twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    Sonu Sood : చిక్కుల్లో రియల్ హీరో.. 20 కోట్ల పన్నుఎగవేసినట్టు నిర్ధారణ.. ఆ కంపెనీ కొంప ముంచింది?

    |

    బాలీవుడ్ నటుడు సోనూసూద్ ఇబ్బందుల్లో పడే అవకాశాలు పెరుగుతున్నట్లు కనిపిస్తోంది. సోనూసూద్ ఇంట్లో గత మూడు రోజులుగా ఆదాయపు పన్ను శాఖ సర్వే ఆపరేషన్ జరుగుతోందన్న సంగతి తెలిసిందే. శనివారం కూడా ఐటీ టీమ్ సర్వే కొనసాగుతోంది. అయితే ఈ క్రమంలోనే ఐటీ అధికారులు సోనూ సూద్ గురించి ఒక సంచలన వార్త వెల్లడించారు. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళితే

    20 కోట్ల పన్ను ఎగవేత, .2.1 కోట్ల అక్రమ విదేశీ విరాళం

    20 కోట్ల పన్ను ఎగవేత, .2.1 కోట్ల అక్రమ విదేశీ విరాళం

    సోనూసూద్‌ కి సంబందించిన వివిధ ప్రదేశాలలో ఐటీ శాఖ జరిపిన సోదాలలో రూ .20 కోట్ల పన్ను ఎగవేత, రూ .2.1 కోట్ల అక్రమ విదేశీ విరాళం, రూ. 65 కోట్ల మోసపూరిత లావాదేవీలు, జైపూర్‌లోని ఇన్‌ఫ్రా సంస్థతో రూ .175 కోట్ల సర్క్యులర్ లావాదేవీలు జరిగాయని తేలినట్లుగా ఐటీ అధికారులు ఒక ప్రకటన జారీ చేశారు. సోనూ సూద్ 20 కోట్ల విలువైన పన్ను ఎగవేసినట్లు ఆదాయపు పన్ను శాఖ తెలిపింది. అతని ఛారిటీ ఫౌండేషన్, సోనూ సూద్ నిర్వహిస్తున్న ఒక NGO, 2.1 కోట్ల విలువైన విదేశీ విరాళాలు అక్రమంగా పొందిందని కూడా పేర్కొన్నారు. ముంబై, లక్నో, కాన్పూర్, జైపూర్, ఢిల్లీ మరియు గురుగ్రామ్‌తో సహా 28 చోట్ల ఐటీ విభాగం సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించింది.

    అలా డిపాజిట్లు

    అలా డిపాజిట్లు


    ఇప్పటివరకు వెలికితీసిన మొత్తం పన్ను ఎగవేత మొత్తం రూ. 20 కోట్లు "అని ఐటీ అధికారులు తెలిపారు. అంతే కాక సోనూసూద్ అనేక నకిలీ సంస్థల నుండి లెక్కలు చూపని డబ్బులు నకిలీ మరియు అసురక్షిత రుణాల రూపంలో డిపాజిట్ చేశారని ఐటీ అధికారులు ఆరోపిస్తున్నారు. "ఈ బోగస్ రుణాలు పెట్టుబడి పెట్టడానికి మరియు ఆస్తులను సంపాదించడానికి ఉపయోగించబడ్డాయి కూడా వెల్లడైంది. సోనూ ఛారిటీ ఫౌండేషన్ అనే ఎన్జిఓ జూలైలో నటుడు స్థాపించినట్లు ఐటీ శాఖ చెబుతోంది. కానీ ఈ NGO ఏప్రిల్ 1, 2021 నుంచి 18.94 కోట్ల విరాళం పొందింది, కానీ అప్పటి నుంచి ఇప్పటి దాకా 17 కోట్ల రూపాయలలో ఒక్క రూపాయి కూడా ఆయన ఖర్చు పెట్టలేదని అంటున్నారు.

    కేవలం 1.9 కోట్లనే ఎందుకు

    కేవలం 1.9 కోట్లనే ఎందుకు

    ఇక ఇప్పటి దాకా ఈ విరాళం నుండి, NGO 1.9 కోట్లను వివిధ సహాయక పనుల నిమిత్తం ఖర్చు చేసింది. ఆ నిధులు ఖర్చు చేసిన తర్వాత, మిగిలిన 17 కోట్లు ఇప్పటికీ బ్యాంక్ ఖాతాలో ఉన్నాయి. ఈ రోజు వరకు అవి ఉపయోగించబడ లేదని ఐటీ అధికారులు చెబుతున్నారు. క్రౌడ్‌ఫండింగ్ ప్లాట్‌ఫామ్‌లో విదేశీ దాతల నుండి ఛారిటీ ఫౌండేషన్ ద్వారా రూ 2.1 కోట్లు సేకరించబడినట్లు కూడా చెబుతుండగా అలా చేయడం అంటే ఇది FCRA (Foreign Contribution (Regulation) Act నిబంధనలను ఉల్లంఘించడమే అని అంటున్నారు.

    రియల్ ఎస్టేట్ కంపెనీలో

    రియల్ ఎస్టేట్ కంపెనీలో

    లక్నోలోని ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి చెందిన వివిధ ప్రదేశాలలో సోదాలు జరిగాయి, ఈ కంపెనీకి సోనూ సూద్‌తో సంబంధం ఉందని అంటున్నారు. సోనూసూద్ కంపెనీకి మరియు లక్నోకి చెందిన రియల్ ఎస్టేట్ సంస్థకు మధ్య ఇటీవల జరిగిన ఒప్పందం విషయంలో సోనూ సూద్ మీద ఐటీ అధికారులు కన్ను పడిందని అంటున్నారు. ఈ ఒప్పందం కారణంగానే పన్ను ఎగవేతలకి ఆరోపణలపై సర్వే ఆపరేషన్ ప్రారంభమైంది. నటుడు పెట్టుబడి పెట్టిన లక్నో బిల్డర్‌పై కూడా ఐటీ అధికారులు దాడి చేశారు. బిల్డర్‌పై రూ. 65 కోట్లకు పైగా బోగస్ ఎంట్రీలు (బ్లాక్ మనీ లాండరింగ్) ఆరోపణలు ఉన్నాయి, అయితే బిల్డర్ దగ్గర లెక్కించబడని ఆదాయం రూ .175 కోట్లకు పైగా ఉందని అంచనా వేయబడింది. సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోంది.

    ఆ కంపెనీనే ముంచిందా

    ఆ కంపెనీనే ముంచిందా

    రియల్ ఎస్టేట్ కంపెనీలో నటుడు సోనూ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్‌లో ప్రవేశించి గణనీయమైన నిధులను పెట్టుబడి పెట్టారు, ఫలితంగా పుస్తకాలలో పన్ను ఎగవేత మరియు అక్రమాలకు సంబంధించిన నేరపూరిత సాక్ష్యాలు లభించాయని ఐటీ శాఖ ఈరోజు ప్రకటనలో తెలిపింది. రియల్ ఎస్టేట్ కంపెనీ ద్వారా అనేక నకిలీ బిల్లింగ్, 65 కోట్ల విలువైన నకిలీ ఒప్పందాలు కూడా చేసినట్లు ఐటీ శాఖకు ఆధారాలు లభించాయి. అలాగే లెక్కలలోకి రనినగదు వ్యయం, లెక్కలేని జంక్ అమ్మకం మరియు డిజిటల్ డేటా నుంచి లెక్కించని నగదు లావాదేవీలకు ఆధారాలు కనుగొనబడ్డాయి. 1.8 కోట్ల నగదు మరియు 11 లాకర్లను ఐటీ శాఖ రికవరీ చేసింది. ఆదాయపు పన్ను విభాగం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతోందని అది పూర్తి అయ్యాక పూర్తి క్లారిటీ వచ్చే అవాకాశం ఉందని అంటున్నారు.

    రాజకీయం

    రాజకీయం

    కొన్ని రోజుల క్రితం, ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం సోనూసూద్‌ను పాఠశాల విద్యార్థుల కోసం మెంటర్‌షిప్ ప్రోగ్రామ్ యొక్క బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించింది. ఈ సమయంలో ఆయన ఆమ్ ఆద్మీ పార్టీలో చేరడం పై ఊహాగానాలు కూడా వచ్చాయి. రాజకీయాలకు సంబంధించి ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌తో తనకు ఎలాంటి సంబంధం లేదని సోను స్వయంగా చెప్పడంతో విషయం సద్దుమణిగింది. పంజాబ్ మరియు ఢిల్లీ ప్రభుత్వాలతో సహా సంక్షేమ పథకాలు మరియు కార్యక్రమాల కోసం సోను సూద్‌తో అనేక రాష్ట్ర ప్రభుత్వాలు చేతులు కలిపాయి. కరోనా సమయంలో విధించిన లాక్ డౌన్ సమయంలో వలస కూలీలను వారి ఇళ్లకు తీసుకెళ్లడానికి మరియు ఆర్థిక సహాయం అందించడానికి చొరవ తీసుకున్న సోను సూద్ రియల్ హీరోగా మారాడు.

    English summary
    Actor Sonu Sood involved in tax evasion of over Rs 20 crore says Income Tax department in a statement.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X