పేదరికంతో కష్టపడ్డాం.. పండుగ వస్తే మా అమ్మ అలా చేసేది.. కంటతడి పెట్టుకొన్న యాక్టర్ శివాజీ
బిగ్‌బాస్ తెలుగు 7 రియాలిటీ షోలో రెండో కంటెస్టెంట్‌గా యాక్టర్ శివాజీ అడుగుపెట్టాడు. సినీ పరిశ్రమలో ఎన్నో కష్టాలు, సమస్యలను ఎదురిస్తూ అతి తక్కువ కాలంలో ఎంతో ఎత్తుకు ఎదిగిన హీరో శివాజీ. శివాజీ ఆడియో విజువల్‌ను చాలా ఎమోషనల్‌గా చూపించారు. శివాజీ ప్రోమో ప్లే తర్వాత.. నాగార్జున ఆయననకు వేదికపైకి పిలిచాడు. ఎలా ఉన్నావు అంటే.. నిన్ను ఇక్కడ చూస్తానని అనుకోలేదు అని నాగ్ అన్నాడు. ఆ తర్వాత నేను నాగ్, శివాజీ మధ్య జరిగిన సంభాషణ ఏమిటంటే?
అయితే నాకు మొదటి చెక్ ఇచ్చింది మీరే.. సీతారాముల కల్యాణం సినిమా కోసం మీరు ఇచ్చారు. నా ఫస్ట్ ఇన్నింగ్స్ మొదలైంది అన్నపూర్ణ స్టూడియోలోనే.. రెండో ఇన్సింగ్స్ కూడా అన్నపూర్ణ స్టూడియోలోనే మొదలవుతున్నది అని శివాజీ ఎమోషనల్ అయ్యాడు. దాంతో అలాగే మీ సినిమా కోసం మూడు రోజులు ఎక్కువగా పనిచేస్తే నాకు అదనంగా డబ్బులు కూడా ఇచ్చారు అని శివాజీ అంటే.. అది వైవీఎస్ చౌదరీ దయ. ఆయన ఎక్కువ రోజులు పనిచేయించుకొంటాడు.. ఆ విషయం మీకు తెలుసు కదా అని నాగ్ అన్నాడు.

శివాజీకి గేమ్ రూల్ చెబుతూ.. మీరు కన్ఫర్మ్‌డ్ కంటెస్టెంట్ కాదు.. ఇది పవర్ ఆస్త్ర. మీకు ఇది లభిస్తేనే మీరు హౌస్‌మేట్ అవుతారు. లభించకపోతే మీరు కంటెస్టెంట్ మాత్రమే అవుతారు అని చెప్పారు. ఆతర్వాత శివాజీకి తన తల్లి ఫోటోను చూపించాడు. దాంతో శివాజీ ఎమోషనల్ అయ్యారు. మా అమ్మను చూడగానే కళ్లలో నీళ్లు తిరుగుతాయి.చిన్నప్పుడు పండుగ సమయంలో కోళ్లు అమ్మి మాకు అన్ని సమకూర్చేది అని శివాజీ కల్ల నిళ్లు పెట్టుకొన్నారు.
నేను బతుకు తెరువు కోసం నేను హైదరాబాద్‌కు వచ్చే సమయంలో మా ఇంటి పరిస్థితి ఏంటో నాకు తెలిసింది. మీరు ఇచ్చిన చెక్, మాస్టర్ సినిమాలో వచ్చిన చెక్‌తో నేను స్థలం కొన్నాను. అది ఇప్పుడు మాకు చాలా విలువైన స్థలంగా ఉంది. అయితే మా అమ్మ మెడలో పసుపు తాడు ఉండేది. నేను డబ్బు సంపాదించిన తర్వాత నేను మా అమ్మకు బంగారు గొలుసు చేయించాను అని శివాజీ కంటతడి పెట్టుకొన్నాడు.
అయితే మీ సినిమాలు చూసేటప్పుడు నేను తిట్లు తింటాను. మీరు ఇప్పటికి అందంగా ఫిట్‌గా ఉంటారు. మేము మాత్రం ముందు, వెనుక పెంచేస్తున్నాం. మా అవిడ మిమ్మల్ని చూపించి తిడుతుంది అని శివాజీ అంటే.. మీ ఆవిడ పేరు చెప్పు అంటే.. ఆమె పేరు చెప్పగానే.. నేను, శివాజీ ఇలా ఉన్నాం చూడు అంటూ నాగార్జున ఆటపట్టించాడు.


Click it and Unblock the Notifications











