పవన్ కళ్యాణ్‌లో నచ్చే విషయం అదే.. రాజకీయాల్లోకి అలాంటి టైమ్‌లో వెళ్లారు: సుధీర్ బాబు
ఇటీవల పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా చాలా మంది స్టార్స్, అభిమానులు గతంలో ఎప్పుడు లేనంత భారీ స్థాయిలో విషెస్ అందించారు. ముఖ్యంగా టాలీవుడ్ లో ఎక్కువమంది యువ హీరోలు పవన్ కళ్యాణ్ కు విషెస్ అంధించడం ఈ సారి అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇక సుధీర్ బాబు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో పవర్ స్టార్ పై చేసిన ఒక కామెంట్ వైరల్ గా మారింది.

సుధీర్ బాబు కామెంట్
పవన్ కళ్యాణ్ అంటే సినిమా ఇండస్ట్రీలో ప్రతీ ఒక్కరికీ కూడా అభిమానమే. క్యారెక్టర్ ఆర్టిస్ట్ నుంచి ఉన్నత స్థాయి స్టార్ హీరోల వరకు పవన్ ని అభిమానించే విధానం చాలా నిజాయితీగా ఉంటుంది. ఇక ఘట్టమనేని ఫ్యామిలీకి అలాగే మెగా ఫ్యామిలీకి కూడా మంచి స్నేహ బంధం ఉంది. ఇటీవల సుధీర్ బాబు పవన్ పాలిటిక్స్ పై చిన్న కామెంట్ చేశాడు.

నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా
పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతూ.. ఆయన సినిమాల గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అందరికి తెలిసిందే. అయితే ముఖ్యంగా నాకు నచ్చే విషయం ఏమిటంటే, సాధారణంగా చాలా మంది సినీ స్టార్స్ రిటైర్మెంట్ స్టేజ్ లో రాజకోయల్లోకి వస్తారు. కానీ పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ స్థానంలో ఉండి కూడా రాజకీయాల్లోకి వెళ్లారు అని సుధీర్ అన్నారు.

అలాంటి సమయంలో వెళ్లారు..
మంచి స్టార్ డమ్ ఉన్న సమయంలోనే రాజకోయల్లోకి వెళ్లారు అంటే అక్కడే ఆయన నిజాయితీ గురించి అర్ధమవుతోంది అని సుధీర్ వివరణ ఇవ్వడం పవర్ స్టార్ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక గతంలో మహేష్ సోదరి మంజుల ఘట్టమనేని కూడా పవన్ కళ్యాణ్ పై పాజిటివ్ గా స్పందించారు. అవకాశం వస్తే మహేష్ కంటే ముందు పవన్ ని డైరెక్ట్ చేస్తానని అప్పట్లో ఆమె తన సినిమా ప్రమోషన్స్ లో చెప్పారు.
Recommended Video

మహేష్, పవన్ ట్వీట్స్ వైరల్
పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా మహేష్ , పవన్ కళ్యాణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడం సోషల్ మీడియాలో ఏ స్థాయిలో వైరల్ అయ్యిందో స్పెషల్ గా చెప్పనవసరం లేదు. మహేష్ ట్విట్టర్ లో అత్యదిక రీ ట్వీట్స్ పొందినదిగా పవన్ బర్త్ ట్వీట్ సరికొత్త సెన్సేషన్ క్రియేట్ చేసింది. మహేష్ ట్వీట్ కి పవన్ కూడా బదులిచ్చిన విధానం అభిమానులకు మంచి కిక్కిచ్చింది.


Click it and Unblock the Notifications











