Pawan Kalyan OGలో జనం మర్చిపోయిన హీరో.. భలే ఛాన్స్ పట్టేశాడుగా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్రస్తుతం రాజకీయాలతో పాటు.. సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఆయన సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ అంటే ఓజీ. గ్యాంగ్ స్టార్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి సుజిత్ సింగ్ దర్శకుడు. ఇక ఈ మూవీలో మొదటి సారిగా తెలుగులో ఇమ్రాన్ హష్మి విలన్ గా చేస్తున్నాడు. అయితే వీరితో పాటే.. ఒకప్పుడు లవర్ బాయ్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరో.. నటిస్తున్నాడట. ఆయన ఎవరు.. ఏంటి అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

పవర్ స్టార్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమా ఓజీ (ఒరిజినల్ గ్యాంగ్ స్టర్). ఈ సినిమా రిలీజ్ అయితే బ్రేక్ ఇవ్వడానికి పవన్ అభిమానులు సిద్ధంగా ఉన్నారు. ఇక ఈ సినిమాను రన్ రాజా రన్, సాహో చిత్రాల దర్శకుడు సుజిత్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ మూవీకి డీవీవీ దానయ్య నిర్మాత. ఇక ప్రియాంక మోహన్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇక మొదటి సారిగా బాలీవుడ్ ముద్దుల వీరుడు ఇమ్రాన్ హష్మి ఇందులో విలన్ గా నటిస్తున్నాడు.

Actor Venkat Acted in Pawan Kalyan Sujeeth OG Pan India Movie

ఇక ఓజీ మూవీలో వీరితో పాటే.... తమిళ నటుడు అర్జున్ దాస్, శ్రియా రెడ్డి ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్ రికార్డులు సృష్టించింది. ఇక తమన్ అందించిన సంగీతం నెక్ట్స్ లెవెల్ అని చెప్పవచ్చు. ఇక చీతా సాంగ్ అయితే.. నెటిజన్స్ ను ఆకట్టుకుంటుంది. ఇప్పటికీ ఆ సాంగ్ ట్రెండింగ్ లోనే ఉంది. ఇక బ్రో సినిమా తర్వాత ఫుల్ లెంగ్త్ లో పవన్ కల్యాణ్ నటిస్తున్న సినిమా కావడం.. అభిమానులను ఆకట్టుకుంటుంది. రోజు రోజుకు ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొంటున్నాయి.

Actor Venkat Acted in Pawan Kalyan Sujeeth OG Pan India Movie

ఇక ఈ సినిమాలో ఒకప్పటి యంగ్ హీరో కూడా నటించబోతున్నారని తెలుస్తోంది. ఈ విషయాన్ని ఆ హీరోనే ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు. శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి వంటి లవ్ స్టోరీతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన నటుడు వెంకట్. ఆ తరువాత చిరంజీవితో కలిసి అన్నయ్య, భలేవాడివి బాసు, ఆనందం, శివరామ రాజు వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.

కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉన్న ఈ నటుడు.. ఇటీవల సుశాంత్ తో కలిసి ఇచ్చట వాహనములు నిలుప రాదు చిత్రంలో నటించాడు. ఇక ఓటీటీలో కూడా కొన్ని సినిమాలు కూడా చేశాడు. రన్ అనే వెబ్ సిరీస్ లో కూడా నటించాడు. ఇక సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టిన ఈ హీరో... OG సినిమాలో కూడా ఒక ముఖ్య పాత్ర చేసే అవకాశం అందుకున్నారని తెలుస్తోంది. దీనికి సంబంధించిన షూటింగ్ కూడా పూర్తి చేసినట్లు వెంకట్ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

Actor Venkat Acted in Pawan Kalyan Sujeeth OG Pan India Movie

అలాగే ఓజీ సినిమా చాలా బిగ్ స్కేల్ లో సుజిత్ తెరకెక్కిస్తున్నట్లు చెప్పుకువచ్చాడు. ఇంకా చాలామంది యాక్టర్స్ సినిమాలో ఉన్నట్లు తెలిపాడు. తెలుగు ఇండస్ట్రీలో ఇది ఒక బిగ్గెస్ట్ హిట్ ఫిలిం కానుందని వెల్లడించారు. ప్రస్తుతం వెంకట్ చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X