Chithha నీ సినిమా ఎవడు చూస్తాడంటూ రిలీజ్ ఆపారు..నన్ను తొక్కేసే ప్రయత్నం..కంటతడి పెట్టిన సిద్దార్థ్

యువ హీరో సిద్దార్థ్ నటించి, నిర్మించిన చిత్రం చిత్తా. ఈ సినిమాను చిన్నాగా తెలుగులో డబ్బింగ్ చిత్రంగా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు ఎస్‌యూ అరుణ్ కుమార్ దర్శకత్వం వహించారు. ీ చిత్రంలో నిమిషా సంజయన్ తదితరులు నటించారు. ఈ సినిమాకు దిబూ నినన్, విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా తమిళం, కన్నడ, మలయాళంలో సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ అయింది. చిత్తా మూవీ తెలుగు డబ్బింగ్ చిత్రం చిన్నా అక్టోబర్ 6వ తేదీన రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాకు సంబంధించిన ప్రెస్ మీట్‌లో సిద్దార్థ్ ఎమోషనల్ అయ్యారు. సిద్దార్త్ మాట్లాడుతూ..

చిన్నా సినిమాపై ఎంతో ప్రేమ, అంచనాలు పెట్టుకొన్నాను. ఈ సినిమా వాస్తవంగా సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సి ఉంది. ఈ సినిమా ప్రొడక్షన్ సమయంలో డైరెక్టర్ అరుణ్‌కు ఓ మాట చెబుతూ.. సిద్దార్థ్ కెరీర్‌లో బెస్ట్ సినిమా. సిద్దార్థ్ ఇంకా యాక్టింగ్ ఎందుకు చేస్తున్నారో.. ఇంకా యాక్టర్‌గా ఎందుకు ఉన్నాడనే ప్రశ్నలకు సమాధానంగా నిలుస్తుంది. ఈ సినిమా రిలీజ్ రోజు చెన్నైలోనే కాకుండా తెలుగులో మంచి ఆదరణ దక్కుతుందని ప్రామిస్ చేశాను అని సిద్దార్థ్ అన్నారు

Actor Siddharth broke down at Chithha movie press meet at Hyderabad

చిన్నా సినిమాపై అలాంటి అంచనాలు పెట్టుకొని నాలుగు భాషల్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకొన్నాను. 4 నెలల ముందు అన్ని భాషల్లో సెన్సార్ చేశాను. మొదటిసారి కన్నడ నేర్చుకొని డబ్బింగ్ చెప్పాను. కర్ణాటకకు వెళ్లి ప్రెస్ మీట్ పెడితే.. నీవు తమిళవాడిని గెటౌట్ అన్నారు. నేను నవ్వి బయటకు వెళ్లాను. ఆ తర్వాత చాలా మంది సారీ చెప్పారు అని సిద్దార్థ్ అన్నారు.

తెలుగులో సలార్ సినిమాతో చిన్నా సినిమాను రిలీజ్ చేయాలని అనుకొన్నాను. నేను సలార్ ఫ్యాన్‌ను. ముందు ప్రభాస్ సినిమా చూసి.. ఆ తర్వాత నా సినిమా చూసుకొంటానని అనుకొన్నాను. కానీ సలార్ రిలీజ్ వాయిదా వేశారు. ఆ డేట్‌కు తెలుగులో పది సినిమాలు రిలీజ్ చేసేందుకు ముందుకు వచ్చారు. అయితే 20 సినిమాలు రిలీజ్‌కు వస్తే.. అయినా నా సినిమాను రిలీజ్ చేయాలని అనుకొన్నాను అని సిదార్థ్ అన్నారు.

Actor Siddharth broke down at Chithha movie press meet at Hyderabad

తమిళంలో చిత్తా సినిమా చూసి.. రెడ్ జెయింట్‌కు చెందిన ఉదయనిధి స్టాలిన్ గొప్ప సినిమా అని రిలీజ్ చేశారు. మలయాళంలో గోకుల్ డిస్ట్రిబ్యూషన్ ఈ సినిమా చూసి 50 ఏళ్లలో ఇలాంటి సినిమా చూడలేదని వారు ఈ సినిమాకు రిలీజ్ చేయడానికి ముందుకు వచ్చారు. కర్ణాటకలో కేజీఎఫ్ నిర్మాతలు రిలీజ్ చేశారు అని సిద్దార్థ్ చెప్పారు.

అయితే తెలుగులో రిలీజ్ గురించి ప్రయత్నిస్తే.. తెలుగులో సిద్దార్థ్ సినిమాను ఎవరు చూస్తారు? ఎందుకు చూస్తారు అని కొందరు అన్నారు. దాంతో నేను మంచి సినిమా తీస్తే తెలుగు ప్రేక్షకులు చూస్తారని అన్నాను. ఈ సినిమా 28వ తేదీన రిలీజ్ కావాలి. సరైన థియేటర్లు లభించకపోవడం వల్ల రిలీజ్ చేయలేకపోయాను. అలాంటి పరిస్థితుల్లో ఏషియన్ సునీల్ ముందుకొచ్చి సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు అని సిద్దార్థ్ చెప్పారు.

Actor Siddharth broke down at Chithha movie press meet at Hyderabad

నేను నటించిన సినిమాపై నమ్మకం ఉంటే థియేటర్‌కు వెళ్లి చూడండి. చిన్నా సినిమా చూడమని నేను చెప్పను. నేను ఇక్కడ అడుక్కొనే స్థితిలో లేను. నేను తీసిన సినిమా నచ్చకపోతే.. చూడలేకుంటే.. ఇక ముందు తెలుగులో నా సినిమాలు రిలీజ్ చేయను. ఇక ముందు నేను ప్రెస్ మీట్ పెట్టను. నా పేరు సిద్దార్థ్. నేను చిన్నా అనే సినిమా తీశాను. ఇది నా కెరీర్‌లో బెస్ట్ సినిమా. నా గురువులు మణిరత్నం, కమల్ హాసన్ చూసి మెచ్చుకొన్నారు అని సిద్దార్థ్ చెప్పారు.

తెలుగు సినిమా పరిశ్రమలో మిమ్మల్ని తొక్కేయడానికి ఎవరైనా ప్రయత్నించారా? అనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. నేను ఎవరి కాళ్ల కింద లేను. ఒకరి కాళ్ల కింద ఉంటే తొక్కేస్తారు. నన్ను గౌరవించలేదు. నన్ను ఆదరించడం లేదని భావిస్తాను. సక్సెస్‌కు చాలా అర్ధాలు ఉంటాయి. నా గురువు నా సినిమా చూసి ఇంటికి పిలిచి గొప్ప సినిమా తీశావని అన్నాను. అంతకంటే నాకు సక్సెస్ ఏం కావాలి అని సిద్దార్థ్ చెప్పారు.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X