Rajendra Prasad 65ఏళ్ల వయసులో ఆ హీరోయిన్​తో ప్రేమలో పడ్డ రాజేంద్ర ప్రసాద్.. ఇప్పుడిదే హాట్ టాపిక్​!

టాలీవుడ్​ హాస్య నట కిరీటి రాజేంద్రప్రసాద్‌ గురించి ఎంత చెప్పిన తక్కువే అవుతుంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి.. క్యారెక్టర్ ఆర్టిస్ట్​గా, హీరోగా, ఇతర కీలక పాత్రల్లో ఎన్నోచిత్రాల్లో నటించి తెలుగువారి మదిలో సుస్థిర స్థానాన్ని సంపాదించుకున్నారు‌. ప్రస్తుతం ఆయన ఓ వైపు ఇతర స్టార్ హీరోల చిత్రాల్లో కీ రోల్స్​ చేస్తూనే మరోవైపు లీడ్​ రోల్స్​లో సినిమాలు చేస్తూ కెరీర్​లో ముందుకెళ్తున్నారు.

అయితే ఇప్పుడాయన 65 ఏళ్ల వయసులో ఓ హీరోయిన్​తో ప్రేమలో పడ్డారని బయట వార్తలు వస్తున్నాయి ఈ విషయం విని చాలా మంది సినీ ప్రేక్షకులు షాక్ అవుతున్నారు. ఇంతకీ ఆయన ప్రేమ కథ ఏంటి? ఎవరితో ప్రేమలో పడ్డారు? అసలు ఇందులో నిజమెంత? వంటి విషయాలను తెలుసుకుందాం..

Actor Rajendra Prasad Love With Senior Heroine At 65 Age Full Details Here

టాలీవుడ్ సీనియర్ హీరో రాజేంద్ర ప్రసాద్.. ప్రతి తెలుగు ప్రేక్షకుడికి తెలిసిన పేరే. ఎందుకంటే నాలుగు దశాబ్దాలుగా వెండితెరపై తన నటనతో అలరిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం సపోర్టింగ్ రోల్స్​తో పాటు అప్పుడప్పుడు ప్రధాన పాత్రల్లో పలు సినిమాలను చేస్తున్నారు. ఆ మధ్య ఓటీటీలోకి కూడా అడుగుపెట్టేశారు. సేనాపతి, కృష్ణరామ సహా పలు ఓటీటీ కంటెంట్​తోనూ ఆడియెన్స్​ను మెప్పించారు.

అయితే ఇప్పుడాయన 65 ఏళ్ల వయసులో ప్రేమలో పడ్డారని వార్తలు వస్తున్నాయి. అయితే ఇది రియల్ లైఫ్​లో కాదండోయ్​. ఇది ఆయన నటించబోయే కొత్త సినిమా పేరు. ఈ చిత్రానికి లవ్@65 అనే టైటిల్​ను ఖరారు చేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలోని ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మించబోతోంది. వాళ్లే ఈ సినిమాను ఓ పోస్టర్​తో సోషల్ మీడియా వేదికగా అఫీషియల్ అనౌన్స్​మెంట్ చేశారు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్​తో పాటు మరో ప్రధాన పాత్రలో అలనాటి హీరోయిన్ జయప్రద నటించబోతుండటం విశేషం.

ఈ సినిమా స్టోరీ మొత్తం వీరిద్దరి ప్రేమ చుట్టూనే తిరగనుందని సమాచారం అందింది. ఇంకా ఈ చిత్రంలో వీరితో పాటు కార్తీక్ రాజు, సునీల్, అజయ్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారట. అనూప్ రూబెన్స్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైపోయింది. ఈ క్రమంలోనే నేడు ఫస్ట్ లుక్​ను విడుదల చేశారు మేకర్స్. ఈ సినిమాకు వి ఎన్ ఆదిత్య దర్శకత్వం వహిస్తున్నారు. ఈయన మనసంతా నువ్వే, నేనున్నాను, ఆట వంటి పలు సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకులకు అందించారు. ఈ మూడు చిత్రాలు లవ్ స్టోరీసే కావడం విశేషం. ఇవి ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. ఇప్పుడు లవ్@65 కూడా ప్రేమ కథతోనే రానుంది. త్వరలోనే ఈ మూవీ రిలీజ్​ డేట్​పై ప్రకటన చేయనున్నారు. మరి ఈ చిత్రం ఎంత వరకు ఆకట్టుకుంటుందో చూడాలి..

ఇకపోతే రాజేంద్రప్రసాద్ ఈ లవ్@65తో పాటు మరో రెండు చిత్రాల్లో నటిస్తున్నారు. షష్టిపూర్తి, లగ్గం అనే సినిమాలు చేస్తున్నారు. ఇవి కూడా షూటింగ్​లు జరుపుకుంటున్నాయి. షష్టిపూర్తి సినిమాలో రాజేంద్రప్రసాద్​కు భార్య పాత్రలో అలనాటి నటి అర్చన నటిస్తున్నారు. గతంలో తెరపై వీరిద్దరిది మంచి జోడీ. చూడాలి మరి ఈ చిత్రాలు ఎప్పుడు వస్తాయో..

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X