. మధ్యలో ఈ నాటకం విధిరాత అంటూ ఆ నలుగురు చిత్రంలో పాటపాడి నా జీవితానికి, కెరీర్‌కు అర్థం కల్పించారు అని భావోద్వేగానికి గురయ్యారు.

అన్యాయం చేసి ఎలా వెళ్లిపోతావు

అన్యాయం చేసి ఎలా వెళ్లిపోతావు


ఎన్నో గొప్ప పాటలు పాడి మాతో విడదీయలేని బంధాన్ని వేసుకొని ఎలా వెళ్లిపోతారు. ఇది చాలా అన్యాయం. నాతోపాటు జంధ్యాల, బాపు, జయకృష్ణ, కమల్ హాసన్‌గారితో మన అనుబంధం మాటల్లో చెప్పలేను. మీరు పాటలను గుర్తు చేసుకొంటూ పోతే నా జీవిత చివరి అంకం వస్తుంది అని రాజేంద్ర ప్రసాద్ పొంగుకొస్తున్న దు:ఖాన్ని ఆపుకొంటూ మాట్లాడారు.

Recommended Video

Rajinikanth,Pawan Kalyan,K viswanath Expresses Their Condolences For SPB
డార్లింగ్.. దిస్ ఈజ్ నాట్ గుడ్ ..

డార్లింగ్.. దిస్ ఈజ్ నాట్ గుడ్ ..

మీతో ఉన్న అనుబంధం, మీతో గడిపిన క్షణాలు ఎలా మరిచిపోవాలి. డార్లింగ్ మీరు నాకు చాలా అన్యాయం చేశారు. ప్లీజ్ దిస్ ఈజ్ నాట్ గుడ్.. దిస్ ఈజ్ నాట్ గుడ్.. మీరు నన్ను వదిలి వెళ్లడం న్యాయం కాదు అంటూ రాజేంద్ర ప్రసాద్ భోరున విలపించారు. రాజేంద్ర ప్రసాద్ విడుదల చేసిన ఆ వీడియో నెటిజన్లను సైతం కంటతడి పెట్టించేలా ఉన్నది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X