అభిమానుల వల్లే ఆ వ్యాధి బారినపడ్డా.. హీరో సిద్ధార్థ్ కామెంట్స్ వైరల్..

Siddharth: సీనియర్ హీరో సిద్ధార్థ్ (Siddharth) గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. అనతికాలంలోనే గుర్తింపు ఫ్యాన్ బేస్ సంపాదించుకున్నారు. అయితే.. ఆఫర్లు తగ్గిపోవడంతో ఆ ఫేమ్ అంతకంటే వేగంగా పడిపోయింది. దీంతో టాలీవుడ్ కు దూరమయ్యారు. తర్వాత కొన్ని ఏళ్లకు రీఎంట్రీ ఇచ్చిన సరైన సినిమాలు అందుకోలేకపోతున్నారు. ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా, లవర్ బాయ్ గా నటించి మెప్పించిన సిద్ధార్థ.. ఇటీవల కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్ గా మారిపోయారు. ఇష్టం వచ్చినట్లుగా కామెంట్స్ చేయడంతో వార్తల్లో నిలుస్తున్నాడు. తాజాగా ప్రేక్షకులపై కామెంట్ చేస్తూ వార్తల్లో నిలిచారు.

హీరో సిద్ధార్థ 'బాయ్స్' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. ఈ సినిమాలో లవర్ బాయ్ గా ఎంటర్టైన్ చేస్తూ.. యూత్ కు దగ్గర అయ్యారు. ఆ తర్వాత బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ ను తన ఖాతాలో వేసుకున్నారు. సిద్ధార్థ కేవలం తెలుగు సినిమాలనే కాకుండా తమిళం, హిందీ సినిమాలలో నటించి మంచి పాపులారిటీ సంపాదించుకున్నారు. ఇక 2023లో విడుదలైన 'చిన్నా' మూవీతో ఘన విజయం అందుకున్నారు. ఈ సినిమాలో తన నటనకు జాతీయ అవార్డు కూడా వరించింది.

Actor Siddharth used to experience post-traumatic stress disorder

ఇక గత ఏడాది 'మిస్ యు', 'భారతీయుడు 2' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కానీ, అనుకున్న స్థాయిలో ఆ సినిమాలు ఆడలేకపోయాయి. గతంలో పలు పలు సినిమాలలో నటించి మెప్పించిన సిద్ధార్థ.. గత ఏడాది టాలీవుడ్ బ్యూటీ అతిధి ని పెళ్లి చేసుకున్నారు. ఇండస్ట్రీలో ఎన్నో విజయాలను అందుకున్న సిద్ధార్థ తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ మీడియా కంట పడుతున్నాడు తాజాగా సినీ ప్రేక్షకులపై చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి.

హీరో సిద్దార్థ తాజాగా ఓ ఇంటర్య్వూలో మాటాడుతూ.. తనకొక అరుదైన వ్యాధి వచ్చిందని చెప్పి అందరి దృష్టిని ఆకర్షించారు. ఆ అరుదైన వ్యాధికి కారణం ప్రేక్షకులే అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఇండస్ట్రీకిలోకి నటీనటులు చాలా మంది మంచి ఫేం, ఫాలోయింగ్, గుర్తింపు రావాలని కోరుకుంటారనీ, ఇక ఒక్కసారి ఆ క్రేజ్ వచ్చాక దాన్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారని తెలిపారు. ఫ్యాన్ ఫాలోయింగ్ వల్ల తనకు కూడా పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిసార్డర్ (PTSD) అనే వ్యాధి వచ్చిందనీ, ఈ వ్యాధి నుంచి కోలుకోవడానికి తనకు 7 నుంచి 8 ఏళ్లు పట్టిందంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు సిద్ధార్థ్.

Actor Siddharth used to experience post-traumatic stress disorder

సిద్ధార్థ ఇక మాట్లాడుతూ అలాంటి స్టార్ స్టేటస్ అందుకోవడానికి తాను చాలా కష్టపడ్డాననీ, అయితే స్టార్ అయ్యాక జనాలు వచ్చి నాతో మాట్లాడితే తెగ టెన్షన్ పడేవాడిని. అలా పోస్ట్ ట్రమాటిక్ స్ట్రెస్ డిజార్డర్ (PTSD) లేకుండా జనాలతో మాట్లాడడానికి తనకి 7 నుంచి 8 సంవత్సరాలు పట్టిందన్నారు. తన ఫ్యామిలీలో ఎవరూ కూడా ఇలాంటి టెన్షన్ ని ఫీల్ కాలేదనీ, తాను మాత్రం ఆ స్టార్ డమ్ ను సరిగా ఆస్వాదించకలేకపోయానని ఫీల్ అయ్యారు. వాస్తవానికి ఈ స్టార్డమ్ అందించినందుకు థాంక్ ఫుల్ గా ఉండాలని కాదా.. అనొచ్చు. కానీ, తను మానసికంగా ఇబ్బందులు ఎదుర్కున్నానని అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం హీరో సిద్దార్థ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సిద్ధార్థ్ మాటలు విన్న నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇలాంటి అరుదైన వ్యాధులు కూడా ఉంటాయా అంటూ రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

More from Filmibeat

Read more about: aditi rao hydari siddharth
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X