టక్కర్‌లో సెక్స్, బోల్డ్ కంటెంట్.. ఆ పదం వింటేనే చిరాకు.. సిద్దార్థ్ షాకింగ్ కామెంట్స్!
హీరో సిద్ధార్థ్ నటించిన తాజా చిత్రం టక్కర్. ఈ చిత్రానికి కార్తీక్ జీ క్రిష్ దర్శకత్వం వహిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, పాషన్ స్టూడియోస్‌తో కలిసి టీజీ విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో దివ్యాంశ కౌశిక్ హీరోయిన్‌గా నటిస్తున్నారు. జూన్ 9న తెలుగు, తమిళ భాషల్లో భారీస్థాయిలో ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్‌లో భాగంగా సిద్దార్థ్ మాట్లాడుతూ..

ఆ పదం వింటేనే చిరాకు..: నాకు ఇమేజ్ అంటే నచ్చదు. ఆ పదం వింటనే చిరాకు. నాకు ఇమేజ్ వద్దు. సిద్దూ ఇలానే చేయాలి. ఇలానే ఉండాలి అంటే నాకు బోరు కొడుతుంది. ప్రతీ సినిమాలో నాకు కొత్తగా చేయాలనిపిస్తుంది. ఈ సినిమాలో గానీ, ఎవరైనా కథ చెప్పేటప్పుడు బోల్డ్ సీన్లు ఉంటే నేను సినిమా చేస్తానని స్టోరి వినడం లేదు. నన్ను మీరు ఎలివేట్ చేయకపోతే నేను సినిమా చేయననే కండిషన్లు పెట్టను. కథ వింటే క్యారెక్టర్ నచ్చాలి. డైరెక్టర్ నాకు విజన్ నచ్చిందా అనేద చూస్తాను అని సిద్దార్థ్ తెలిపారు.

కాలాన్ని బట్టి మారాల్సిందే..: టక్కర్ సినిమాలో బోల్డ్ కంటెంట్ లేదు. జనరేషన్ ఫాస్ట్ అయిపోయింది. సెక్స్ వాడుకోవడం అనే పాయింట్‌పైనే నీకు నాకు డిస్కషన్ వచ్చింది. అంత డెఫినెట్‌గా ఆలోచిస్తారు. కాబట్టి కాలాన్ని బట్టి మనం కూడా మారాలి. పిల్లలు ఎలా పుడుతారో అని అడిగితే.. ఇప్పుడు కూడా బయపడే రోజులు కావు. ఏంటి సార్ ఇలా మాట్లాడితే ఎలా అనే రోజులు పోయాయి అని సిద్దార్థ్ చెప్పారు.

ఇది రీల్స్ కాలం...: ప్రస్తుత జనరేషన్ రీల్స్ జనరేషన్. గతంలో గంటలు గంటలు గ్రంథాలు చదవివితే అర్ధం కాకపోయేది. కానీ ఇప్పుడు రెండు, మూడు నిమిషాల రీల్స్ చూస్తే.. అంతా అర్ధం అవుతుంది. కాలం మారిపోయింది. కాలంతోపాటు మనం మారిపోవాలి. ఆడియెన్స్ అభిరుచికి తగినట్టు మనం మారకపోతే మనకు కష్టం అవుతుంది అని సిద్దార్థ్ అన్నారు.

ప్రపంచానికి మనమే నేర్పాం..:
టక్కర్ సినిమా టకా టక్ జరిగిపోతాయి. చాలా ఫాస్ట్‌గా స్క్రీన్ ప్లే ఉంటుంది. తెలుగు సినిమాలు, మన సినిమాల ద్వారా గ్లామర్, రొమాన్స్ ఏంటో ప్రపంచానికి మనమే నేర్పామని కొత్తగా చెప్పనక్కర్లేదు. ఆ గ్లామర్, రొమాన్స్, యంగ్ లవ్, యాక్షన్, మంచి స్క్రీన్ ప్లే, మంచి కామెడీ ఈ సినిమాలో ఉంటాయి అని పేర్కొన్నారు.
టక్కర్ యూనిక్ లవ్ స్టోరీ: టక్కర్ పూర్తి కమర్షియల్ సినిమాగా కార్తీక్ జీ క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమాలో నన్ను కార్తీక్ చాలా కొత్తగా చూపించాడు. యాక్షన్ అండ్ రొమాంటిక్ టచ్ తో ఈ లవ్ స్టోరీ నడుస్తుంది. మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ ఈ సినిమాలో యాక్షన్ సీన్స్ చేశాను. 35 రోజుల పాటు యాక్షన్ సీన్స్ తీయడం జరిగింది. ఈ సినిమాలో దివ్యాన్ష పాత్ర చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమా ఒక యూనిక్ లవ్ స్టోరీ. ఈ జనరేషన్ కి ఈ లవ్ స్టోరీ తప్పకుండా కనెక్ట్ అవుతుంది అని సిద్దార్థ్ అన్నారు.


Click it and Unblock the Notifications











