Actor Sivaji: ఫ్యాన్స్‌కు శివాజీ గట్టి షాక్ .. నోట మాట రాకుండా చేస్తానని వార్నింగ్!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 కంటెస్టెంట్ గా వచ్చి అద్భుతమైన ఆట కనబర్చిన నటుడు శివాజీ గురించి తెలుగు సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. గతంలో అనేక చిత్రాలు చేసిన ఈయన హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాడు. ఆ తర్వాత సినిమాలకు దూరం అయ్యాడు. సడెన్ గా బిగ్ బాస్ షో ద్వారా ఎంట్రీ ఇచ్చి మళ్లీ ఫామ్ లోకి వచ్చాడు.

ముఖ్యంగా బిగ్ బాస్ షో నుంచి వచ్చిన తర్వాత వరుసగా సినిమాల్లో నటించేందుకు ప్లాన్ చేసుకుంటున్నాడు. బిగ్ బాస్ షోకు వెళ్లకముందే శివాజి #90s వెబ్ సిరీస్ లో నటించగా.. బిగ్ బాస్ అయిపోయాక రిలీజ్ అయి సెన్సేషన్ క్రియేట్ చేసిందీ సిరీస్. అయితే తాజాగా ఆయన అభిమానులకు మరో సర్ ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు చెప్పారు. ముఖ్యంగా తాను చేసే పనితో అభిమానుల నోట మాట రాకుండా చేస్తానంటూ వివరించారు. ఆ విశేషాలు ఏంటో మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Actor Sivaji Ready to Give A Shock Fir His Fance Check Details

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 షోకు వెళ్లిన శివాజీ... తన ఆట తీరుతో అందరికీ దగ్గరయ్యాడు. ముఖ్యంగా తెలుగు బుల్లితెర ప్రేక్షకులు అంతా ప్రేమగా శివన్నా అని పిలిచుకునేలా మంచి పేరు తెచ్చుకున్నాడు. కేవలం సినిమాల్లో నటననే అదరగొట్టకుండా.. తన క్యారెక్టర్ తో కూడా అందరినీ మెప్పించాడు. ఇలా మంచి మార్కులు కొట్టేసిన ఈయన చాలా కాలం తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు.

బిగ్ బాస్ షో తర్వాత వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రధాన పాత్రలో రాబోతున్న కూర్మ నాయకి సినిమాలో కనిపించబోతున్నట్లు గతంలోనే ప్రకటించాడు. ఈ చిత్రంలో విలన్ గా కనిపించబోతున్నట్లు చెప్పిన ఈయన.. ప్రస్తుతం మరో కొతత సినిమాకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తాజాగా శివాజీ తన ఇన్ స్టాగ్రామ్ వేధికగా ఓ పోస్ట్ చేశాడు. ఎప్పుడూ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ఈయన.. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ తో కలిసి దిగిన ఫొటోలను షేర్ చేశాడు.

కేవలం ఫొటోలు షేర్ చేయడం మాత్రమే కాకుండా ఈ విషయాన్ని కూడా రాసుకొచ్చాడు శివాజీ. అందులో "అందరూ ఆశ్చర్యపోయేందుకు రెడీగా ఉండండి.. ఎందుకంటే రాబోయేది మిమ్నల్ని మాట్లాడనీయకుండా చేస్తుంది" అంటూ చెప్పుకొచ్చాడు. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. బిగ్ బాస్ నుంచి వచ్చిన తర్వాత నుంచి శివాజీ వరుసగా కథలు వినడం.. అందులోనూ డైరెక్టర్ తో కలిసి దిగిన ఫొటోకు ఇలా రాసుకు రావడంతో వీరిద్దరి కాంబోలో సినిమా రాబోతున్నట్లు ఫిక్స్ అయ్యారు చాలా మంది.

ముఖ్యంగా కామెడీ చిత్రాలు తీయడంలో దిట్టగా పేరు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. శివాజీలోని ఫన్నీ యాంగిల్ ను వాడుకుని సూపర్ హిట్ సినిమా తీసుకు వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉందని భావిస్తున్నారు. చూడాలి మరి వీరిద్దరి కాంబోలో సినిమా వస్తుందా.. వస్తే ఎలాంటి జోనర్ లో వస్తుంది అనేది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X