షూటింగ్‌లో చెంప పగలగొట్టిన బాలయ్య.. ఆ తరువాత ఎవడు రమ్మన్నాడు అంటూ..
టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల్లో ఒకరైన బాలకృష్ణలో కోపం ఎంత ఉంటుందో అంతకంటే ఎక్కువగా ప్రేమ ఉంటుందని చాలా మంది పాజిటివ్ గా కామెంట్స్ చేస్తుంటారు. కొన్నిసార్లు ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ వెంటనే కూల్ అయిపోతారని తోటి నటీనటులు కూడా ఇంటర్వ్యూలలో వివరిస్తుంటారు. ఇక ఇటీవల క్యారెక్టర్ ఆర్టిస్ట్ సమీర్ కూడా బాలకృష్ణతో ఉన్న అనుబంధం గురించి చెప్పారు. ఒకరోజు ఆయన చెంప మీద గట్టిగా కొట్టేశారని కూడా చెప్పాడు.

ఆయనదొక డిఫరెంట్ స్టైల్
నందమూరి బాలకృష్ణ ఎలాంటి సినిమా చేసినా కూడా అభిమానుల్లో ఒక జోష్ నింపుతుంది. మాస్ పాత్రల్లో అయినా క్లాస్ పాత్రల్లో అయినా ఆడియెన్స్ కు నచ్చే విధంగా సినిమాలు చేయడంలో ఆయనదొక డిఫరెంట్ స్టైల్. ఇక షూటింగ్ గ్యాప్ లో తోటి నటీనటులతో ఎంతో సరదగా ఉంటారు.

ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ చేశారంటే..
షూటింగ్ కు ఉదయాన్నే వచ్చి అందరిని అలెర్ట్ చేస్తుంటారు. దర్శకుడు చెప్పిన సమయం కంటే కూడా గంట ముందే రెడీగా ఉండడం ఆయనకు అలవాటు అని చెబుతుంటారు. ఒకసారి స్క్రిప్ట్ ఫైనల్ చేశారు అంటే దర్శకుల మాటకు ఎంతగానో వాల్యూ ఇస్తారని పూరి జగన్నాథ్ కూడా పలు ఇంటర్వ్యూలలో చెప్పారు.

బాలకృష్ణతో ఉన్న సాన్నిహిత్యంపై సమీర్
ఇక టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ మోస్ట్ క్యారెక్టర్ ఆరిస్టుల్లో ఒకరైన సమీర్ కూడా బాలకృష్ణతో ఉన్న సాన్నిహిత్యం గురించి చాలా బాగా వివరణ ఇచ్చాడు. ఎలాంటి సమయంలో అయినా ఫ్రెండ్లిగా ఉంటారని ఆయనకు నచ్చితే షూటింగ్ లేకపోయినా కూడా ఇంటికి పిలిచి సరదాగా టైమ్ స్పెండ్ చేస్తుంటారని చెప్పాడు.

షూటింగ్ లో చెంప మీద కొట్టేశారు
అయితే ఒకనొక సమయంలో బాలకృష్ణ తన చెంప మీద కొట్టాడు అని సమీర్ ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు. లెజెండ్ సినిమాలో ఆయనతో కలిసి నటించేటప్పుడు చెంప పై కొట్టే సన్నివేశంలో నిజంగానే కొట్టారని, కొట్టిన తరువాత కూడా అలానే సీన్ కంటిన్యూ చేసినట్లు చెప్పాడు.

ముందుకు ఎవడు రమ్మన్నాడు?
ఆ సీన్ రెండు మూడు సార్లు చేయాల్సి వచ్చింది..మొదటిసారి నార్మల్ గానే అన్నారు. కానీ ఆ తరువాత నేను కొంచెం ముందుకు వెళ్లి నిలబడడంతో ఆయన చేయి నిజంగానే తగిలింది. ఉంగరాలున్న చేయి కావడంతో మొహం మీద దెబ్బ గట్టిగానే తగిలింది. ఆ తరువాత నేనే ఒక అడుగు ముందుకి వేయడంతో ఆయన ముందుకు ఎవడు రమ్మన్నాడు అంటూ సరదాగా కామెంట్ చేశారు. చాలా ఫ్రెండ్లిగా ఉండే వ్యక్తి అంటూ.. సమీర్ బాలయ్య గురించి వివరణ ఇచ్చారు.


Click it and Unblock the Notifications











