అలా పథకాలను అమలు చేయడం అసాధ్యం.. చంద్రబాబు, పవన్ కల్యాణ్‌పై సుమన్ సంచలన వ్యాఖ్యలు

కలియుగ దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామిని బహుభాషా నటుడు సుమన్ దర్శించుకొన్నారు. శ్రీవారిని దర్శించుకొన్న తర్వాత ఆయన ఆలయ సన్నిధిలోని ఏర్పాట్లు, వసతులపై సంతృప్తిని వ్యక్తం చేశారు. టీటీడీ చైర్మన్ అమలు చేస్తున్న కార్యక్రమాలను ప్రశంసించారు. అలాగే ఏపీలోని ఎన్డీఏ ప్రభుత్వ పాలనపై ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. తిరుమలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు. సుమన్ చెప్పిన విషయాల వివరాల్లోకి వెళితే..

ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పాటు తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)లో అమల్లోకి వచ్చిన నూతన పాలక మండలి చేపట్టిన మార్పులు బాగున్నాయి. నూతన టీటీడీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత తీసుకొన్న నిర్ణయాలు భక్తులకు సానుకూలంగా ఉన్నాయి. ఆయన చేస్తున్న మార్పులను గమనిస్తున్నాను. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని తీసుకొన్న నిర్ణయాలు బాగున్నాయి. ఇప్పుడు భక్తులకు గదులు సులభంగా లభ్యమవుతున్నాయి అని సుమన్ అన్నారు.

Actor Suman visited Tirumala

బాలాజీ దర్శనం విషయంలో కూడా సంచలన నిర్ణయాలు తీసుకొంటున్నారు. భక్తులు గంటల తరబడి వేచి ఉండకుండా త్వరితగతిన దర్శన భాగ్యం కలుగుతున్నది. విదేశాల్లోను ఆలయ నిర్మాణాలు చేపట్టడం శుభపరిణామం. దాంతో ఎన్నారైలో కూడా హిందూ సంప్రదాయాలపై, భక్తిభావం పెంపొందే అవకాశం ఉంది అని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇక ఆయన ఉత్తరాదికి సంబంధించిన హిందీ భాషను దక్షిణాదిలో అమలు చేయాలనే వివాదంపై ఆయన స్సందించారు. హిందీ భాష అవసరమే. కానీ దానిని ప్రజల మీద బలవంతంగా రుద్దడం మంచిది కాదని అన్నారు. అలాగే తమిళ రాజకీయాల్లో దళపతి విజయ్ ఎంట్రీని స్వాగతించారు. ఆయన పాలిటిక్స్‌లో తన అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు అని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు.

ఇక ఏపీలోని తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీలతో ఏర్పడిన ప్రభుత్వంపై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ మధ్య సమతూల్యం బాగుంది. వారిద్దరి కాంబినేషన్ బాగుంది. ప్రజలు మెచ్చే విధంగా ఎన్టీయే కూటమి పాలనను అందిస్తున్నది. ఇచ్చిన హామీలను అమలు చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ఉందని ఆయన అన్నారు.

అయితే హామీలు, పథకాలన్నీ అమలు చేయాలంటే గడువు, సమయం కావాలి. అన్ని పథకాలను ఒక్కసారిగా అమలు చేయడం ఎవరి వల్లా సాధ్యం కాదు. ప్రజలకు అవసరమైన ఒక్కో పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు అమలు చేస్తున్నారు. నటుడిగా, రాజకీయ నేతగా పవన్ కల్యాణ్ తన బాధ్యతలను బ్యాలెన్స్ చేస్తూ ప్రజల కోసం పనిచేస్తున్నారు అని సుమన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

Take a Poll

సుమన్ సినిమా కెరీర్ విషయానికి వస్తే.. క్యారెక్టర్ నటుడిగా ఆయన కొనసాగుతున్నారు. తెలుగు, తమిళం, కన్నడ చిత్ర రంగాల్లో ప్రాధాన్యం ఉన్న పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మార్షల్ ఆర్ట్స్ రంగానికి కూడా సేవలు అందిస్తున్నారు.

More from Filmibeat

Read more about: suman chandrababu pawan kalyan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X