Sharwanand Marriage: శర్వా నిశ్చితార్థం డేట్ ఫిక్స్.. పెళ్లి అప్పుడే.. అమ్మాయి బ్యాగ్రౌండ్ సాలీడ్!
తెలుగు చిత్ర పరిశ్రమలో మంచి హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు అందుకున్న శర్వానంద్ మొత్తానికి పెళ్లి పీటలు ఎక్కబోతున్నట్లుగా తెలుస్తోంది. గత కొన్నేళ్లుగా ఈ హీరో కూడా పెళ్లికి సంబంధించిన వార్తలతో సోషల్ మీడియాలో కూడా హాట్ టాపిక్ గా మారుతున్నాడు. ఇక ఇప్పుడు పెద్దలు కుదిర్చిన వివాహంతో అతను ఒక ఇంటివాడు కాబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇక అతనికి పెళ్లి నిశ్చితార్థం డేట్ తో పాటు పెళ్లి సమయం కూడా దాదాపు ఫిక్స్ అయిపోయినట్లుగా తెలుస్తోంది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..

మంచి హీరోగా గుర్తింపు
టాలీవుడ్ లో ఫీల్ గుడ్ హీరోగా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్న శర్వానంద్ అంటే అందరికీ ఇష్టమే. ఇండస్ట్రీలో కూడా అతను దాదాపు అందరూ హీరోలతోనూ కూడా చాలా స్నేహంగా ఉంటాడు. ఎక్కువగా వివాదాల జోలికి వెళ్లకుండా తన పని తాను చేసుకుంటూ సైలెంట్ గా వెళుతూ ఉంటాడు. మెగా ఫ్యామిలీతో వారికి మంచి అనుబంధం ఉన్న విషయం తెలిసిందే.

స్టార్స్ తో ఫ్రెండ్షిప్
హీరో శర్వానంద్ గమ్యం, శతమానంభవతి, మహానుబావుడి, రన్ రాజా రన్ ఎక్స్ ప్రెస్ రాజా వంటి సినిమాలతో స్టార్ హీరోగా క్రేజ్ అందుకున్నాడు. అతని సినిమాలను ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంతగానో ఇష్టపడుతూ ఉంటాడు. ఇక శర్వానంద్ కు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలు కూడా చాలా మంచి స్నేహితులు ముఖ్యంగా రామ్ చరణ్ తో అతనికి మంచి ఫ్రెండ్షిప్ ఉంది. మెగాస్టార్ చిరంజీవి కూడా శర్వానంద్ ను ఎంతగానో లైక్ చేస్తూ ఉంటారు.

పెళ్లిపై శర్వానంద్ కామెంట్
అయితే ఇటీవల కాలంలో శర్వాకు సంబంధించిన పెళ్లి వార్తలు చాలానే వైరల్ అయ్యాయి. ముఖ్యంగా అతను మొదట ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్లుగా టాక్ వచ్చింది. అయితే ఆ మధ్య ఇంటర్వ్యూలలో మాత్రం ఇప్పట్లో పెళ్లి చేసుకోను అని తనకంటే ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకున్న తర్వాతనే చేసుకుంటాను అని సరదాగా వివరణ కూడా ఇచ్చాడు.

నిశ్చితార్థం డేట్ ఫిక్స్
అయితే శర్వా మొత్తానికి పెద్దలు కుదిర్చిన వివాహం చేసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఐటి ఇండస్ట్రీకి చెందిన ఒక సాఫ్ట్ వేర్ అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్లు సమాచారం. వారికి సంబంధించిన నిశ్చితార్థం డేట్ కూడా ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. జనవరి 26వ తేదీన కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి నిశ్చితార్థం జరగనున్నట్లు సమాచారం.

పెళ్లి ఎప్పుడంటే
ఇక శర్వానంద్ పెళ్లి ఎప్పుడు జరుగుతుంది అనే విషయంలో కూడా నిశ్చితార్థం రోజు ఒక నిర్ణయానికి రాబోతున్నారు. ముందస్తు ప్లాన్ ప్రకారం వేసవిలో మంచి ముహూర్తం చూసి శర్వానంద్ పెళ్లి చేసుకోవడానికి ప్రణాళికలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలోనే కుటుంబ సభ్యులు ప్లాన్ చేస్తున్నట్లు కూడా తెలుస్తోంది. కేవలం కొద్దిమంది కుటుంబ సభ్యులు చాలా క్లోజ్ ఫ్రెండ్స్ అయినటువంటి స్నేహితులు మాత్రమే ఆ వేడుకల్లో పాల్గొనే అవకాశం ఉందట.

పొలిటికల్ బ్యాగ్రౌండ్
ఇక శర్వానంద్ కు కాబోయే భార్య గురించి ప్రస్తుతం అనేక రకాల వార్తలో అయితే వైరల్ అవుతున్నాయి. అమెరికాలో సాఫ్ట్ వెర్ ఇంజనీరింగ్ వర్క్ చేస్తోంది అని టాక్ వస్తోంది. అయితే ఆమెకు పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ కూడా ఉన్నట్లు సమాచారం. తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత బొజ్జల రామకృష్ణారెడ్డి కుటుంబానికి చెందిన వారి అమ్మాయిని శర్వానంద్ పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం.


Click it and Unblock the Notifications











