పవన్ కల్యాణ్ మూడు పెళ్లిళ్లపై షాకింగ్ కామెంట్స్.. హీరో సుమన్ ఘాటైన వ్యాఖ్యలు
Actor Suman: టాలీవుడ్ హీరో సుమన్ గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఆయన ఒకప్పుడు ఎన్నో హిట్ మూవీస్ లో నటించి టాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగారు. ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నాడు. ఆయన కేవలం తెలుగు, తమిళ్ సినిమాల్లోనే కాదు.. దేశవ్యాప్తంగా దాదాపు పది భాషలలో నటించారు. కానీ, ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేస్తూ బిజీగా మారారు. ఇక సినిమాలే కాకుండా నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ సినీ రంగం, రాజకీయాలపై తన అభిప్రాయాలను తెలుపుతూ హాట్ టాపిక్ గా మారుతూ ఉంటాడు. ఇలా పవన్ కళ్యాణ్ పై షాకింగ్ కామెంట్స్ చేసి ప్రస్తుతం వార్తల్లో నిలిచారు
సుమన్ టాలీవుడ్ హీరోగా సుపరిచితం. ఆయన దాదాపు 700 పైగా సినిమాలలో నటించారు. తెలుగులో ప్రధానంగా అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర, శ్రీరామదాసు సినిమాలో రాముని పాత్రలలో నటించి ప్రత్యేక గుర్తింపు సొంతం చేసుకున్నారు. అలాగే రజినీకాంత్ శివాజీ సినిమాలో విలన్ లో నటించి మెప్పించారు. ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలలో నటించి మెప్పించిన ఆయనకు 2021లో లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు వరించింది.ఇకపోతే సుమన్ హీరోగా కెరియర్ పీక్స్ లో ఉండగానే ఒక కేసులో జైలు పాలైన విషయం తెలిసిందే

హీరో సుమన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఏపీ పాలిటిక్స్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. వైయస్సార్ సిపి ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడుని అన్యాయంగా అరెస్టు చేశారని, ఆ విషయంపై ఏ సెలబ్రిటీ కూడా మాట్లాడలేదని, తానే రెండు రోజుల తర్వాత మాట్లాడానని చెప్పుకొచ్చారు.ఈ విషయంపై తాను ఫిలింనగర్లో ప్రెస్ మీట్ పెట్టి.. జగన్ ప్రభుత్వ చర్యలను ఖండించానని తెలిపారు. చంద్రబాబు రాజకీయ జీవితానికైనా కనీసం తన ఏజకైనా గౌరవించి తనపై చార్జి సీటు దాఖలు చేసిన తర్వాత అరెస్టు చేసి ఉంటే బాగుంటుందని డిమాండ్ చేశానన్నారు. ఆ రోజే జగన్ ప్రభుత్వాన్ని హెచ్చరించాలని, ఎన్ని రోజులు చంద్రబాబును జైల్లో పెడితే ఆయనపై సింపతి పెరుగుతుందని ఆ రోజే పేర్కొన్నానని తెలిపారు.
'వాడికి ముగ్గురు పెళ్ళాలు ఉన్నారు. వాడేం రాజకీయం చేస్తాడు. అయినా వాడికి ఏం తెలుసు' అని పవన్ కళ్యాణ్ పై జగన్ కామెంట్ చేశారని, కానీ, ఈ వ్యాఖ్యలపై ఇండస్ట్రీ నుండి ఎవరు మాట్లాడలేదన్నారు సుమన్. జగన్ వ్యాఖ్యలను వ్యతిరేకంగా మాట్లాడితే.. ఆ తర్వాత పరిణామాలు ఎలా ఉంటాయోననీ, చాలామంది సెలబ్రిటీలు భయపడ్డారనీ సుమన్ అన్నారు. కానీ ,తాను మాత్రం ఎవరికి భయపడకుండా జగన్ వ్యాఖ్యలను తన ఖండించాలని తెలిపారు.

'పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిళ్లు చేసుకుంటే ఏంటి? 30 చేసుకుంటే ఏంటి? అది వారి ఇష్టం. వారేమైనా కంప్లైంట్ చేశారా.. లేదు కదా.. వాళ్ళందరూ హ్యాపీగానే ఉన్నారు. వాళ్లకి లేనప్పుడు నీకేంటి బాధ. అది వారి ఇష్టం. రాజకీయాలు అన్నప్పుడు కేవలం పార్టీ ఎజెండా గురించి మాత్రమే మాట్లాడాలి. వ్యక్తిగత విషయాలను ప్రస్తావించకూడదు ' అని పేర్కొన్నానని సుమన్ అభిప్రాయపడ్డారు.
అదేవిధంగా నటి రోజా విషయంలో కూడా తాను స్పందించానని, తాను సినిమా వాడిని కాబట్టి.. తాను ఆమెకు సపోర్ట్ గా నిలిచాననీ, 99% సినిమాకు సంబంధించిన ఘటనలపై తాను మాట్లాడుతానని సుమన్ అన్నారు. నాయకత్వం అనేది ఇతరులను కామెంట్ చేయడం కాదని, తాను ముందుండి తన వినకుండా వాళ్ళని నడిపించే వాడే నిజమైన నాయకుడని పేర్కొన్నారు సుమన్.


Click it and Unblock the Notifications











