Don't Miss!
- News జపాన్ను వణికించిన భూకంపం
- Lifestyle 56 ఏళ్లుగా ఎవరికీ కనిపించకుండా ఇంట్లోనే దాక్కున్న ఓ రహస్య వ్యక్తి... ఆడవాళ్లంటే వింత భయం..!
- Sports 89 రన్స్ కాపాడుకోవాలంటే..ఆ అద్భుతం జరగాలి!- గిల్
- Automobiles త్వరలో మేడ్ ఇన్ ఇండియా బుల్లెట్ ట్రైన్స్.. ఇక ప్రపంచ దేశాలన్నీ భారత్ వైపు చూడాల్సిందే.!!
- Travel సిక్కింలోని యుమ్తంగ్ వ్యాలీ వేసవిలో సందర్శనకు ఉత్తమం..
- Technology iPhone 16 Pro కెమెరా ఫీచర్లు లీక్! కొత్తగా Anti-Reflective టెక్నాలజీ రానుంది
- Finance ఆ కంపెనీ కొనే రేసులో టాటాలు, అంబానీ, రాధాకిషన్ దమానీ..!! పూర్తి వివరాలు..
మరో క్రాక్ లాంటి సినిమాతో సిద్దమవుతున్న మాస్ రాజా.. న్యూ టైటిల్ ఫిక్స్
మాస్ మహారాజ్ రవితేజ గ్యాప్ లేకుండా వరుసగా డిఫరెంట్ సినిమాలను లైన్ లో పెడుతున్నాడు. ఒక వైపు అపజయాలు ఎదురైనప్పటికి ఆఫర్స్ విషయంలో మాత్రం మాస్ రాజా లక్కు మాత్రం మారలేదు. ఇక ఫైనల్ గా రాక్షసుడు వంటి సినిమాతో మంచి హిట్ కొట్టిన దర్శకుడు రమేష్ వర్మతో ఒక సినిమాను స్టార్ట్ చేయడానికి రెడీ అయ్యాడు. యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ సినిమాకు ఖిలాడి అనే టైటిల్ సెట్ చేశారు.
రవితేజ బ్లాక్ డ్రెస్ లో స్టిల్ ఇచ్చిన ఫస్ట్ లుక్ ని కూడా రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ మాస్ రాజా అభిమానులకు మంచి కిక్కిచ్చిందనే చెప్పాలి. గతంలో ఎప్పుడు లేని విధంగా ఈ సినిమాలో మాస్ రాజా రెండు విభిన్నమైన పాత్రలలో మెప్పించబోతున్నట్లు తెలుస్తోంది. విదేశాల్లో భారీ యాక్షన్ సీన్స్ కూడా ప్లాన్ చేసుకున్నారట. రవితేజ కెరీర్ లో అత్యదిక బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమాల్లో ఇది కూడా ఒకటని టాక్ వస్తోంది.
సత్యనారాయణ కోనేరు నిర్మిస్తున్న ఈ చిత్రంలో రవితేజ ఫిట్నెస్ తో కూడా చాలా కొత్తగా ఆకట్టుకొనున్నారు. ఇక హీరోయిన్స్ గా 2018 మిస్ ఇండియా విన్నర్ మీనాక్షి చౌదరి అలాగే మరో నార్త్ బ్యూటీ డింపుల్ హాయతి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు. ఈ బ్యూటీ వరుణ్ తేజ్ గద్దలకొండ గణేష్ సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ లో మెప్పించిన విషయం తెలిసిందే. బాలీవుడ్ ప్రొడక్షన్ హౌస్ పెన్ స్టూడియోస్, హవిష్ ప్రొడక్షన్ లో రూపొందనున్న ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించనున్నారు.